Disability pensions
-
3 నెలలుగా పింఛన్ లేదు.. బతికుండగానే చంపేశారు!
సాక్షి. జనగామ: అతనో దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 3,016 పింఛన్ తీసుకుంటున్నాడు. అయితే గత ఏప్రిల్ నుంచి ఆయనకు పింఛన్ రావడం లేదు. దీంతో ఈనెల 4న మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మెప్మా పీడీ హర్షవర్ధన్‌ను నిలదీశాడు. తన పేరును చనిపోయిన జాబితాలో చేర్చారని అధికారి చెప్పడంతో హతాశుడయ్యాడు. జనగామ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు కృష్ణాకళామందిర్ ఏరియాకు చెందిన దివ్యాంగుడు కానుగ బాల్‌నర్సయ్య సర్వే సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో, మెప్మా సిబ్బంది డోర్‌లాక్ అని రాసుకుని, ఆ తరువాత విచారణ చేపట్టకుండానే ఆయన పేరును చనిపోయిన జాబితాలోకి ఎక్కించారు. కాగా, ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దని బాల్‌నర్సయ్యను పీడీ హర్షవర్ధన్ కోరినట్టు తెలిసింది.దీనిపై పీడీ హర్షవర్ధన్‌ను వివరణ కోరగా, ఇంటింటి సర్వేలో డోర్‌లాక్ ఉండడంతోనే బాల్‌నర్సయ్య చనిపోయినట్లుగా తమ సిబ్బంది నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆర్పీకి మెమో ఇచ్చి ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
పింఛన్లలోనూ పచ్చపాతమే
♦ జమ్మలమడుగు, బద్వేలుకు మాత్రమే కొత్త పింఛన్లు ♦ బద్వేలుకు అదనంగా మరో 1,270 కొత్త పింఛన్లు పంపిణీ ♦ మిగతా నియోజకవర్గాలను పట్టించుకోని పాలకులు అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న చందంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిధులు, పదవులే కాదు పింఛన్ల మంజూరులోనూ ‘పచ్చ’పాతం చూపిస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని వారికి పింఛన్లను ఓకే చేసిన ప్రభుత్వం.. మిగతా ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు మొండిచేయి చూపించింది. కడప రూరల్: ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత పాలకులు వింతపోకడలకు పోతున్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఉదాహరణగా జమ్మలమడుగు, బద్వేలు నియోజవర్గ ప్రాంతాల్లోని పింఛన్ల మంజూరు విషయాన్నే చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. వృద్ధాప్య, వితంతు,వికలాంగ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం కేవలం బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని వారికే మంజూరు చేసి తన నైజాన్ని మారోమారు చాటుకుంది. కొత్త పింఛన్లకు ఎదురుచూస్తున్న 15,157 ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన వారు కూడా పింఛన్లకు అర్హులే. వారికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం అందరూ హర్షించదగ్గ విషయమే. అయితే మిగిలిన నియోజకవర్గాల్లోని అర్హులు ఏ పాపం చేశారని కొత్త పింఛన్లను మంజూరు చేయడం లేదని పలువు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణలు మార్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత నెల జమ్మలమడుగుకు 1500, బద్వేలు నియోజకవర్గానికి 1000 కొత్త పింఛన్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడమేగాక జమ్మలమడుగుకు 3750, బద్వేలుకు 953 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం వీరు పింఛన్లు తీసుకుంటున్నారు. తాజాగా బద్వేలు ప్రాంతానికి చెందిన 1270 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, వారికి కూడా పాలకులు ఆగమేఘాల మీద కొత్త పింఛన్లను మంజూరు చే శారు. మిగిలిన ఎనిమిది నియోజవర్గాల్లోని అర్హులను ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు 14 నెలలకు పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆ రెండు నియోజకవర్గాలకు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. జూన్ 1వ తేది నుంచి కొత్తగా వెబ్సైట్లో అర్హులు జమ్మలమడుగు నుంచి 192 మంది, బద్వేలు నుంచి 292 మంది దరఖాస్తు చేసుకున్న వారున్నారు. వీరికి కూడా ప్రభుత్వం మళ్లీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందో లేదో చూడాలి. మరి పాలకులు మిగిలిన నియోజకవర్గాల్లోని వారికి కొత్త పింఛన్లను ఎప్పుడు మంజూరు చేస్తారో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. -
‘ఆసరా’ కోసం ఆరాటం..
పూర్తి కాని అర్హుల జాబితా కొనసా...గుతున్న దరఖాస్తుల పరిశీలన కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ప్రదక్షిణ జాబితాలో పేర్లు లేనివారిలో తీవ్ర ఆందోళన అర్హులందరికీ కేసీఆర్ ప్రభుత్వంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు అందజేస్తాం.. ఇదీ లోకేశ్వరం మండలం పుస్పూర్‌లో శుక్రవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న చేసిన ప్రకటన. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అర్హులకు పింఛన్ తప్పకుండా వస్తుంది.. పేర్లు తొలగించిన వారివి మరోసారి పరిశీలించి జాబితాలో చేరుస్తాం.. అంటూ ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. మంచిర్యాల రూరల్ : జిల్లాలో అర్హుల ఎంపిక జాబితాపై ఇంకా కసరత్తు కొనసా..గుతూనే ఉంది. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం(ఆసరా) కోసం జిల్లాలో 3.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 2.01 లక్షల మందిని అర్హులుగా గుర్తించి వారి వివరాలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. అనర్హుల పేరిట 1.37లక్షల మందిని జాబితా నుంచి తొలగించడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రోజుకో చోట కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ప్రభుత్వం సడలించిన నిబంధల ప్రకారం 2.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. జాబితాలో లేని నుంచి వివరాలు, ధ్రువీకరణ పత్రాలు స్వీకరించి ఎన్ఐసీ సర్వర్‌లో నమోదు చేస్తున్నా.. ఇంకా వారి అర్హతపై పూర్తి స్పష్టత రాలేదు. అర్హులను గుర్తించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు ఆదాయ పరిమితి పెంచినా, కుటుంబ సర్వే ప్రకారం పింఛన్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉద్యోగం చేస్తున్నారని, పింఛన్లు పొందుతున్నారని అర్హుల్లో చోటు కల్పించడం లేదు. చిరు ఉద్యోగాలు చేసి, నెలకు రూ.200 నుంచి రూ.వెయ్యి పింఛన్ పొందుతున్న తాము రూ.లక్షన్నర ఆదాయంలోపు వారిమేనని, తమకూ అర్హత కల్పించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, తహశీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లలో ఎంతమంది అర్హులనే విషయమై అధికారులు పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. అన్ని అర్హతలు ఉన్నవారు మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నా వారికి పింఛన్ మంజూరుకు ఆమోదం లభించడం లేదు. ఎన్ఐసీ సర్వర్‌లో మరోసారి స్వీకరించిన దరఖాస్తులను చూపిస్తూ కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత పింఛన్లు వస్తాయని అధికారులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయలోపం.. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆసరా లబ్ధిదారుల జాబితా కొలిక్కి రావడం లేదు. గత నెలలో ఆసరా పథకానికి అర్హులను గుర్తించేందుకు మండలాల్లోని ప్రభుత్వ శాఖల అధికారులను కొన్ని గ్రామ పంచాయతీలకు విచారణ అధికారులుగా నియమించి సర్వే పూర్తి చేయించారు. ఇంటింటి విచారణ పూర్తి చేసిన దరఖాస్తులను ధ్రువీకరించినట్లు సంతకాలు చేశారు. ఇందులో కొందరిని అనర్హులుగా ప్రకటించడంతో వారు మరోసారి మండల పరిషత్ కా ర్యాలయానికి వచ్చి తమ వద్ద ఉన్న అన్ని రకాల ధ్రు వీకరణ పత్రాలు చూపిస్తున్నారు. మండల పరిషత్ అధికారులు మాత్రం కుటుంబ సర్వే ఫారంతోపాటు ఆయా గ్రామ పంచాయతీల్లో సర్వే చేసిన ప్రత్యేక అధికారుల నుంచి ధ్రువీకరించినట్లు సంతకాలు తీసుకు రావాలని పింఛన్‌దారులకు సూచిస్తున్నారు. దీంతో అన్ని అర్హతలు ఉన్నా అధికారుల తప్పిదంతోపాటు జరిగిన పొరపాట్లకు పింఛన్‌దారులు మండ ల పరిషత్ కార్యాలయం, సర్వే చేసిన అధికారుల కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. చుక్కలు చూపిస్తున్న అధికారులు ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందరికీ పింఛన్లు అందించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. జాబితాలో పేర్లు లేకపోతే పింఛన్ అందకుండా పోతుందని వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దీంతో పింఛన్ జాబితాలో పేరు లేదని మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పూర్తి వివరాలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకు రావాలని, పేర్లు అర్హుల జాబితాలో చేరుస్తామని చెబుతున్నారు. అన్ని ఆధారాలతో కార్యాలయానికి వెళ్తున్న వారిని తహశీల్దార్ కార్యాలయం నుంచి కుటుంబ సర్వే ఫారాలు తీసుకు రావాలని, అందులో ఉన్న వివరాలు సరిపోవాలని అధికారులు చెబుతన్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులకు కుటుంబ సర్వేఫారాలను ఇవ్వకుండా మండల పరిషత్ కార్యాలయానికి పంపించామంటూ అక్కడి అధికారులు చెప్పి పంపిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పొద్దంతా కార్యాలయాల చుట్టూనే తిరుగుతూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏ అధికారికి తమ మొర వినిపించాలో తెలియక, పేర్లు ఎందుకు తొలగించా రో అర్థంకాక కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నా పేరు విజయలక్ష్మి. వయసు 28సంవత్సరాలు. మాది మంచిర్యాల మండలం తీగల్‌పహాడ్ గ్రామం. కంటిచూపు లేదు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ జాబితాలో పేరు తొలగించారు. 18ఏళ్లు పైబడిన వారికి కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు పట్టించుకుంట లేరు. వికలాంగురాలిగా అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ జాబితాలో పేరు లేదు. నాలుగైదు రోజులుగా మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్న. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు మాత్రం మీ ఇంటికి వచ్చి సర్వే చేసిన అధికారి ధ్రువీకరిస్తేనే పింఛన్ వస్తదని చెబుతున్నరు. పింఛన్ అందేలా చూడాలె. -
అనర్హులను తొలగించండి
అనంతపురం రూరల్: ‘మా ఊళ్లో సర్వే సరిగా చేయలేదు.. కొన్నేళ్లుగా కొందరు అనర్హులు వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారు.. వారందరినీ తొలగించండి’ అని టీడీపీ నేతలు మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ 3 వేలకు వికలాంగల సర్టిఫికెట్లను అందజేస్తున్నారన్నారు. బొటన వేలు పోయిన వాళ్లు, చేతికి గీత పడినవారు కూడా సర్టిఫికెట్లతో హాజరవుతున్నారని మంత్రికి వివరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు, పింఛన్ల కమిటీలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఓబులేసు, నారాయణస్వామి, ప్రసాద్, తదితరు మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో ఇంకా అనర్హులున్నారని, వారిని ఎందుకు తీసివేయలేదని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సర్వే కమిటీలో మీరూ ఉన్నారు కదా? అప్పుడెందుకు స్పందించలేదని ప్రశ్నించడంతో వారు సమాధాన చెప్పలేకపోయారు. మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కమిటీలను వేసిందన్నారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో పింఛన్లకు రూ. 40 కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా ఖర్చు అవుతందని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిందిపోయి కమిటీ సరిగా లేదు.. అనర్హులున్నారని తెలపడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అధికారుల ప్రవర్తనపై మంత్రి ఆగ్రహం మంత్రి సునీత సమావేశం నిర్వహిస్తుండగా రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, స్పెషాలాఫీసర్ నారాయణస్వామి, జెడ్పీటీసీ వేణుగోపాల్ పదే పదే ముచ్చటిస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ కార్యక్రమానికి అంతరాయం కల్పించారు. ఓ వైపు తెలుగు తమ్ముళ్లు విసుగు తెప్పిస్తుండగా, మరోవైపు స్టేజ్‌పై ఉన్నవారు అంతరాయం కల్గించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమైనా పనిలేకుండా వచ్చానా?.. ఏదైనా పని ఉంటే బయటికెళ్లండి అంటూ ఆదేశించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో అనంతపురము ఎంపీపీ కన్నేగంటి మాధవి, వైఎస్ ఎంపీపీ శిల్ప, టీడీపీ నేత చంటి, ఎంపీడీఓ లక్ష్మినరసింహ శర్మ, ఆత్మకూరు, రామగిరి, సీకేపల్లి, రాప్తాడు, కనగానిపల్లి ఎంపీడీఓలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 2033 పింఛన్ల తొలగింపు రాప్తాడు నియోజవర్గంలోని ఆరు మండలాల్లో 30,505 పింఛన్లు ఉండగా, ఇందులో 2033 మందిని అనర్హులుగా తేల్చామని పీడీ నీలకంఠారెడ్డి తెలిపారు. పారదర్శకంగా సర్వే నిర్వహించామని, అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. -
హామీ నిలబెట్టుకోండి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్ల పెంపుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వికలాంగుల పింఛన్లు రూ.1500 పెంచాలని డిమాండ్ చేస్తూ ‘వేదిక’ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ మాట్లాడుతూ పింఛన్ల పరిమిత పెంపుతో పాటు గతంలో నిలిపివేసిన అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగ కోటా ఉద్యోగాల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ల కోసం పడిగాపులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము కోసం లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. ఏప్రిల్ ఏడో తేదీ గడిచినా ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఈ నెల పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. లబ్ధిదారులు ప్రతిరోజూ పింఛన్ల సొమ్ము పంపిణీ చేసే సీఎస్పీల వద్దకు వచ్చి తిరిగి వెళుతున్నారు. ఇంకా తమ వద్దకు నగదు చేరలేదని, ఎప్పుడొస్తుందో తెలియదని వారు సమాధానం చెబుతుండటంతో ఈ నెల పింఛను ఇస్తారా, లేదా అన్న అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,35,692 మంది, వితంతు పింఛన్లు 1,20,229 మంది, వికలాంగ పింఛన్లు 45,257, గీతకార్మికుల పింఛన్లు 1,894 మంది, అభయహస్తం 20,242 మంది, చేనేత పింఛన్లు 4,914 మంది పొందుతున్నారు. జిల్లా మొత్తంగా వివిధ రకాల పింఛన్లను 3,28,228 మందికి ప్రతినెలా ఐదో తేదీ లోపు ఇస్తున్నారు. ఈసారి ఏప్రిల్ ఏడో తేదీ గడిచిపోతున్నా సీఎస్పీలకు నగదు అందకపోవటంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉండటంతో పాటు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవటంతోనే పింఛన్ల మంజూరు నిలిచిపోయిందనే వాదన అధికారుల నుంచి వినబడుతోంది. పింఛను పొందే వికలాంగులు అష్టకష్టాలు పడి వచ్చినా సొమ్ము రాలేదని తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి పింఛన్లు త్వరగా ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
అదిగో నవలోకం
ఇటీవల వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు మేధావులనే కాదు సామాన్యుడినీ ఆలోచింపచేయిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన పథకాలు ఊపిరిపోసుకోనున్నాయి... జనం చెంతకు చేరని పథకాలు వడివడిగా నడవనున్నాయనే ఆనందం జనంలో కనిపిస్తోంది. విద్యార్థి, ఉద్యోగలోకం, వ్యవసాయ, కార్మిక, కర్షక సోదరులకు అండగా ... మహిళామణులకు మమకారం పంచుతూ అందరి మన్ననలు అందుకున్నాయి ప్లీనరీలో ప్రకటించిన హామీలు . ఇచ్చిన మాట తప్పని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగనన్న కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారన్న నమ్మకం ప్రజల్లో ప్రబలంగా ఉండడంతో మిగతా రాజకీయ నేతలు ఇచ్చిన హామీల మాదిరిగా వీటిని జనం తీసుకోవడం లేదు. . ఇవి ఆచరణలోకి వస్తే జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందనున్నారు అనే కోణంలో ప్రత్యేక, వ్యవసాయం ధాన్యానికి మద్దతు ధర కల్పించేం దుకు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో వ్యవసాయ స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల జిల్లాలో 3.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరుతుంది. వికలాంగుల పింఛన్లు జిల్లాలో 45,614 మంది వికలాంగులు నెలకు రూ. 500 పింఛన్ అందుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దాన్ని రూ.1000కి పెంచనుంది. గ్యాస్‌పథకం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 సబ్సిడీ భరిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. రేషన్ బియ్యం తెల్లరేషన్కార్డులోని ప్రతి సభ్యుడికి నెలకు ఆరు కిలోల బియ్యాన్ని కిలో రూపాయికే అందజేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. డ్వాక్రా డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణాలను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. 5.80 లక్షల మంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. విద్యుత్ సరఫరా తమ పార్టీ తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయిం బర్స్మెంట్ అవసరాల కోసం రూ.6వేల కోట్లు ఖర్చు పెడతామని జగన్ స్పష్టం చేశారు. 108, 104 108, 104 వాహనాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని జగన్ చెప్పారు. 104లో మందులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ ఈ పథకం నుంచి తొల గించిన 133 వ్యాధులను తిరిగి చేరుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీనివల్ల జిల్లాలోని పలువురికి ప్రయోజనం చేకూరనుంది. -
సర్కారుకు బుద్ధి ‘వైకల్యం’!
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన వెంకట్‌కు ఒక కన్ను పూర్తిగా పోయింది. ఆయనకు పోయింది ఒక్కటే కదా.. ఇంకో కన్నుతో చూస్తున్నాడు అని అప్పటివరకు ఇస్తున్న వికలాంగ పింఛన్‌ను తొలగించారు. విశాఖపట్టణం జిల్లాకు చెందిన సూర్యారావుకు పుట్టుకతో పోలియో కారణంగా ఒక కాలు చచ్చుబడిపోయింది. ఇంకో కాలుండగా ఏం రోగం? అంటూ నెలవారీ ఇచ్చే రూ.500 పింఛన్ నిలిపివేశారు. అనంతపురానికి చెందిన ఆంజనేయులుది కూడా ఇదే దుస్థితి. ఆయనకు చెవుడున్నా సరిగా రికార్డు కాలేదని నిర్దాక్షిణ్యంగా పింఛన్‌కు కోత పెట్టారు. ఈ పరిస్థితి ఈ ముగ్గురిదే కాదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.3 లక్షల మంది పింఛన్లకు కోత విధించారు. ఖజానాపై భారం తగ్గించుకునేందుకు వికలాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను కూడా వైకల్య శాతం తక్కువ ఉందన్న నెపంతో మానవత్వం లేకుండా నిలిపివేసింది. ప్రభుత్వం సాక్షాత్తూ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఇచ్చిన రాతపూర్వక హామీని కూడా నిలబెట్టుకోలేదు. పింఛన్ కట్ చేసినా వైకల్యశాతాన్ని పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే బకాయిలతో సహా రచ్చబండ లాంటి కార్యక్రమాల్లో చెల్లిస్తామని హెచ్ఆర్సీకి చెప్పిన సర్కారు ఆ మాటే మరిచింది. బకాయిలూ ఇస్తామన్నారు... తమ పింఛన్‌ను అన్యాయంగా కోసేశారని, జీవనభృతిగా ప్రభుత్వం చెల్లించే రూ.500 ఇవ్వకుండా హక్కులను కాలరాస్తున్నారని వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన వికలాంగులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో నిలిపివేసిన వికలాంగ పింఛన్‌ను పునరుద్ధరించాలని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వికలాంగులకు పింఛన్ ఇప్పించాలని వీహెచ్పీఎస్ అధ్యక్షుడు అందె రాంబాబు ఈ ఏడాది ఆగస్టు 19న కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కమిషన్ జారీ చేసిన నోటీసులపై గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈవో రాజశేఖర్ సెప్టెంబర్ 7న సమాధానమిచ్చారు. సదారం క్యాంపుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.3 లక్షల మంది విక లాంగుల పింఛన్ తొలగిం చటం వాస్తవమేనని, వీరందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించి అర్హులకు బకాయిలతో సహా పింఛన్ చెల్లిస్తామని రాతపూర్వకంగా తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం చివరిసారిగా నిర్వహిస్తున్న రచ్చబండలో కూడా ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఈ విషయమై వీహెచ్పీఎస్ నేతలు సెర్ప్ అధికారులను కలిసినా ఫలితం లేదు. అసలేం జరిగింది....? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ‘సాఫ్ట్వేర్ ఫర్ ఎసెస్మెంట్ ఆఫ్ డిజెబిలిటీ ఫర్ యాక్సెస్, రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్(సదారం) క్యాంపుల పేరుతో వికలాంగ పింఛన్లను ఈ ప్రభుత్వం కోసేసే పనిలో పడింది. ఈ క్యాంపుల్లో వికలాంగులు వైకల్య శాతాన్ని నిర్ధారించుకోవాలని, అక్కడ ఇచ్చే సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతానికి మించి వైకల్యం ఉంటేనే పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ క్యాంపుల శాస్త్రీయతపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలున్నా పట్టించుకోకుండా ఆదరాబాదరాగా లెక్కలు కట్టి దాదాపు 2 లక్షల మంది వికలాంగుల పింఛన్లను తొలగించింది. 2009 డిసెంబర్లో ప్రారంభమైన పింఛన్ల కోత దాదాపు ఏడాది పాటు సాగింది. అప్పటి నుంచి వికలాంగుల పింఛన్లను సర్కారు నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది.