Swara Bhaskar Marries Political Activist Fahad Ahmad, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Swara Bhaskar Marriage: పొలిటికల్‌ లీడర్‌తో గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్‌ పెళ్లి

Feb 16 2023 6:08 PM | Updated on Feb 16 2023 7:19 PM

Swara Bhaskar Married With Political Activist Fahad Ahmad - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌ పెళ్లి పీటలు ఎక్కింది. తన స్నేహితుడు, ప్రియుడు ఫహద్‌ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది. అయితే తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. గత నెల జనవరి 6న పెళ్లి జరగగా నేడు( ఫిబ్రవరి 16న) సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్‌ వీడియో ద్వారా పంచుకుంది. 

చదవండి: బండ్ల గణేష్‌ షాకింగ్‌ ట్వీట్‌.. ఆ స్టార్‌ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా?

గత నెల జనవరి 6న వీరిద్దరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. రాజకీయ కార్యకర్త, సమాజ్‌వాది పార్టీ లీడర్‌ అయిన అహ్మద్‌ ఫహద్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఈ వీడియో షేర్‌ చేస్తూ ‘ప్రేమను వెతికినప్పుడు మొదట స్నేహం ఎదురువుతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో ఎండ్‌ అవుతుంది. ఈ జర్నీలో ఒకరినొకరం తెలుసుకున్నాం. ఫైనల్‌గా నా లవ్‌ దొరికింది. వెల్‌కమ్‌ టూ మై హార్ట్‌ ఫహద్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement