పోరాటమే ఊపిరిగా..! | Gautamiputra Satakarni takes off | Sakshi
Sakshi News home page

పోరాటమే ఊపిరిగా..!

Published Mon, May 23 2016 11:55 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

పోరాటమే ఊపిరిగా..! - Sakshi

పోరాటమే ఊపిరిగా..!

ఒకటో శతాబ్దం నాటి కాలం అది.  గౌతమీ పుత్ర శాతకర్ణి తన శత్రు దేశపు రాజుతో విజయమో... వీరస్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఎంతో మంది సైనికులు యుద్ధభూమిలో తమ ప్రాణాలను ఒడ్డి పోరాడుతున్నారు. మరి విజయం ఎవరిది...? ఆ సంగతి పక్కన పెడితే... ఈ పోరాట దృశ్యాలను ‘గౌతమీ పుత్ర శాతకరి’్ణ టీమ్ చిత్రీకరించింది. క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది.

ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. క్రిష్ మాట్లాడుతూ- ‘‘ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో దాదాపు వెయ్యి మంది షూటింగ్‌లో పాల్గొనగా బాలకృష్ణ, కబీర్‌బేడీల  మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. బాలకృష్ణ ఏకంగా రోజుకు 14 గంటల పాటు ఈ చిత్రం కోసం శ్రమిస్తు న్నారు. అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియాస్‌లలో చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి,
కెమేరా:  జ్ఞానశేఖర్,
మాటలు: బుర్రా సాయి మాధవ్,
సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement