భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 83వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆయనతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
దేశాన్ని ఏకం చేయాలనే లక్ష‍్యంతో రాహుల్ ఈ పాదయాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది.
ఇటీవలే రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. భర్త రాబర్ట్‌తో వాద్రాతో వచ్చి తొలిసారి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాలను కవర్ చేసి 1,209 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
చదవండి: గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 11 గంటల వరకు 18.95% పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment