వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన యాంకర్ | Channel Anchor Complaint against Man | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన యాంకర్

Published Sun, Jul 27 2014 10:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన యాంకర్

వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టిన యాంకర్

హైదరాబాద్: ఓ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ ను వేధిస్తున్న వ్యక్తిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకోమని పదేపదే వేధింపులకు గురిచేస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఛానల్ లో యాంకర్ గా పనిగాచేస్తున్న యువతి(28) ప్రశాంత్ నగర్ లో నివాసముంటోంది.

హర్యానాకు చెందిన ఆశిష్ బిష్టోయ్(33)తో గతంలో ఆమెకు పరిచయం ఉంది. దీన్ని అలుసుగా తీసుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఫోన్ వేధిస్తున్నాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే చంపేస్తానని ఫోన్ లో బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడికి ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు అయినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement