
స్వర భాస్కర్ (పాత చిత్రం)
సాక్షి, ముంబై : ఎలాంటి వ్యవహారంపైన అయినా సరే నిఖచ్ఛిగా మాట్లాడేతత్వం ఉన్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి స్పందించారు. కరీనా కపూర్‌ను ట్రోల్ చేస్తూ కొందరు చేసిన కామెంట్లపై ఆమె సీరియస్ అయ్యారు. ఓ వ్యక్తిని అయితే ఏకీపడేస్తూ ఆమె బదులు ఇచ్చారు. తాజాగా కరీనా కథువా ఘటనపై స్పందిస్తూ ఫ్లకార్డు పట్టుకున్న ఫోటోను స్వర భాస్కర్ తన ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.
ఆ ఫోటోకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ‘హిందువు అయి ఉండి ఓ ముస్లింను వివాహం చేసుకున్నావ్. పైగా అతనితో కాపురం చేసి ఓ కొడుకు కన్నావ్. మళ్లీ అతని తైమూరు అనే రాక్షస రాజు పేరు పెట్టుకున్నావ్. సిగ్గు లేదా?’ అని కామెంట్ చేశాడు. దీనికి స్వర భాస్కర్ అంతే ఘాటు బదులిచ్చింది. ‘నీ బతుక్కి నువ్వు సిగ్గుపడాలి. దేవుడు నీకు బుర్ర ఇస్తే దానిని కల్మషంతో నింపావు. భారతీయునిగా, హిందువుగా పుట్టి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. బహిర్గతంగా ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడటం సమంజసమేనా?’ అని ఆమె రీ ట్వీట్ చేశారు. మరికొందరికి కూడా ఆమె దాదాపు ఇలాంటి సమాధానాలే ఇచ్చారు.
#KareenaKapoorKhan #IndiaAgainstRape #JusticeForOurChild #JusticeforAsifa #JusticeForUnnao pic.twitter.com/NEqPsArNC6
— Swara Bhasker (@ReallySwara) 14 April 2018