venkata swamy
-
బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిందే!
గణాంకాలు లేకుండా ఓబీసీల అభివృద్ధి ప్రణాళికలు ఎలా సాధ్యం? స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఓబీసీల కుల గణాంకాల అవసరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. వివిధ సామాజిక వర్గాలు ఏ రంగాల్లో, ఎంత స్థాయిలో వెనుకబడి ఉన్నారు? వారి ప్రధానమైన సమస్యలేమిటి? గత కాలంలో వారి జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? ప్రభుత్వం ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానం గణాంకాల ద్వారా వెతకడానికి సాధ్యమవుతుంది. 50 శాతం పైగా ఉన్న జనాభా విషయంలో మొదటి నుండి ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కావాలని నిర్లక్ష్యం చేయడం దారుణం. మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1872 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టిన కుల గణాంకాలలో కుల అంశం కూడా చేర్చారు. అది 1931 వరకు కొనసాగింది. 1941లో గణాంకాలు సేకరించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంవల్ల ఆ ప్రక్రియలను మధ్యలోనే నిలిపివేశారు. 1951 నుంచి భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గణాంకాలు తప్ప ఓబీసీలు కుల గణాంకాలు చేపట్టడం కావాలనే మానివేసింది. మొదటి ఓబీసీ కమిషన్ 1953 (కాకా కలేల్కర్), రెండవ కమిషన్ (మండల్) 1979, తప్పనిసరిగా కుల గణాంకాలు చేపట్టాలని సిఫారసు చేశాయి. మండల్ కమిషన్ ఓబీసీల రిజర్వేషన్లను నిర్ధారించటానికి 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన అన్ని బీసీ కమిషన్లు కులగణాంకాలు చేపట్టాలని పదేపదే చెబుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా శాస్త్రీయమైన గణాంకాలు లేకుండా ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం ఎలా ఇయ్యాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం అహేతుకమని చేప్తూనే ఉన్నాయి. 2010 సంవత్సరం పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలు ఈ విషయంలో పట్టుపట్టగా యూపీఏ ప్రభుత్వం మొదటగా అంగీ కరించి, ఆ తర్వాత మాటమార్చి 2011లో సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ) చేపట్టటానికి ప్రభుత్వశాఖల ద్వారా దేశవ్యాప్త గణాంకాలను చేపట్టింది. అయితే అందులో తప్పులు దొర్లాయని గణాంకాల వివరాలు బయటపెట్టలేదు. ఆ తర్వాత 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గణాంకాల వివరాలను బయట పెడతామని వాగ్దానం చేసి, జరిగిన తప్పులు సవరించలేని స్థాయిలో ఉన్నాయని, వాటిని అక్కడితో ఆపేసింది. కేవలం 20 శాతం కూడా లేని కులాలు 80 శాతం పైగా దేశ వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిశ్రమలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, ఇంకా అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు, 50 శాతం పైగా ఉన్న వేలాది కులాలు కింది స్థాయిలో కనీస అభివృద్ధికి నోచుకోకుండా అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైనట్లు బయటపడింది. అందువల్ల ఆ సమాచారాన్ని తొక్కిపెట్టించి ఉంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2021 సెన్సెస్‌లో కుల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణాంకాల అవసరం గురించి దాదాపు అన్ని పార్టీలవారు ప్రస్తావించి, సమాచారం లేకుండా కొత్త కులాలను చేర్చడానికి, అభివృద్ధి చెందిన కులాలను జాబితాల నుండి తొలగించటానికి ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. సమాచారం లేకుండానే కులాలను వర్గీకరిస్తే భవిష్యత్తు పరిణామాలు అసంబద్ధంగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 2021 సెన్సెస్‌లో భాగంగా కుల గణాంకాలను చేపట్టాల్సిందే. వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి సుదమల్ల వెంకటస్వామి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మొబైల్ : 93470 15154 -
హ్యాట్రిక్‌ల సిద్దిపేట
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి.. 1971, 1977లోనూ గెలిచి వరుసగా మూడుమార్లు గెలిచారు. ఆయన తరువాత నంది ఎల్లయ్య 1989, 1991, 1996 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దయి.. మెదక్ లోక్‌సభ స్థానంలో అంతర్భాగమైంది. ఇక, సిద్దిపేట అసెంబ్లీ స్థానంలోనూ హ్యాట్రిక్‌ల మోత మోగుతోంది. అనంతుల మదన్మోహన్ 1972, 1978, 1983 శాసనసభ ఎన్నికల్లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన తరువాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీకి చెందిన ముఖ్యనేత టి.హరీశ్‌రావు కూడా 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. -
అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్ చేయరూ..
హైదరాబాద్ : ఫోన్ రీచార్జీల కోసం ఓవ్యక్తి సరికొత్త వక్రమార్గం కనుగొన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వనస్థలిపురానికి చెందిన వెంకటస్వామి తనఫోనులో బాలెన్స్ అయిపోయినప్పుడుల్లా ఏదో ఒక నెంబరుకు ఫోన్ చేసేవాడు. విహార యాత్రకు వచ్చిన తన కుటుంబం కన్యాకుమారి అటవీ ప్రాంతంలో తప్పిపోయిందని చెప్పేవాడు. ఆపదలో ఉన్నామని రీచార్జీ చేయమని కోరేవాడు. అతగాడి మాయమాటలు నమ్మి చాలామంది రీచార్జులు చేశారు. ఇలా ఆరునెలల్లో 527 మందిని మోసం చేశాడు. దీనిపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వనస్థలిపురంలో ఎస్ఓటీ పోలీసులు వెంకట స్వామిని అరెస్ట్ చేశారు. గతంలోను ఇలాంటి కేసులో ఇతగాడు జైలుకి వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నాచర్ల వేటలో దిట్ట
టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ వెంకటస్వామి నేపథ్యమిది సర్వోన్నత పోలీసు పతకం పొందిన ఇద్దరిలో ఒకడు ‘ఆ 29’ మందిలో నలుగురు సీసీఆర్బీ సిబ్బందే సిటీబ్యూరో: స్నాచర్ పేరు చెప్తే నగరవాసులకు హడల్.. అలాంటి ఎందరో ఘరానా స్నాచర్లను పట్టుకున్న ఘనుడు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి.వెంకట స్వామి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం 245 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాలైన పతకాలు ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో వీటిని ప్రకటించగా... ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఎం.రామకృష్ణతో పాటు హెచ్‌సీ వెంకటస్వామి ఉన్నారు. తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ బృందం ఏడాది కాలంలో మొత్తం 390 స్నాచింగ్ కేసుల్ని కొలిక్కి తెచ్చింది. వీటిలో 370 కేసులు కేవలం వెంకటస్వామి సేకరించిన సమాచారంతోనే పరిష్కారమయ్యాయి. 232 స్నాచింగ్స్ చేసిన లాంబ, వందకు పైగా చేసిన బాకర్ అలీ ఇరానీ, అంజద్ అలీ ఇరానీతో పాటు మరెందరినో పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఏడాది కాలంలో దాదాపు 30 అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులకు సంబంధించిన సమాచారాన్నీ సేకరించిన వెంకటస్వామి వారికీ చెక్ చెప్పాడు. ఈ సేవల్ని గుర్తించిన అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ హెడ్-కానిస్టేబుల్ వెంటకస్వామి పేరును ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి సిఫార్సు చేయడంతో ఆయన ఎంపికయ్యారు. మరోపక్క పోలీసు సేవా పతకం పొందిన వారిలో 29 మంది హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో పని చేస్తున్న వారే. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సర్దార్ తేజేందర్ సింగ్, సయ్యద్ సాధిక్ అహ్మద్, హెడ్-కానిస్టేబుళ్లు ముఫ్తా ఉద్దీన్, బి.జయలక్ష్మి సీసీఆర్బీలోనే పని చేస్తున్నారు. -
పాపపై పైశాచికం
♦ కామాంధుడి చేతిలో బలైన బాలిక ♦ అత్యాచారం.. ఆపై గొంతునులిమి హత్య ♦ మృతదేహాన్ని కోళ్ల గంప కింద దాచి పరారీ కాటారం: కరీంనగర్ జిల్లాలో మరోచోట కామాంధులు బరితెగించారు. వీణవంక మండ లం చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారం... ఓదెల మండలం మడకలో ఆర్మీ జవాన్ యువతిపై అత్యాచారం చేసిన ఘటన లు మరువకముందే కాటారం మండలంలో మరో ఘోరం జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసిబాలికపై అఘాయిత్యం చేసి.. ఆపై గొంతు నులిమి చంపేసిందో మానవమృగం. కాటారం మండలం దామెరకుంటకు చెందిన తొగరి త్రివేణి-రాయస్వామి దంపతులకు కూతుళ్లు సింధుశ్రీ, వినయశ్రీ(4), కుమారుడు మారుతి ఉన్నారు. శనివారం సాయంత్రం వినయశ్రీ రోజులాగా ఇంటి వద్ద ఆడుకుం టోంది. ఇంటివెనుకాలే నివాసముంటున్న జక్కు వెంకటస్వామి(35) చిన్నారిని చాక్లెట్ కొనిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. పాపపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి చంపేశాడు. ఇంట్లోని కోళ్లగంప కింద మృతదేహాన్ని దాచేసి ఇంటికి తాళం వేసి పారి పోయాడు. వినయశ్రీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల గాలించారు. ఆదివా రం ఉదయం అనుమానంతో వెంకటస్వామి ఇంటితాళం పగలగొట్టి చూడగా విషయం వెలుగు చూసింది. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కోపోద్రిక్తులైన గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు, వారి బంధువులు నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. దహనం చేయడానికి పూనుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆది నుంచి అదే నేరచరిత్రే.. నిందితుడు జక్కు వెంకటస్వామిది ఆది నుంచి నేరచరిత్రే. కొన్నేళ్ల క్రితం పీపుల్స్‌వార్ మిలిటెం ట్‌గా పనిచేసి కేసులపాలైనట్లు సమాచారం. గ్రామంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చాడు. అరుునా అతడిలో మార్పు లేదు. ఓ చోరీ కేసులో నింది తుడని తెలుస్తోంది. ఇతడి తీరుతో మొదటి భార్య విడాకులిచ్చి వెళ్లింది. మరో మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం కొనసాగించాడని తెలిసింది. అతడి తీరుతో విసుగుచెందిన ఆమెకూడా వెళ్లిపోరుుంది. దీంతో అప్పటినుంచి సైకోగా ప్రవర్తిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వెంకటస్వామి తాగొచ్చి నిత్యం చిత్రిహ ంసలు పెడుతుండడంతో తండ్రి మరో కొడుకు వద్దకు వెళ్లిపోయూడు. అతడి వ్యవహారశైలితో కుటుంబసభ్యులు కూడా దూరమయ్యూరు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పెద్దకొత్తపల్లె: మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లె మండలం చెన్నపురావు గ్రామంలో వెంకటస్వామి (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే వెంకటస్వామి ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. -
సాక్షి కార్టూన్ (24-12-2014)
ఇక్కడ కూడా గుడిసెలు లేని వారికి గుడిసెలు వేయిస్తారట స్వామీ.. వెంకటస్వామిగారు! -
కాకా భౌతికకాయానికి రాహుల్ నివాళి
-
కాకా అంత్యక్రియలకు రాహుల్ గాంధీ
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అంత్యక్రియలకు ఆపార్టీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాకా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. రాహుల్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ రానున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ వెంకటస్వామి నిన్న రాత్రి కేర్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నెక్లెస్ రోడ్డులో కాకా ఘాట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య...తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. -
కాకా పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి
-
వెంకటస్వామి భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి భౌతికకాయాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి నివాళుర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం రాజయ్య, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి చిరంజీవి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కేశవరావు, బాల్క సుమన్, మాజీ మంత్రి దానం నాగేందర్, టీటీడీపీ నేత రమణ తదితరులు కాకా భౌతికకాయన్ని సందర్శించి నివాళుర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలిస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళుర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ఊరేగింపుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం 2గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
కాకా ఇల్లే కాంగ్రెస్ ఆఫీస్
ఆపత్కాలంలో ఇందిరాగాంధీకి తన క్వార్టర్‌ను ఇచ్చిన వెంకటస్వామి తర్వాత అదే పార్టీ ప్రధాన కార్యాలయంగా మారిన వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశంలో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. పార్టీ మహామహులంతా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో ఇందిరకు అండగా నిలిచిన అతి కొద్దిమంది నేతల్లో వెంకటస్వామి ఒకరు. ఆనాడు ఎంపీగా కొనసాగుతున్న వెంకటస్వామి ఢిల్లీలో తాను నివసిస్తున్న క్వార్టర్‌ను ఆమెకు ఇచ్చారు. అప్పట్నుంచి వెంకటస్వామి నివసించిన 24, అక్బర్‌రోడ్‌ను కాంగ్రెస్(ఐ) పార్టీ ప్రధాన కార్యాలయంగా ఇందిర మార్చారు. నాటి నుంచి ఇందిర సన్నిహితుల్లో కాకా ఒకరిగా మారారు. నేటి వరకు కాంగ్రెస్ కార్యాలయ చిరునామా 24, అక్బర్‌రోడ్ కావడం గమనార్హం. మరోవైపు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌తో కలసి పనిచేసినవారిలో కాకా ఒకరు. ఈ విషయాన్ని కాకా స్వయంగా మాట్లాడుతూ.. అంబేద్కర్‌తో కలసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకునే వారు. 2010 నుంచి కాకా పలుమార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండుసార్లు కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కొన్నాళ్లకు కాకా మీడియా సమావేశం ఏర్పాటు చేసి... ‘‘నేను చనిపోతానని జనమంతా అనుకున్నరు. పైదాకా పోయొచ్చిన. తెలంగాణ నా స్వప్నం. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను బతికే ఉంటా’’ అని చెప్పారు. ఇటీవలి ఎన్నికల ముందు ఓ ప్రైవేటు కార్యక్రమం లో మాట్లాడుతూ ‘‘నా స్వప్నం ఫలించింది. ఇక హాయిగా చనిపోతా’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి.. తీరని కోరిక! 2004 ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర కేబినెట్లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన వెంకటస్వామి... ఆ తర్వాత కాలంలో రాష్ర్టపతి కావాలని కలలు కన్నారు. అందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, నాటి ప్రధాని మన్మోహన్, సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహా జాతీయ ముఖ్య నేతలందరినీ కలసి మద్దతివ్వాలని కోరారు. అయితే రాజకీయ సమీకరణల్లో భాగంగా ప్రతిభాపాటిల్‌ను రాష్ర్టపతి పదవి వరించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తర్వాత సోనియాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సోనియా..దేశాన్ని విడిచివెళ్లు’’అంటూ ఘాటు గా వ్యాఖ్యానించారు. నాటి నుంచి కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. ‘ప్రాణహితు’డు కాకాయే.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మొదటిసారి ప్రతిపాదన చేసిన వ్యక్తి వెంకటస్వామియే. ఈ ప్రాజెక్టుతోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశించిన కాకా... దీనిపై వైఎస్ రాజశేఖరరె డ్డితో పలుమార్లు చర్చించారు. కాకా ప్రతిపాదనకు వైఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ‘వైఎస్.రాజశేఖరరెడ్డి నా జీవితాశయం నెరవేర్చిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఎన్నడూ వైఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడను’’ అని పార్టీ బహిరంగ వేదికపై వ్యాఖ్యానించారు. రామానంద తీర్థ శిష్యుడిగా.. వెంకటస్వామి చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మొదట ఆర్యసమాజ్‌లో, ఆ తర్వాత రామానందతీర్థ శిష్యుడిగా కాంగ్రెస్‌లో పనిచేశారు. సాయుధ పోరాట సమయంలో జైలుకెళ్లిన కాకా.. హైదరాబాద్ విలీనం అనంతరం రాజకీయాలు వదిలేసి కుటుంబ పోషణ కోసం కూలీ పనిచేశారు. అప్పుడే కార్మిక నాయకుడిగా ఎదిగారు. హైదరాబాద్‌లో నిలువనీడలేకుండా ఉన్న పేదల కోసం ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసి వారి కోసం పోరాడారు. ఆర్థికంగా బలపడ్డాక మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన కాకా అనేక పదవులు అలంకరించారు. -
'కాకా పరిస్థితి విషమంగానే ఉంది'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేర్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కేర్ ఆస్పత్రి డాక్టర్లు.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా వెంకటస్వామికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు. -
పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ
దేవరకద్ర : జిల్లాలో ఉన్న 77 సహకార బ్యాంకుల్లో 320 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని డీసీసీ బ్యాంకు డీఎం వెంకటస్వామి తెలిపారు. దీనివల్ల 1.72లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గురువారం ఆయన దేవరకద్రలోని సహకారబ్యాంకును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 మార్చి 31 వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలకు సంబంధించిన జాబితాలను రూపాందించి గ్రామాల వారిగా అందజేశామన్నారు. ఎక్కడైనా పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కుటుంబాల వారీగా రుణమాఫీకి అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్రాంచిలను ఆన్లైన్ చేశామని, లావాదేవీలు దేశ వ్యాప్తంగా జరుపుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. త్వరలో ఏటీంలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఆయన బ్యాంకు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. -
హామీ నిలబెట్టుకోండి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్ల పెంపుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వికలాంగుల పింఛన్లు రూ.1500 పెంచాలని డిమాండ్ చేస్తూ ‘వేదిక’ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ మాట్లాడుతూ పింఛన్ల పరిమిత పెంపుతో పాటు గతంలో నిలిపివేసిన అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగ కోటా ఉద్యోగాల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పదేళ్ల కల..
సిద్దిపేట: సీఎం కేసీఆర్ పదేళ్ల కల.. ఆయన స్వయంగా రూపకల్పన చేసిన రైల్వే ప్రాజెక్టు అది. సీఎం కృషితోనైనా రైలు చూడాలన్న తమ కల నెరవేరాలని సిద్దిపేట ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ రూపకల్పన చేసిన మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌కు ‘మోడీ’ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందని ఆశ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రైల్వేబడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రైలుమార్గంపై ప్రజల ఆశలు మళ్లీ చిగురించాయి. 'మెదక్ ఎంపీ వెంకటస్వామి మొదలు విజయశాంతి వరకు సిద్దిపేటకు రైలుమార్గం తీసుకువస్తామని హామీలు ఇచ్చినా కార్యాచరణ కు నోచుకోలేదు. ఎంపీలు కొంత ప్రయత్నం చేసినా, వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేటకు రైలు తీసుకువచ్చేందుకు మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. యూపీఏ ప్రభుత్వం ఈ మార్గానికి 2007లో పచ్చజెండా ఊపింది. రైల్వేలైన్ సర్వే పనులు చేపట్టేందుకు రూ.4 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే సర్వే పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అప్పటికే టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగటంతో ఈ ప్రాజెక్టు మరుగునపడింది. కాగా తిరిగి కేసీఆర్ వత్తిడితో కేంద్రం మరోమారు మనోహరాబాద్-సిద్దిపేట-పెద్దపల్లి రైలుమార్గం తాత్కాలిక సర్వే పనుల కోసం రూ.40 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే సకాలంలో సర్వే పనులు పూర్తి చేయకపోవటంతో నిధులు వెనక్కిమళ్లి మరోమారు సిద్దిపేట ప్రజల ఆశలు అడుగంటినట్లైంది. కాగా 2009లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నూతన రైలుమార్గాల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే కేంద్రం ప్రతిపాదనలు, షరతులు సిద్దిపేట రైలుమార్గానికి అవరోధంగా మారాయి. భూసేకరణ, నూతన రైల్వేమార్గం ఏర్పాటులో 50 శాతం వ్యయం, ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఐదేళ్లపాటు రైలుమార్గంలో చోటు చేసుకునే నష్టం భరించాల్సిందిగా కేంద్రం నిబంధనలు విధించింది. కఠినమైన ఈ నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఈ నూతన రైలుమార్గంపై మౌనం వహించింది. నూతన రాష్ట్రంలో రైలుమార్గంపై కోటి ఆశలు తెలంగాణ రాష్ర్టం సిద్ధించటం.. సిద్దిపేట బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావటంతో సిద్దిపేట ప్రజలు మరోమారు రైలుమార్గం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ సైతం తన కలల ప్రాజెక్టు మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం వత్తిడి ప్రారంభించారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశంలోనూ ఈ రైలుమార్గం కోసం పార్లమెంట్లో పట్టుబట్టాలని ఎంపీలకు సూచించారు. దీంతో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ కోసం సిద్దిపేట ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం నిధులు విడుదల చేయటంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు హామీ ఇచ్చిన పక్షంలో సిద్దిపేట ప్రజల కల సాకారమయ్యే అవకాశం ఉంది. సిద్దిపేటకు రైలుమార్గం ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది. జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంత ప్రయాణికులకు ప్రతి రైల్వే బడ్డెట్‌లోనూ నిరాశే ఎదురవుతోంది. ఈ బడ్డెట్లోనైనా మోక్షం కలుగుతుందేమోనని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. రైల్వే పెండింగ్ పనులను పూర్తి చేయించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా జహీరాబాద్ రైల్వేస్టేషన్లో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో ప్లాట్ ఫాం, పుట్ ఓవర్ బిడ్జి తదితర పనుల జాప్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రైల్వే అధికారులు స్పందించి రెండో ప్లాట్ ఫాంను నిర్మించి ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక తప్పని తిప్పలు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేని కారణంగా ప్రయాణికులు ఉత్తరం వైపున ఉన్న రైల్వే ద్వారం నుంచే బయటకు వెళ్లాల్సి వస్తోంది. దక్షిణం వైపున వెళ్లే ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేని కారణంగా ప్రయాణికులు రైల్వే ట్రాక్‌ను దాటుకుంటూ మొదటి ప్లాట్‌ఫాం పైకి ఎక్కాల్సి వస్తోంది. కొత్త రైళ్ల కోసం ఎదురు చూపు ఈ బడ్జెట్లో కొత్తగా రైళ్లను మంజూరు చేస్తుందేమోనని ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్-బీదర్ల మధ్య కొత్తగా రెండో ఇంటర్సిటీ రైలు కావాలని కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బీదర్ వైపు వెళ్లేందుకు ఉదయం పూట ఒక్క రైలు సదుపాయం కూడా లేదు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా ముంబాయికి రైలును మంజూరు చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రైల్వే విచారణ కౌంటర్ అవసరం ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు అవకాశం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విచారణ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రతిపాదనలకు నోచుకోని డబుల్ లైన్ జహీరాబాద్‌కు డబుల్ రైల్వేలైన్‌ను మంజూరు చేసే విషయంలో రైల్వే శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్ వరకు డబుల్ లైన్ నిర్మించాల్సి ఉంది. వికారాబాద్-బీదర్ల మధ్య కేవలం వంద కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మేరకు డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు రైళ్ల రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు ఉండవని ప్రయాణికులు పేర్కొంటున్నారు. డబుల్లైన్తో పాటు ఎలక్ట్రిక్ రైళ్లు నడిచేందుకు వీలుగా కూడా నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్: అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు మూడడుగులు ముందుకు...ఆరడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. రైల్వేలైన్ మంజూరు కోసం కేంద్రం పచ్చజెండా ఊపి తనవంతు వాటాగా మొదట రూ.25కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ర్ట ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. భూ సేకరణ ప్రక్రియ సైతం నత్తనడకన నడుస్తోంది. నేటి రైల్వే బడ్జెట్లో కేంద్రం తనవంతు మిగతా బడ్జెట్‌ను మంజూరు చేయాలని రైల్వే సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక పోరాటాల ఫలితంగా అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు నిర్మాణం కోసం అవసరమైన రూ.129 కోట్ల వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో అంగీకారం తెలిపారు. దీంతో 2010 రైల్వే బడ్జెట్లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద కొత్త రైల్వేలైన్ల జాబితాలో మెదక్ -అక్కన్నపేట లైన్‌కు చోటుదక్కింది. 2012 రైల్వే బడ్జెట్లో మెదక్ రైల్వే లైన్‌కు పచ్చజెండా లభించింది. ఈ మేరకు రైల్వే శాఖ నుండి రూ 1 కోటి, రాష్ట్ర ప్రభుత్వం రూ1 కోటి, ఎంపీ విజయశాంతి తన కోటా నుండి రూ.1 కోటి, 2013 బడ్జెట్లో రూ 1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రైల్వే లైన్ సర్వే, భూవివరాల సేకరణ, రైల్వే స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇందుకు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితో పాటు, అటవీ శాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. ఎట్టకేలకు 2014 జనవరి 19న అప్పటి మెదక్ ఎంపీ విజయశాంతి, మంత్రి సునీతారెడ్డిల చేతుల మీదుగా రైల్వేలైన్‌కు శంకుస్థాపన జరిగింది. అనంతరం ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ కోసం తనవంతు వాటాగా రూ.25కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఎన్సీఆర్ కన్స్ట్రక్షన్ విభాగానికి పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మిగతా నిధులు మంజూరు కావాల్సి ఉంది. భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ, రైల్వే అధికారుల ఉమ్మడి సారథ్యంలో సర్వే పూర్తయ్యింది. ఈ మేరకు సర్వే రిపోర్టులను, సర్వే ల్యాండ్స్ అండ్ రెవెన్యూ అసిస్టెంట్ డెరైక్టర్‌కు పంపుతూ... సబ్‌డివిజన్ రికార్డులను తమకు అందజేయాలని కోరారు. కాని ఇంత వరకు అలాంటి రికార్డులు తయారు కాలేనట్లు తెలుస్తోంది. -
తప్పులు సరిదిద్దుకుంటాం
శంకర్పల్లి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఆతిథిగృహంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, అయితే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని వెంకటస్వామి అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా ప్రచారం చేసుకోకపోవడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు. సంక్షేమ పథకాల వల్ల ఎంతోమంది లబ్ధి పొందినా... నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయన్న ధీమాతో ఎన్నికలకు వెళ్తే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి మంచి గౌరవం ఉందని, కానీ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. పార్టీ పరాజయానికి కారణాలపై అందరం కలిసి చర్చించుకుంటామని, తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామని ఆయన అన్నారు. నియోజకవర్గ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ ఎన్నికలనాటికి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, డీసీసీ సంయుక్త కార్యదర్శి వాసుదేవ్, ఎంపీటీసీ సభ్యులు బద్దం శశిధర్‌రెడ్డి, నర్సింలు, రావులపల్లి మాజీ సర్పంచ్ రవీందర్, పార్టీ నాయకులు పార్శి బాలకృష్ణ, కొంగళ్ల మల్లేషం, సర్తాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం కోసమే పార్టీ
పదవుల కోసం కాదు ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మడికొండ, న్యూస్‌లైన్ : పదవుల కోసం పార్టీ స్థాపించలేదని, అవి కావాలనుకుంటే 1996లోనే వచ్చి ఉండేవని మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ మండలం కొండపర్తిలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు బొక్కల వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన సభలో మందకృష్ణ మాట్లాడారు. ఇప్పటి వరకు పార్టీలు పెట్టిన అందరూ అగ్రవర్ణాలవారేనని, వారికి పేదల బాధలు తెలియవని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలుపొందిన నాయకులు ఏనాడూ ఆయా వర్గాల కోసం పోరాడలేదని తెలిపారు. పేద లకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ స్థాపించానని, అణగారిన వర్గాలకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతానని స్పష్టం చేశారు. రాజ్యాధికారం చేపట్టి స్వరాష్ట్ర పాలన సాధించుకుందామన్నారు. రాబోయే ఎన్నికల్లో అగ్రవర్ణాల పార్టీలపై ఎంఎస్పీ విజయం సాధించాలంటే బడుగు, బలహీన వర్గాలకే ఓట్లు వేయాలని కోరారు. ఇగ్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ మనకు దొరల తెలంగాణ వద్దని, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి అగ్రవర్ణాలవారే ముఖ్యమంత్రులు అయ్యారని, వారికి మన బాధలు తెలియవన్నారు. మనకు న్యాయం జరగాలంటే మన బాధలు తెలిసినవారే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీలా రాష్ట్రంలో ఎంఎస్పీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పుట్ట రవి మాదిగ, బొక్కల నారాయణ, సర్పంచ్ పిట్టల కుమారస్వామి, మంద కుమార్, గోవింద్ నరేష్, మాదాసి బాబు, వస్కుల దేవేందర్ గ్రామంలోని కుల సంఘల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.