ముంబై : కాస్టింగ్ కౌచ్ ఈ మధ్య అన్ని సినీ పరిశ్రమల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న పేరు. అవకాశాలు దక్కాలంటే తమ అవసరాలు తీర్చాలంటూ మేకర్లు.. నటీమణులను వేధించటమన్నది దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనిపై సీనియర్, జూనియర్ తేడా లేకుండా ప్రతీ హీరోయిన్లు స్పందించటం చూస్తున్నాం.
అయితే ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఈ సమస్య ఎదురవ్వక తప్పదంటున్నారు టాలెంటెడ్ నటి స్వర భాస్కర్. రాంఝ్‌నా, ప్రేమ్ రతన్ ధన్‌పాయో లాంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తానూ అలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నానని చెప్పారు. ముంబై మిర్రర్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు ఆమెను ఎలా వేధించాడో చెప్పుకొచ్చారు.
‘‘నేను అప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. ఓ చిత్ర అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నాను. ఆ చిత్ర దర్శకుడు అర్థరాత్రులు కూడా వదలకుండా నాతో సీన్ల గురించి చర్చించేవారు. గదికి రమ్మని చెప్పి గంటల తరబడి సోల్లు కబుర్లు చెప్పేవాడు. ఓసారి ఉన్నట్లుండి లవ్, సెక్స్ అంటూ మాట్లాడటం ప్రారంభించారు. దాంతో నాకు చాలా భయం వేసేది. మరోరోజు పీకల దాకా తాగి నా గదికి వచ్చారు. నన్ను కౌగిలించుకోవాలని ఉందంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే అప్పటికే నేను లైట్లు ఆపేసి ఉండటంతో పడుకున్నానేమో అనుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వెంటనే ఆ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ నిర్మాత దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. తర్వాత పూర్తి భద్రతతో షూటింగ్ కొనసాగిందంట. అదే సమయంలో ఆ దర్శకుడిని ఆమె గట్టిగా హెచ్చరించటంతో రెండు వారాలపాటు అతను షూటింగ్‌కు రాకుండా పోయాడంట. ఆ తర్వాత ఎలాగోలా ఆ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన ఆమె తర్వాత అతని మొహం కూడా చూడలేదంట. ‘కాస్టింగ్ కౌచ్ అనేది ఓ పెద్ద తప్పు. అవకాశాల కోసం లొంగిపోవటం అంటే ప్రాణాలు పొగొట్టుకోవటమే’ అని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్, సోనమ్ కపూర్ లతోపాటు వీరే ది వెడ్డింగ్ చిత్రంలో స్వర భాస్కర్ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment