న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఇది అమృత కాల బడ్జెట్ కాదు.. మిత్ర కాల బడ్జెట్ అని రాహుల్ సెటైర్లు వేశారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం లేదని రాహుల్ ధ్వజమెత్తారు.
దేశంలోని ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40శాతం సంపద ఉందని, 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. అయినా మోదీ వీటిని అసలు పట్టించుకోరని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత్ భవిష్యత్తును నిర్మించే రోడ్‌మ్యాప్ ప్రభుత్వం వద్ద లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు.
‘Mitr Kaal’ Budget has:
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023
NO vision to create Jobs
NO plan to tackle Mehngai
NO intent to stem Inequality
1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care!
This Budget proves Govt has NO roadmap to build India’s future.
చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
Comments
Please login to add a commentAdd a comment