Career Made Up Of Roles Rejected By Others, Swara Bhaskar Says - Sakshi
Sakshi News home page

Swara Bhaskar: ఆ పాత్రలో చేయాలని ఎవరు కోరుకుంటారు: స్వరా భాస్కర్‌

Published Wed, Mar 9 2022 10:57 AM | Last Updated on Wed, Mar 16 2022 8:37 AM

Swara Bhaskar Says Her Career Made Up Of Roles Rejected By Others - Sakshi

Swara Bhaskar Says Her Career Made Up Of Roles Rejected By Others: బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్‌ లైఫ్‌ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్‌ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్‌. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్‌కు గురవుతారు. అయితే తాజాగా తాను నటించిన పాత్రల గురించి పలు ఆసక్తిర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలు ఇతరులు వద్దనుకోవడం వల్లే తనకు వచ్చాయని పేర్కొన్నారు. 

'రాంజనా, ప్రేమ్‌ రతన్ ధన్‌ పాయో వంటి చిత్రాలలో నాకు వచ్చిన పాత్రలను మొదటగా వేరే నటీమణులకు ఆఫర్‌ చేశారు. ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో సినిమాలో సల్మాన్‌ ఖాన్‌కు చెల్లెలిగా చేయాలని ఎవరు కోరుకుంటారు. ఇలాంటి పాత్రలన్నీ ఆఖరి నిమిషంలో అకస్మాత్తుగా వదులుకునేసరికి చివరిగా నన్ను సంప్రదించేవారు. అయితే ఇదందా నన్ను పెద్దగా బాధించేది కాదు. ఒక పాత్రను ఒప్పుకునేప్పుడు నేను బాక్సాఫీస్‌ గురించి, ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే విషయాలు పెద్దగా ఆలోచించను. ఇంకా వీరే ది వెడ్డింగ్‌ సినిమాలో ముందుగా నాకు బదులు రియా కపూర్‌ చేయాల్సింది.  కానీ, ఆ పాత్రను నాకివ్వమని స్వయంగా రియా కపూర్‌ ఒప్పించింది.' అని పేర్కొంది స్వరా భాస్కర్‌. ఇలా ఇతరులు తిరస్కరించిన పాత్రలతో తన కెరీర్‌ రూపొందినట్లు, ఆ పాత్రలతోనే తనకు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement