తండ్రి నాలుగో పెళ్లిపై.. కూతురి ట్వీట్‌తో హల్‌చల్‌ | Kabir Bedi marries Parveen Dusanj, Pooja Bedi calls stepmom 'wicked witch'. Then deletes tweet | Sakshi
Sakshi News home page

తండ్రి నాలుగో పెళ్లిపై.. కూతురి ట్వీట్‌తో హల్‌చల్‌

Published Mon, Jan 18 2016 4:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

తండ్రి నాలుగో పెళ్లిపై.. కూతురి ట్వీట్‌తో హల్‌చల్‌

తండ్రి నాలుగో పెళ్లిపై.. కూతురి ట్వీట్‌తో హల్‌చల్‌

ముంబై: బాలీవుడ్ నటుడు కబీర్‌ బేడీ మరోసారి పెళ్లి చేసుకున్నారు. చాలాకాలంగా తనతో కలిసి ఉంటున్న 40 ఏళ్ల పర్వీన్ దుసాంజ్‌ను తన 70వ పుట్టినరోజున వివాహమాడారు. అయితే, వీరి పెళ్లిపై కబీర్‌ బేడీ కూతురు, నటి పూజాబేడి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు హల్‌చల్‌ చేశాయి.

'ప్రతి సాహస కథలోనూ ఒక క్రూరమైన మంత్రగత్తె లేదా రాక్షస సవతి తల్లి ఉంటుంది. నా విషయంలో ఇప్పుడే వచ్చింది. కబీర్ బేడీ ఇప్పుడే పర్వీన్‌ను పెళ్లి చేసుకున్నారు' అంటూ పూజాబేడీ ట్వీట్ చేసింది. ఈ కామెంట్‌ ట్విట్టర్‌లో హల్‌చల్ చేసింది. దీంతో ఈ కామెంట్‌ను పూజాబేడి తొలగించారు. తన తండ్రిపై చేసిన వ్యాఖ్యను తొలగించానని, ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాలని అన్నారు.

కబీర్‌ బేడీ, ఆయన మొదటి భార్య, ఒడిస్సీ డాన్సర్‌ ప్రతిమా బేడీకు పూజాబేడీ పుట్టారు. ఆ తర్వాత ప్రతిమా బేడీతో విడిపోయిన కబీర్‌ మరో ఇద్దరిని సుసాన్ హంఫ్రేయ్స్‌, నిక్కీ బేడిని వివాహమాడారు. ఈ పెళ్లిలు కూడా పెటాకులు కావడంతో గతకొంతకాలంగా పర్వీన్‌తో ఆయన సహజీవనం చేస్తున్నారు. కబీర్‌ బేడీతో కూతురు పూజాబేడీకి విభేదాలు ఉన్న విషయం తాజా కామెంట్‌తో మరోసారి వెల్లడైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement