vanasthalipuram police
-
ప్లాట్‌పై కన్నేసి.. నకిలీ పత్రాలతో స్థలం కబ్జా
హస్తినాపురం: ప్లాట్ యజమాని పేరుతో నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తయారు చేసి కోటి రూపాయల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు షేక్ హస్సన్(56)ను ఆదివారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిగూడచమన్కు చెందిన బాలేశ్వర్ 1984లో పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సురాబాద్ జడ్జెస్ కాలనీలో సర్వే నంబర్–33లో 267 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్లాట్‌పై కన్నేసిన ఎన్టీఆర్నగర్కు చెందిన షేక్ హస్సన్ పథకం ప్రకారం వివిధ జిల్లాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో సదరు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హస్సన్ మూడు నెలలకు పైగా పరారీలో ఉన్నాడని, అతడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్ చేయరూ..
హైదరాబాద్ : ఫోన్ రీచార్జీల కోసం ఓవ్యక్తి సరికొత్త వక్రమార్గం కనుగొన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వనస్థలిపురానికి చెందిన వెంకటస్వామి తనఫోనులో బాలెన్స్ అయిపోయినప్పుడుల్లా ఏదో ఒక నెంబరుకు ఫోన్ చేసేవాడు. విహార యాత్రకు వచ్చిన తన కుటుంబం కన్యాకుమారి అటవీ ప్రాంతంలో తప్పిపోయిందని చెప్పేవాడు. ఆపదలో ఉన్నామని రీచార్జీ చేయమని కోరేవాడు. అతగాడి మాయమాటలు నమ్మి చాలామంది రీచార్జులు చేశారు. ఇలా ఆరునెలల్లో 527 మందిని మోసం చేశాడు. దీనిపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వనస్థలిపురంలో ఎస్ఓటీ పోలీసులు వెంకట స్వామిని అరెస్ట్ చేశారు. గతంలోను ఇలాంటి కేసులో ఇతగాడు జైలుకి వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన యాంకర్
హైదరాబాద్: ఓ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ ను వేధిస్తున్న వ్యక్తిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకోమని పదేపదే వేధింపులకు గురిచేస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఛానల్ లో యాంకర్ గా పనిగాచేస్తున్న యువతి(28) ప్రశాంత్ నగర్ లో నివాసముంటోంది. హర్యానాకు చెందిన ఆశిష్ బిష్టోయ్(33)తో గతంలో ఆమెకు పరిచయం ఉంది. దీన్ని అలుసుగా తీసుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఫోన్ వేధిస్తున్నాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే చంపేస్తానని ఫోన్ లో బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడికి ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు అయినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)