The Kashmir Files: Trolls On Swara Bhasker Over Her Controversial Tweet, Deets Inside - Sakshi
Sakshi News home page

Trolls On Swara Bhasker: జనం పిచ్చోళ్లు కాదు నిన్ను నమ్మడానికి.. హీరోయిన్‌పై ట్రోలింగ్‌

Published Wed, Mar 16 2022 9:09 AM | Last Updated on Wed, Mar 16 2022 9:29 AM

Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri - Sakshi

Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరా భాస్కర్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్‌. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్‌ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్‌లు పెట్టి ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్‌. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్‌ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ.

అయితే ఈ ట్వీట్‌ 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' మూవీ డైరెక్టర్‌ వివేక్‌ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్‌ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్‌లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్‌ అవ్వండి.' అని నెటిజన్‌ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్‌కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. 
 


మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్‌ దాదాపు ఐసీయూ బెడ్‌పై ఉంది. ఈరోజు బాలీవుడ్‌కు అతనే ఆక్సిజన్‌ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ తారలు కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్, యామీ గౌతమ్‌, హన్సల్‌ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement