కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అంత్యక్రియలకు ఆపార్టీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అంత్యక్రియలకు ఆపార్టీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాకా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. రాహుల్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ రానున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ వెంకటస్వామి నిన్న రాత్రి కేర్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నెక్లెస్ రోడ్డులో కాకా ఘాట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య...తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.