ఆ నటికి ముద్దు పెట్టబోయాడట! | Swara Bhaskar About Casting Couch | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 2 2018 8:37 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Swara Bhaskar About Casting Couch - Sakshi

స్వర భాస్కర్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఈ మధ్య ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. హాలీవుడ్‌ ప్రొడ్యుసర్‌ హార్వీ వీన్‌స్టీన్‌ వ్యవహారంతో మొదలైన ‘మీ టూ’ క్యాంపైన్‌తో కాస్టింగ్‌ కౌచ్‌ పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. అది బాలీవుడ్‌ను తాకి సౌత్‌లోనూ పాకి, మన టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఎవరోకరు తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. 

తాజాగా బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందిస్తూ.. ‘నాకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది. నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఓ నిర్మాత దగ్గర పనిచేసే మేనేజర్‌ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడ’ని తనకు ఎదురైన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. మీడియా ముందు  బోల్డ్‌గా మాట్లాడటంతో అప్పట్లో వార్తల్లో కెక్కారు స్వర భాస్కర్‌. ‘వీరే ది వెడ్డింగ్‌’లో తాను చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌పై వచ్చిన విమర్శలను ఆమె ఘాటుగానే తిప్పికొట్టారు. కరీనా కపూర్‌, సోనమ్‌ కపూర్‌లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement