హామీ నిలబెట్టుకోండి.. | complete your homies | Sakshi
Sakshi News home page

హామీ నిలబెట్టుకోండి..

Published Tue, Jul 15 2014 12:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

complete your homies

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్ల పెంపుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వికలాంగుల పింఛన్లు రూ.1500 పెంచాలని డిమాండ్ చేస్తూ ‘వేదిక’ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

గేటు ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ మాట్లాడుతూ పింఛన్ల పరిమిత పెంపుతో పాటు గతంలో నిలిపివేసిన అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగ కోటా ఉద్యోగాల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement