అదిగో నవలోకం
ఇటీవల వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు మేధావులనే కాదు సామాన్యుడినీ ఆలోచింపచేయిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన పథకాలు ఊపిరిపోసుకోనున్నాయి... జనం చెంతకు చేరని పథకాలు వడివడిగా నడవనున్నాయనే ఆనందం జనంలో కనిపిస్తోంది. విద్యార్థి, ఉద్యోగలోకం, వ్యవసాయ, కార్మిక, కర్షక సోదరులకు అండగా ... మహిళామణులకు మమకారం పంచుతూ అందరి మన్ననలు అందుకున్నాయి ప్లీనరీలో ప్రకటించిన హామీలు . ఇచ్చిన మాట తప్పని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగనన్న కూడా అదే అడుగుజాడల్లో నడుస్తారన్న నమ్మకం ప్రజల్లో ప్రబలంగా ఉండడంతో మిగతా రాజకీయ నేతలు ఇచ్చిన హామీల మాదిరిగా వీటిని జనం తీసుకోవడం లేదు. . ఇవి ఆచరణలోకి వస్తే జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందనున్నారు అనే కోణంలో ప్రత్యేక,
వ్యవసాయం
ధాన్యానికి మద్దతు ధర కల్పించేం దుకు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో వ్యవసాయ స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల జిల్లాలో 3.5 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరుతుంది.
వికలాంగుల పింఛన్లు
జిల్లాలో 45,614 మంది వికలాంగులు నెలకు రూ. 500 పింఛన్ అందుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ దాన్ని రూ.1000కి పెంచనుంది.
గ్యాస్‌పథకం
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 సబ్సిడీ భరిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.
రేషన్ బియ్యం
తెల్లరేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడికి నెలకు ఆరు కిలోల బియ్యాన్ని కిలో రూపాయికే అందజేస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
డ్వాక్రా
డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణాలను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. 5.80 లక్షల మంది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
విద్యుత్ సరఫరా
తమ పార్టీ తొమ్మిది గంటల పాటు నిరంతరంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయిం బర్స్‌మెంట్ అవసరాల కోసం రూ.6వేల కోట్లు ఖర్చు పెడతామని జగన్ స్పష్టం చేశారు.
108, 104
108, 104 వాహనాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని జగన్ చెప్పారు. 104లో మందులు అందుబాటులో ఉంచుతామన్నారు.
ఆరోగ్యశ్రీ
ఈ పథకం నుంచి తొల గించిన 133 వ్యాధులను తిరిగి చేరుస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనివల్ల జిల్లాలోని పలువురికి ప్రయోజనం చేకూరనుంది.