అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్‌ చేయరూ.. | hyderabad person arrested in Fake recharge case | Sakshi
Sakshi News home page

అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్‌ చేయరూ..

Published Wed, May 3 2017 4:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్‌ చేయరూ..

అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్‌ చేయరూ..

హైదరాబాద్ : ఫోన్‌ రీచార్జీల కోసం ఓవ్యక్తి సరికొత్త వక్రమార్గం కనుగొన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వనస్థలిపురానికి చెందిన వెంకటస్వామి తనఫోనులో బాలెన్స్‌ అయిపోయినప్పుడుల్లా ఏదో ఒక నెంబరుకు ఫోన్‌ చేసేవాడు. విహార యాత్రకు వచ్చిన తన కుటుంబం  కన్యాకుమారి అటవీ ప్రాంతంలో తప్పిపోయిందని చెప్పేవాడు. ఆపదలో ఉన్నామని రీచార్జీ చేయమని కోరేవాడు.

అతగాడి మాయమాటలు నమ్మి చాలామంది రీచార్జులు చేశారు. ఇలా ఆరునెలల్లో 527 మందిని మోసం చేశాడు.  దీనిపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వనస్థలిపురంలో ఎస్‌ఓటీ పోలీసులు వెంకట స్వామిని అరెస్ట్‌ చేశారు.  గతంలోను ఇలాంటి కేసులో ఇతగాడు జైలుకి వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement