rahul ganhdi
-
రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయన నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని పేర్కొంది. కాగా.. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ అన్నారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం కేసు పెట్టారు. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసి ఎంపీగా తొలగించింది. చదవండి: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్ -
'అమృత కాల' బడ్జెట్ కాదు.. 'మిత్ర కాల' బడ్జెట్.. రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఇది అమృత కాల బడ్జెట్ కాదు.. మిత్ర కాల బడ్జెట్ అని రాహుల్ సెటైర్లు వేశారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలోని ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40శాతం సంపద ఉందని, 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. అయినా మోదీ వీటిని అసలు పట్టించుకోరని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత్ భవిష్యత్తును నిర్మించే రోడ్‌మ్యాప్ ప్రభుత్వం వద్ద లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు. ‘Mitr Kaal’ Budget has: NO vision to create Jobs NO plan to tackle Mehngai NO intent to stem Inequality 1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care! This Budget proves Govt has NO roadmap to build India’s future. — Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023 చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
రూ.500కే వంటగ్యాస్.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్న జనాన్ని ఇప్పటికైనా ఆదుకోండని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ సందర్భంగా రాజస్థాన్ పేదలకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ కల్పిస్తున్న ఉపశమనాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ మంగళవారం హిందీలో ట్వీట్లు చేశారు. ‘ కేంద్ర ప్రభుత్వం వసూలుచేస్తున్న ధర కంటే సగం ధరకే రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది చూసైనా మీ బడా పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు లబ్ధి చేకూర్చడం ఆపి ప్రజలకు ఉపశమనం కల్పించే పనులు మొదలుపెట్టండి’ అని ట్వీట్‌చేశారు. చదవండి: ఖర్గే వ్యాఖ్యలపై... దద్దరిల్లిన పార్లమెంటు -
Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 83వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆయనతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్ ఈ పాదయాత్రను సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న యాత్ర కశ్మీర్లో ముగియనుంది. ఇటీవలే రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. భర్త రాబర్ట్‌తో వాద్రాతో వచ్చి తొలిసారి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాలను కవర్ చేసి 1,209 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ యాత్రలో పాల్గొన్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత ఎన్నికలు.. 11 గంటల వరకు 18.95% పోలింగ్ -
భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా?
భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందకు సంబంధించిన ఓ వీడియోనూ ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ వీడియోను మొదట మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్వీట్ చేసిందని, కానీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు గమనించాక వెంటనే దాన్ని డిలీట్ చేసిందని మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని విమర్శలు గుప్పించారు. After Richa Chaddha’s public application to join Rahul Gandhi’s Bharat “Jodo” Yatra, “Pakistan Zindabad” (listen towards the end of the video) slogans raised in Khargon. INC MP posted the video and then deleted it after the faux pas came to light. This is Congress’s truth… pic.twitter.com/ZkVEkd4pCf — Amit Malviya (@amitmalviya) November 25, 2022 అయితే మాలవీయ ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఖండించారు. బీజేపీ ఎడిట్ చేసిన వీడియోనూ షేర్ చేసి తమపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. A video doctored by the Dirty Tricks Department of the BJP is doing the rounds to discredit the highly successful #BharatJodoYatra. We are taking the necessary legal action immediately. We are prepared for such tactics, and there will be payback. — Jairam Ramesh (@Jairam_Ramesh) November 25, 2022 ఈ విషయంపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 4న మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం.. -
రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంజయ్ రౌత్.. కటీఫ్ లేనట్టే?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా గతవారం వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే అవసరమైతే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపించడం చూస్తుంటే ఇది స్ఫష్టమవుతోంది. సోమవారం ట్వీట్ చేసిన రౌత్.. రాహుల్ గాంధీ తనకు ఆదివారం ఫోన్ చేసినట్లు వెల్లడించారు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని, యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు వివరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాహుల్ తనతో మాట్లాడారని రౌత్ చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలోని తన మిత్రులు సంబరపడ్డారని విమర్శించారు. వాళ్లు మొగలుల కాలం నాటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాహుల్ తమతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. ప్రేమ, కరుణపైనే ప్రధానంగా దృష్టి సారించి ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కొనియాడారు. రౌత్ వ్యాఖ్యలను గమనిస్తే మహావికాస్ అఘాడీకి బీటలు పడే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. pic.twitter.com/FpaxllR7jk — Sanjay Raut (@rautsanjay61) November 21, 2022 చదవండి: మెగాస్టార్‌పై ప్రధాని ప్రశంసల వర్షం.. తెలుగులో ట్వీట్ చేసిన మోదీ -
రఫెల్ డీల్ : రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజకీయాల్లో వివాదాల పుట్టగా పేరొందిన రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్క్ష్యంగా చేసుకుని.. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. భారతీయ ఖజానాను రఫెల్ యుద్ధ విమానాల కోసం దోచుకున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా 2024 ఎన్నికల సమయానికి రఫెల్ జెట్స్ భారత సైన్యానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, అది తమకు ఎన్నికల్లో ఎంతో లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తీవ్రంగా ఖండించారు. భారత సైన్యానికి చెందని రఫెల్‌పై గోయల్ ప్రచారం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిజం ఒక్కటే మార్గాలే అనేకం’ అంటూ మహ్మాత్మా గాంధీ సూక్తులను జోడించిన రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రఫెల్ జెట్స్ ఒప్పందం తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఇటీవల ఆరు యుద్ధ విమానులు భారత గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. -
ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సోమవారం పార్లమెంట్ తొలిసారి సమావేశమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. లోక్‌సభలో రాహుల్ పేరు ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో సోనియా గాంధీ కూడా సభలోనే ఉన్నారు. కాగా సిట్టింగ్ స్థానం అమేథి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. వయనాడులో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. ‘‘వరుసగా నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికయినందుకు సంతోషంగా ఉంది. ఎంపీగా నాపై ఉన్న బాధ్యతలను నెరవేరుస్తా. రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రజల హక్కుల కోసం పనిచేస్తా’’ అంటూ తన ట్విటర్ ద్వారా రాహుల్ వెల్లడించారు. -
రాహుల్ వివరణ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చౌకీదార్ చోర్ (కాపలాదారే దొంగ) అనే వ్యాఖ్యలను తమకు ఆపాదించినందుకు గాను ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. రఫేల్ తీర్పుపై రాహుల్ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం) విచారణ చేపట్టింది. కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22 కల్లా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి : రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇటీవల ఎన్నికల సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి..చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అనిల్ అంబానికి రూ.40 వేల కోట్లు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో లబ్ధి జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల సభలో రాహుల్ పేర్కొన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు చేశారు. -
అమేథీలో రాహుల్‌కు షాక్..
లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాహుల్ గాంధీ పోటీ చేయబోయే అమేథీ నియోజకవర్గం నుంచి ఆయనకు పోటీగా కాంగ్రెస్ నేత కుమారుడు బరిలోకి దిగనున్నారు. యూపీకి చెందిన హజీ సుల్తాన్ ఖాన్ గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నారు. 1991పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ, 1999లో సోనియాగాంధీ పార్లమెంట్‌కు పోటీ చేసినప్పుడు వీరిద్దరిని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశాడు. కానీ ఆయన కుమారుడు హజీ హరూన్ రషీద్ మాత్రం కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు.రాహుల్‌పై పోటీగా అమేథీ నియోజకవర్గం బరిలోకి దిగుతానని రషీద్ ప్రకటించాడు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయం చెప్పలేదు. ఈ సందర్భంగా రషీద్ మీడియాతో మాట్లాడుతూ.. గత 70 ఏళ్ల నుంచి అమేథీలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. పార్టీ అధిష్టానం స్థానిక నేతలను పట్టించుకోలేదని ఆరోపించారు. అమేథి నియోజకవర్గంలో 6.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని.. అవన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకమే అని పేర్కొన్నారు. అమేథి నియోజకవర్గంలో అభివృధ్ది జరగలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో తిరిగితే వాస్తవాలుతెలుస్తాయన్నారు. 2004 సాధారణ ఎన్నికల సమయంలో అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అప్పట్నుంచి సోనియా రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అమేథి నియోజకవర్గంలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతాయి. -
స్టార్‌వార్
ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే మిగిలుండడంతో అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. వీలైనంతగా రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళి కలు సిద్ధం చేసుకుంటున్నారు. తమ అనుచరగణాన్ని ఇంటింటికీ వెళ్లేలా పురమాయిస్తున్నారు. పనిలో పనిగా స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 25న ఖేడ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. 28న ఒకేరోజు నాలుగు బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సభలు ఉండనున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సోనియా లేదాæ రాహుల్‌తో సభ నిర్వహించే ఆలోచన ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా స్టార్ల రాకతో ప్రచారం వేడెక్కనుంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత రావడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందు ఎన్నికల ప్రచార బరిలోకి దిగిన టీఆర్ఎస్, బహిరంగ సభల నిర్వహణపైనా దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ నెల 28న జిల్లా పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొంటారు. బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం జోగిపేట, నారాయణఖేడ్‌లో పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేత హరీశ్‌రావు కూడా పలు నియోజకవర్గాల్లో జరిగే సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా షెడ్యూలు సిద్ధం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 25న నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ నెల 29న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జహీరాబాద్‌లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 2న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పటాన్చెరు, సంగారెడ్డిలో జరిగే ర్యాలీకి హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఖరారు కాని కాంగ్రెస్ ప్రచార షెడ్యూలు భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషం వరకు మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్.. అగ్రనేతల ప్రచార షెడ్యూలును ఇంకా ఖరారు చేయలేదు. పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవడంపైనే దృష్టి సారించారు. జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించినా, ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కావాల్సిఉంది. మరోవైపు నారాయణఖేడ్, పటాన్చెరు అభ్యర్థులను నామినేషన్ల చివరి రోజున ప్రకటించడంతో, అభ్యర్థులు ఇంకా సొంత గూటిని సర్దుకోవడంలోనే తీరిక లేకుండా ఉన్నారు. నారాయణఖేడ్‌లో పార్టీ టికెట్ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకునే దశలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభమయ్యేందుకు మరో రెండు మూడు రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. పటాన్చెరులో అసంతృప్త నేతలను బుజ్జగించడంలో సఫలమైన కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రచారంపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మూడో తేదీలోగా జిల్లా పరిధిలో జరిగే బహిరంగ సభకు సోనియా లేదా రాహుల్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమయం తక్కువగా ఉండడంతో బహిరంగ సభల నిర్వహణతో ప్రజల్లోకి వెళ్లలేమనే ఆందోళన కాంగ్రెస్ అభ్యర్థులను పీడిస్తోంది. -
‘హస్తం’ చెంతకు కొండా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎట్టకేలకు కొండా దంపతులు సొంత గూటికి వెళ్లిపోయారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో బుధవారం ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు ‘హస్తం’లో చేరారు. ఈ సందర్భంగా రాహల్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో 20 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాలో 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించి కొండా సురేఖకు పెండింగ్‌లో పెట్టడంతో వివాదం మొదలైంది. మూడు రోజుల అంతర్మథనం అనంతరం కొండా దంపతులు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. తన టికెట్‌ను పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏమిటని కొండా సురేఖ నిలదీశారు. తనకు టికెట్ రాకపోవ ఛ్ఛినికి కేటీఆరే కారణం అని ఆరోపించారు. తన ప్రశ్నలకు రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే, బహిరంగ లేఖ రాసి పార్టీ నుంచి వైదొలుగుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ లో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు విమర్శించారు. కేసీఆర్ తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి.. బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కొద్దిగా కష్టపడితే సోనియాగాంధి అపాయింట్మెంట్ నాలుగు రోజుల్లో దొరుకుతుంది గాని, కేసీఆర్ అపాయింట్మెంటు నాలుగేళ్లు నిరీక్షించినా దొరకలేదని విమర్శించారు. వారు ఈ విమర్శలు చేసిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తాము బేషరతుగానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రాహుల్ గాంధీని మళ్లీ కలుస్తామని శపథం చేశారు. కొండా సురేఖకు కండువా కప్పుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, చిత్రంలో కొండా మురళీధర్‌రావు -
కాకా అంత్యక్రియలకు రాహుల్ గాంధీ
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అంత్యక్రియలకు ఆపార్టీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాకా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. రాహుల్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ రానున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ వెంకటస్వామి నిన్న రాత్రి కేర్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నెక్లెస్ రోడ్డులో కాకా ఘాట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య...తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.