roles
-
అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది: హీరోయిన్
Yashika Anand About Working With SJ Surya In Kadamaiyai Sei: నాగర్ ఫిలిమ్స్ పతాకంపై టి.ఆర్ రమేష్, ఎస్ జహీర్ హుస్సేన్ కలిసి నిర్మింన చిత్రం 'కడమై సెయ్'. ఎస్జే సర్య, యాషిక ఆనంద్ జంటగా నటించిన ఈ త్రానికి వెంకట్ రాఘవన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్టు 07) సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో చిత్ర యూత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నటి యాషిక ఆనంద్ మాట్లాడుతూ.. ''దర్శకుడు కథ చెప్పినప్పుడు అందులోని హీరోయిన్ పాత్రకు నేను న్యాయం చేయగలనా..? అని సందేహం కలిగింది. ఎందుకంటే ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు నా వయస్సు 21. అలాంటిది ఇందులో ఓ బిడ్డకు తల్లిగా నటించే పాత్ర నాది. అప్పటికే నాకు గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంది. దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఈ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కడం సంతోషంగా ఉంది. ఎస్జే సూర్యతో కలిసి నటించడం మంచి అనుభవం'' అని పేర్కొంది. నటుడు ఎస్ జే సూర్య మాట్లాడుతూ చిత్ర నిర్మాత రమేష్ చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇది ఆయన శ్రమతోనే రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. మరో నిర్మాత జాకీర్ హుస్సేన్ ఆయనకు పక్క బలంగా నిలిచారన్నారు. దర్శకుడు వెంకట్ రాఘవన్ చిత్ర కథను తనకు చెప్పినప్పుడు అందులో కంటెంట్ చాలా ముఖ్యంగా అనిపించిందన్నారు. ఈ చిత్రకథ ప్రత్యేకంగా అనిపించడంతో కచ్చితంగా నటించాలని భావించానన్నారు. 'కడమై సెయ్' చిత్రం మం విజయం సాధిస్తుందని, కచ్చితంగా ఇది హిందీలోను రీమేక్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్‌లో ఫిక్సయితే.. బ్లైండ్‌గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్‌తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఆంధ్ర ప్రదేశ్‌లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్‌గా రాజ్‌కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్‌ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్‌గా సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్‌తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్‌కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్‌లాంటి పాత్రలతో బాక్సాఫీస్‌పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
చెల్లెలి పాత్రల్లో స్టార్ హీరోయిన్స్..
తెలుగు తెరపై అన్నా-చెల్లెలి అనుబంధం అంటే ముందు గుర్తొచ్చే సినిమా ‘రక్త సంబంధం’. హీరో–హీరోయిన్గా హిట్ పెయిర్ అనిపించుకున్న ఎన్టీఆర్–సావిత్రి అన్నా–చెల్లెలిగానూ ఆ సినిమాలో మెప్పించారు. కథానాయికగా సావిత్రి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రిస్క్ అనుకోకుండా ‘సిస్టర్’ క్యారెక్టర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ తరంలో హీరోయిన్లుగా మంచి ఫామ్‌లో ఉన్న నయనతార, పూజా హెగ్డే, కీర్తీ సురేశ్ కూడా చెల్లెలి పాత్ర చేయడానికి వెనక్కి తగ్గడంలేదు. ఈ చెల్లెళ్లుగా మెరవనున్న స్టార్ హీరోయిన్స్, చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘సైరా’లో భార్య.. ‘గాడ్ ఫాదర్’లో చెల్లెలు ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరోవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూ నయనతార బిజీ బిజీగా ఉన్నారు. ఒక హిందీ, ఒక మలయాళం, రెండు తమిళ చిత్రాలు, తెలుగులో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’తో కలుపుకుని ఐదు చిత్రాలతో బిజీగా ఉన్నారు నయన. మిగతా చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీలక పాత్ర చేస్తున్నారామె. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మలయాళంలో హీరో మోహన్‌లాల్ చెల్లెలి పాత్రలో మంజు వారియర్ కనిపించారు. కథ ప్రకారం హీరోకి జోడీ ఉండదు. తెలుగులోనూ చిరంజీవికి జోడీ ఉండదని చెప్పొచ్చు. అందుకే నయనతార చేస్తున్నది చిరంజీవి చెల్లెలి పాత్ర అనే ఊహాగానాలు ఉన్నాయి. నయనతారది కీలక పాత్ర అని పేర్కొన్న చిత్రబృందం ఆమెది చెల్లెలి పాత్ర అని మాత్రం స్పష్టం చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరు సిస్టర్ పాత్రనే ఆమె చేస్తున్నారని తెలిసింది. ‘సైరా’లో చిరంజీవి భార్యగా నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’లో అన్నాచెల్లెళ్లుగా ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకులకు తప్పకుండా ఉంటుంది. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సిస్టర్ ఆఫ్ బోళా శంకర్ కీర్తీ సురేశ్ మహానటి.. అందులో డౌటే లేదు. ‘మహానటి’ చిత్రం ఆ విషయాన్ని నిరూపించింది. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంలో లేడీ ఓరియంటెడ్, రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న కీర్తీ సురేష్ తొలిసారి చెల్లెలి పాత్రలో కనిపించిన చిత్రం ‘పెద్దన్న’. ఇందులో రజనీకాంత్ చెల్లెలిగా కనిపించారామె. ఇప్పుడు ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తున్నారు. ఇలా వరుసగా చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వచ్చే అవకాశం లేకపోలేదు కదా? అని కీర్తీ సురేశ్‌తో అంటే.. ‘వచ్చే అవకాశాల గురించి ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి క్యారెక్టర్లు వదులుకోవాలనుకోను. అటు రజనీ సార్, ఇటు చిరంజీవి సార్ ఇద్దరి సినిమాల్లో చాన్స్ అంటే చిన్న విషయం కాదు కదా’ అన్నారు కీర్తి. గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘బోళా శంకర్’లో చిరంజీవికి కీర్తి సురేశ్ రాఖీ కడుతున్న ఫొటో విడుదలైంది. ఆ ఫొటోలో ఈ అన్నాచెల్లెళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. వెంకటేశ్ చెల్లెలు? గ్లామరస్ స్టార్ పూజా హెగ్డే ఒకవైపు మంచి మసాలా సినిమాల్లో హీరోయిన్గా చేయడంతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. ‘గని’ చిత్రంలో కనిపించినట్లు హోమ్లీ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు. తాజాగా ఆమెకు చెల్లెలి పాత్రకు అవకాశం వచ్చిందని సమాచారం. అయితే అది హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ చిత్రంలో ఈ కండలవీరుడి సరసన కథానాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఇందులో వెంకటేశ్ కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంకీ చెల్లెలిగా పూజా కనిపిస్తారట. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకుడు. చదవండి: జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ నా సినిమాకు నాకే టికెట్లు దొరకలేదు: యంగ్ హీరో -
వారు తిరస్కరించిన పాత్రలతోనే నా కెరీర్ రూపొందింది..
Swara Bhaskar Says Her Career Made Up Of Roles Rejected By Others: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్‌కు గురవుతారు. అయితే తాజాగా తాను నటించిన పాత్రల గురించి పలు ఆసక్తిర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలు ఇతరులు వద్దనుకోవడం వల్లే తనకు వచ్చాయని పేర్కొన్నారు. 'రాంజనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి చిత్రాలలో నాకు వచ్చిన పాత్రలను మొదటగా వేరే నటీమణులకు ఆఫర్ చేశారు. ప్రేమ్ రతన్ ధన్‌పాయో సినిమాలో సల్మాన్ ఖాన్‌కు చెల్లెలిగా చేయాలని ఎవరు కోరుకుంటారు. ఇలాంటి పాత్రలన్నీ ఆఖరి నిమిషంలో అకస్మాత్తుగా వదులుకునేసరికి చివరిగా నన్ను సంప్రదించేవారు. అయితే ఇదందా నన్ను పెద్దగా బాధించేది కాదు. ఒక పాత్రను ఒప్పుకునేప్పుడు నేను బాక్సాఫీస్ గురించి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయాలు పెద్దగా ఆలోచించను. ఇంకా వీరే ది వెడ్డింగ్ సినిమాలో ముందుగా నాకు బదులు రియా కపూర్ చేయాల్సింది. కానీ, ఆ పాత్రను నాకివ్వమని స్వయంగా రియా కపూర్ ఒప్పించింది.' అని పేర్కొంది స్వరా భాస్కర్. ఇలా ఇతరులు తిరస్కరించిన పాత్రలతో తన కెరీర్ రూపొందినట్లు, ఆ పాత్రలతోనే తనకు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. -
పాటతో అలరిస్తూ.. నటనతో మైమరిపిస్తూ..
సాక్షి, మఠంపల్లి (నల్లగొండ): మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన కొమ్ము బొందయ్య, ఎమీలియా దంపతులకు కుమారుడే సర్వయ్య. వీరిది నిరుపేద కు టుంబం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచే సర్వయ్య పాటలు పాడుతూ గాన గంధర్వుడిగా పేరుగండించాడు. పాటలపై మక్కువ పెంచుకుని.. సర్వయ్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించాడు. మూడో తరగతి చదువుతున్న రోజుల్లోనే సినిమా పాటలంటే మక్కు వ. ప్రముఖనేపథ్య గాయకుడు మహ్మద్ రఫీ ఆలపించిన ‘నా మది నిన్ను పిలిచింది గానమై’ అనే పాటను అచ్చుగుద్దినట్లు పాడి ఔరా అనిపించాడు. అప్పటినుంచి పాఠశాల స్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. సంగీతంపై ఆసక్తితో.. సర్వయ్య ప్రాథమికోన్నత విద్యను గ్రామంలోనే పూర్తి చేసుకున్నాడు. తదనంతరం పదో తరగతి వరకు మండల కేంద్రంలోని వీవీహెచ్ఎస్లో అభ్యసించాడు. అయితే, సంగీతంపై ఉన్న ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజనగరం జిల్లా కేంద్రంలోని మ్యూజిక్ కాలేజీలో చేరాడు. కాగా, కుటంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మూడేళ్ల కోర్సును ఏడాది వరకే తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతూనే గిటార్ నేర్చుకున్నాడు. చదువు ఖర్చుల నిమిత్తం బ్యాండ్ మేళంలో చేరి చుట్టుపక్కల నిర్వహించే శుభకార్యాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడు. గానానికే పరిమితం కాకుండా.. సర్వయ్య కేవలం గానానికే పరిమితం కాకుండా నాటకాలపై దృష్టిసారించాడు. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాల్లో రాముడు, కృష్ణుడు, హరిచంద్రుడు, అర్జునుడు, బాలవర్తిరాజు తదితర పాత్రలను సత్యహరిశ్చంద్ర, శ్రీకష్ణరాయబారం, బాలనాగమ్మ, రామాంజనేయయుద్ధం, రక్తపిపాసి లాంటి నాటకాల్లో సైతం విజయవాడ, గన్నవరం, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తెనాలిలో 2017లో సామ్రాట్ అశోక నాటకంలో అశోక చక్రవర్తిగా నటించి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. అంతేగా క తాను వివిధ పాత్రల్లో నటించి హైదరాబాద్‌లో డాక్టర్ అబ్దుల్‌కలాం అవార్డు, డా.బాలసుబ్రహ్మణ్యం అవార్డు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి కళాసమితి అవార్డులు దక్కించుకున్నాడు. ప్రభుత్వం పోత్సహించాలి ప్రభుత్వం గ్రామీణ కళాకారులను ఆదుకోవాలి. నైపుణ్యం ఉన్న కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. వారికి తగిన సంగీత పరికరాలు అందజేస్తే ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పొందుతారు. ముఖ్యంగా కాళాకారులకు పింఛన్ సౌకర్యం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. పాటలు పాడటం,నాటకాలు వేయడమంటే ఎంతో ఇష్టం. జీవిత కాలం కళామతల్లి సేవలోనే పరితపిస్తా. – కొమ్ము సర్వయ్య, కళాకారుడు చౌటపల్లి చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే.. -
మిస్టర్ సీతమ్మ
గోవింద మౌర్య అనే యువకుడు గత పదిహేడేళ్లుగా నిష్ఠగా సీతమ్మవారి పాత్రను పోషిస్తున్నాడు. ఇంత నిష్ఠా తన కుటుంబాన్ని పోషించుకోడానికే. మగవారు ఆడ పాత్రలు వేయడం మహాభారత కాలం నాటి నుంచి చూస్తున్నాం. అర్జునుడు వేసిన బృహన్నల పాత్ర అటువంటిదే కదా. ఒకప్పుడు కూచిపూడి నాట్యం మగవారే ఆడవేషంలో చేసేవారు. ఇప్పటికీ ఇటువంటి సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. నెలక్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించిన ఆడ పాత్ర కూడా అమిత ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఒక కాల్ సెంటర్లో పనిచేస్తాడు. ఆడ గొంతుతో మాట్లాడుతుంటాడు. అంతేకాదు తను నివసించే ప్రాంతంలో ‘రామ్‌లీల’ నాటకంలో నటుడు కూడా. అందులో సీతాదేవి పాత్ర పోషిస్తుంటాడు. నాటకం అయ్యాక, మామూలు మగ దుస్తుల్లో ఉన్నా కూడా స్థానికులొచ్చి అతడి.. అంటే సీతాదేవి ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు. ఇది సినిమా కథ. ఇటువంటిదే నిజ జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతోంది. ముప్పై ఆరు సంవత్సరాల గోవింద మౌర్య అనే కళాకారుడు ఢిల్లీ రామలీలా సన్నివేశంలో, పదిహేడు సంవత్సరాలుగా సీతాదేవి పాత్రను ఎంతో భక్తి, నేర్పుగా ప్రదర్శిస్తున్నాడు. ఆయన మేకప్ తీసేసినప్పుడు కూడా ఎంతోమంది భక్తులు ఆయన (సీతాదేవి) ఆశీర్వాదాల కోసం రావడం అతడికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘‘నన్ను చూసి చాలామంది అప్పుడప్పుడు, ‘అదిగో సీతను చూడు. మేకప్ లేకపోయినా కూడా అచ్చంగా సీతమ్మ తల్లిలా ఉన్నాడు’ అంటూ నన్ను ఆరాధనగా చూస్తుంటారు’’ అంటారు గురుగ్రామ్‌కి చెందిన ఈ గోవింద మౌర్య. గోవింద మౌర్య బాల్యం నుంచి తన గ్రామంలో జరిగే రామ్‌లీల నాటకాన్ని చూసేవాడు. ‘‘ఓసారి నేను రామ్‌లీలా చూస్తున్నాను. నా గొంతు వారికి నచ్చింది. నన్ను స్టేజీ మీదకు తీసుకువెళ్లి, నాతో మాట్లాడించారు’’ అని బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు గోవింద మౌర్య. ప్రారంభంలో అతడికి సీతాదేవి తల్లి పాత్రను ఇచ్చారు. పదిహేను రోజులవ్వగానే సీతాదేవి పాత్ర ఇచ్చారు. సీతాదేవి పాత్రలో – ‘‘సఖీ, ఒక్కసారి నిలువుము. నాకు కొంచెం బెదురుగా ఉంది’’ అనే డైలాగులు వింటుంటే అమ్మాయే మాట్లాడుతోందేమో అనుకునేలా మాట్లాడతారు గోవింద. సీతాదేవిని కలవడానికి శ్రీరామచంద్రుడు పుష్పవాటికకు వచ్చిన సందర్భంలో ఈ సంభాషణ ఉంటుంది. అయితే సీతాదేవి పాత్రను గోవింద పోషించడం అతని కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ‘‘కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు తప్పదు. గతంలో నేను లెదర్ ఫ్యాక్టరీలో పనిచేశాను. అది మూత పడటంతో ఇంటి ఆర్థిక అవసరాల కోసం ఈ పాత్ర పోషిస్తున్నాను’’ అంటారు గోవింద. అయితే ఈ పాత్ర పోషించినందుకుగాను పారితోషికం ఆయనకు నగదు రూపంలో అందటం లేదు. ఇంటికి పనికివచ్చే వస్తువులు ఇస్తున్నారు. ‘‘నేను సీతాదేవి వేషం వేసుకున్నాక, ఒక్కరు కూడా హేళన చేయరు. పైగా నా పాదాలకు నమస్కరిస్తారు. మేకప్ తీశాక కూడా ఎవ్వరూ నన్ను ఎగతాళి చేయరు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు రామ్‌లీలాలో నటిస్తున్నారు. కాని ఆడపాత్రలను మగవారు పోషించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది’’ అంటారు గోవింద. . – రోహిణి -
కోటి ఇచ్చినా అలా చేయను
తమిళసినిమా : కోటి రూపాయిలిచ్చినా ఆ పని మాత్రం చేయను అంటోంది నటి నిత్యామీనన్. ఈ అమ్మడు ఇతర నటీమణులకు కాస్త డిఫెరెంట్ అనే చెప్పాలి. 2005 నుంచి సినిమా రంగంలో కొనసాగుతున్న నటి నిత్యామీనన్. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ కథానాయకిగా తన పరిధిని విస్తరించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ప్రవర్తనను చూసి కొందరు పొగరుబోతు అని కూడా అంటుంటారు. 180 చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచయం అయిన నిత్యామీనన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం 2015లో మణిరత్నం దర్శకత్వంలో నటించిన కాదల్ కణ్మణి చిత్రమే. ఆ చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత విక్రమ్‌కు జంటగా ఇరుముగన్, సూర్యతో 24, విజయ్ సరసన మెర్శల్ వంటి చిత్రాల్లో నటించింది. మెర్శల్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించినా కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ తరువాత నిత్యామీనన్ కోలీవుడ్‌లో మరో చిత్రంలో నటించలేదు. కారణాలేమిటంటే ఈ అమ్మడు ఏ అవకాశాన్నీ ఒక పట్టాన అంగీకరించదని, పలు కండిషన్స్ పెడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిత్యామీనన్ ఇచ్చిన ఒక భేటీలోనూ ఇదే విషయాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఏం చెప్పిందో చూద్దాం. పారితోషికం ఎంత ఇచ్చినా మహిళలను కించపరచే పాత్రల్లోనూ, పక్కా వ్యాపార దృక్పథంతో కూడిన పాత్రల్లో నటించడానికి నేను అంగీకరించను. అంతే కాదు నేను కథలను ఎంపిక చేసుకునే విధానం డిఫెరెంట్‌గా ఉంటుంది. కథ సామాజానికి పనికొచ్చేదిగా ఉందా, లేదా అందులో నేను నటిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? లాంటి పలు విధాలుగా ఆలోచిస్తాను. ఇక కథ నచ్చితే అందులో నా పాత్ర ప్రాముఖ్యత ఎంత అన్న విషయం పట్టించుకోను అని అన్న నిత్యామీనన్ ఈ మధ్య తెలుగులో ‘అ’ అనే చిత్రంలో లెస్బియన్ పాత్రలో నటించడానికి వెనుకాడలేదన్నది గమనార్హం. -
సంజయ్ దత్ బయోపిక్.. ఏ పాత్రల్లో ఎవరు?
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా వేచి చూస్తున్న సంజయ్ దత్ బయోపిక్ సంజు టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిర్వాణీ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్ తన 22 ఏట నుంచి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇరుకున్న దాకా జరిగిన పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు చూయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్న పరేష్ రావల్, మనిషా కోయిరాలా, దియా మీర్జా పాత్రల గురించి మీడియాకు వెల్లడించారు. సునీల్ దత్‌గా పరేశ్ రావల్ ఈ సనిమాలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేష్ రావల్ పోషిస్తున్నట్లు దర్శకుడు ధృవీకరించారు. తర్వాత విడుదల చేసే పరేష్‌ను ఇంట్రడ్యూస్ చేస్తామని తెలిపారు. నర్గీస్ దత్‌గా మనీషా కోయిరాలా సంజయ్‌దత్ తల్లిపాత్రకు మనీషా కోయిరాలాను తీసుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ బాధితురాలే. విదేశాలలో చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారి నుంచి మనీషా విజయవంతంగా బయటపడిన విషయం తెల్సిందే. సంజయ్ దత్, మనీషా కోయిలారా కలిసి యాల్గార్, కార్టూస్, సనమ్ చిత్రాల్లో నటించారు. మాన్యతా దత్‌గా దియా మీర్జా సంజయ్ దత్ జీవితాన్ని సమూలంగా మార్చిన మూడో భార్య మాన్యతా దత్ పాత్ర నటి దియా మీర్జాను ఎంపిక చేశారు. వీరిద్దరికీ 2008లో పెళ్లి అయిన సంగతి తెల్సిందే. సంజయ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ ఆమెనే చక్కబెట్టేవారు. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ, రెండో భార్య రియా పిళ్లైల పాత్రలకు ఎవరిని తీసుకునేది దర్శకుడు ధృవీకరించలేదు. సంజయ్ బాల్య మిత్రుడి పాత్రకు విక్కీ కౌశల్ సంజయ్ దత్ బాల్య మిత్రుడు కుమార్ గౌరవ్ పాత్రకు విశాల్ కౌశల్‌ను తీసుకుంటున్నట్లు ఊహాగానాలు గతంలో వినిపించాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ విశాల్ కౌశల్‌ను ఈ పాత్రకు తీసుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు. సంజయ్ దత్ రెండో సోదరి నమ్రతా దత్ భర్తే ఈ కుమార్ గౌరవ్. తొలి చిత్ర సహనటి పాత్రకు సోనమ్ సంజయ్ దత్ తొలి చిత్రం రాఖీలో సంజయ్‌తో జోడీ కట్టిన టీనా మునిమ్ పాత్రకు సోనమ్ కపూర్‌ను తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అయితే ట్రైలర్ వస్తేగానీ ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సల్లూ భాయ్ పాత్రకు జిమ్ సర్భ్ సంజయ్ దత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ పాత్రకు జిమ్ సర్భ్ను తీసుకుంటున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఒకానొక సమయంలో వారిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ కలిసి సాజన్, చల్ మేరే భాయ్, ఓమ్ శాంతి ఓం సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. జర్మలిస్టు పాత్రలో అనుష్క శర్మ ఈ సినిమాలో అనుష్క శర్మ జర్మలిస్టు పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టు పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. కరిష్మా టన్నా, బొమన్ ఇరానీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కరిష్మా టన్నా, మాధురీ దీక్షిత్ పాత్రంలో, బొమన్ ఇరానీ, కాంటే సినిమా దర్శకుడు సంజయ్ గుప్తా పాత్రలకు తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ బయోగ్రఫీ ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. -
సినీ కృష్ణుడు
-
సింగిల్‌గా హ్యాపీ....పెళ్లికి తొందర లేదు
హైదరాబాద్: ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఒంటరిగా సంతోషంగానే ఉన్నానని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విలక్షణ నటుడు దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. అప్పుడే పెళ్లికి తొందరేముందంటూ వ్యాఖ్యానించాడు. 2015 సంవత్సరంలో చాలా ఉత్థాన పతనాలను చవిచూసిన బల్లాలదేవ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో ఏకకాలంలో పనిచేయడంలో పెద్ద కష్టమనిపించలేదని రానా తెలిపాడు. ఈ సంవత్సరం తీవ్రమైన ఎత్తు పల్లాల మధ్య గడిచిందని, మంచి, చెడు రెండింటిని మిగిల్చిందని అతడు గుర్తు చేసుకున్నాడు. జీవితంలో 2015 సంవత్సరం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నాడు. ముఖ్యంగా తాతగారు రామానాయుడ్ని కోల్పోవడం చాలా బాధ కలిగించిందని తెలిపాడు. అలాగే రెండు సంవత్సరాల విరామం తరువాత వచ్చిన బాహుబలి, రుద్రమదేవి ఘన విజయం సాధించి తన కెరియర్లో మైలురాళ్లుగా నిలిచాయని రానా పేర్కొన్నాడు. 'కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే, సినిమా అన్నది కలకాలం నిలబడే శిల్పం' అని తాతగారు ఎపుడూ చెప్పే మాటలను గుర్తు చేసుకుంటూ వుంటానని రానా పేర్కొన్నాడు. విలక్షణమైన, విభిన్నమైన క్యారెక్టర్లను చేయడమే తనకిష్టమని సింగిల్ ఫార్ములా పాత్రలంటే తనకు పడదని తెలిపాడు. పాత్ర నచ్చితే దాని ప్రాధాన్యాన్ని బట్టి నిడివితో సంబంధం లేకుండా క్యారెక్టర్‌ను ఎంచుకుంటానని చెప్పాడు. కథ నచ్చితే రెండో ఆలోచనల లేకుండా విలన్ పాత్ర చేయడానికైనా సిద్ధమని, రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో నటించేందుకు అదే కారణమని తెలిపాడు. సినిమాల్లో నటించే పాత్రల ద్వారా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని ఈ కండలవీరుడు చెప్పుకొచ్చాడు. బెంగళూరు డేస్ సినిమా తనకు మంచి అనుభవాన్ని మిగిల్చిందని రానా తెలిపాడు. సినిమాల్లో డ్యాన్సులు చేయాల్సిన అవసరం తనకు కనిపించలేదని, అందరూ హీరోలు చేసే పనే అని..మళ్లీ కొత్తగా తనెందుకు చేయాలని ప్రశ్నించారు. వాస్తవానికి అనవసరమైన పాటలు, డ్యాన్సులు తనకు నచ్చవన్నారు. 'నా ఇష్టం' లాంటి సినిమాలు తనకు సరిపడవని, అసలు ఆ సినిమా తాను చేసి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించాడు. చెన్నై వరద బాధితులకు సహాయ పనులతోనూ తన సోదరి మాళవిక కూతురు అయిరాతో ఈ సంవత్సరాంతం గడిచిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేకమైన, బెంచ్ మార్క్‌గా నిలిచే సినిమాల్లో నటించాలని ఉందని తెలిపాడు.