పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ | Rs. 320 crore loan waiver in PACS | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ

Published Sat, Sep 6 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ

పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ

దేవరకద్ర : జిల్లాలో ఉన్న 77 సహకార బ్యాంకుల్లో 320 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని డీసీసీ బ్యాంకు డీఎం వెంకటస్వామి తెలిపారు. దీనివల్ల 1.72లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గురువారం ఆయన దేవరకద్రలోని సహకారబ్యాంకును ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 మార్చి 31 వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలకు సంబంధించిన జాబితాలను రూపాందించి గ్రామాల వారిగా అందజేశామన్నారు. ఎక్కడైనా పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
 
కుటుంబాల వారీగా రుణమాఫీకి అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్రాంచిలను ఆన్‌లైన్ చేశామని, లావాదేవీలు దేశ వ్యాప్తంగా జరుపుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. త్వరలో ఏటీంలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఆయన బ్యాంకు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement