వీరే ది వెడ్డింగ్‌ ట్రైలర్‌.. వెరీ బోల్డ్‌ | Veere Di Wedding Trailer Released | Sakshi
Sakshi News home page

వీరే ది వెడ్డింగ్‌ ట్రైలర్‌.. వెరీ బోల్డ్‌

Published Wed, Apr 25 2018 6:17 PM | Last Updated on Wed, Apr 25 2018 8:38 PM

Veere Di Wedding Trailer Released - Sakshi

వీర్‌ ది వెడ్డింగ్‌ సినిమా స్టిల్‌

ముంబై : తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్‌ ఖాన్‌ నటిస్తున్న తొలి సినిమా కావడంతో ‘వీరే ది వెడ్డింగ్‌’ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నలుగురు స్నేహితురాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. 2 నిమిషాల 49 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. శశాంఖ్‌ ఘోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబోతో పాటు సోనమ్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు.

భిన్న మనస్తత్వాలు కలిగిన నలుగురు యువతుల జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న పరిణామాల సమాహారమే ఈ సినిమా. సోనమ్‌ కపూర్‌కు ఎదురైన సమస్య గురించి మిగిలిన ముగ్గురు స్నేహితురాల్ల మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ట్రైలర్‌ బోల్డ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. కరీనా కపూర్‌కు ఓ యువకుడు ప్రపోజ్‌ చేయడంతో పెళ్లి కోసం సిద్ధమైన ఆమె ఇచ్చే బ్యాచిలరేట్‌ పార్టీ, సంగీత్‌, ఇతర పెళ్లి వేడుకలతో సరదాగా సాగుతుంది. అదే సమయంలో నలుగురు స్నేహితురాళ్లు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. బాలాజీ టెలిఫిల్మ్స్‌, అనిల్‌ కపూర్‌ ఫిల్మ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సంయుక్తంగా నిర్మించాయి. బెబో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వీర్‌ ది వెడ్డింగ్‌ మే 1న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement