loans waived
-
చంద్రబాబు హామీలను విశ్వసించని మహిళలు
-
2010 నుంచి చేనేత రుణాలు మాఫీ
సాక్షి, హైదరాబాద్ : చేనేత కార్మికుల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. జాతీయ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31 వరకు తీసుకున్న రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవరిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశామని మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సవరణ ద్వారా 2010 ఏప్రిల్ 1 నుంచి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపజేశామన్నారు. గత ప్రభుత్వం చివరిసారిగా 2010 మార్చి 31 వరకు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసిందని, ఆ తర్వాత తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం జీవో నెం.46 జారీ చేశామన్నా రు. 8,500 మందికి రుణ మాఫీ.. రుణమాఫీ ద్వారా చేనేత కార్మికులకు సాధ్యమైనంత అధిక ప్రయోజనం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన చేనేత కార్మికులు నష్టపోకుండా వారు చెల్లించిన మొత్తాలను తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ రుణ మాఫీ ద్వారా ‘వృత్తిలో కొనసాగే లబ్ధిదారులు’మాఫీ అయిన రుణాలకు తక్కువ కాకుండా తిరిగి కొత్త రుణాలు పొందేందుకు హామీ పొందుతారని వెల్లడించారు. సుమారు 8,500 మంది చేనేత కార్మికుల రుణాలు మాఫీ అవుతాయని, ఇందుకు రూ.40 కోట్ల ఖర్చు అవుతుందని వివరించారు. -
అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!
-
అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!
టీడీపీ హయాంలో ఇదో పరంపర ఈ ఆర్నెల్ల కాలంలో 86 మంది రైతుల బలవన్మరణం రైతుల గోడు పట్టని సీఎం చంద్రబాబు ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానన్న టీడీపీ అధినేత అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు రైతుల ఖాతాలు తగ్గించడానికే ఆర్నెల్లూ కసరత్తు రుణ భారంతో పాటు, అపరాధ వడ్డీ భారం కూడా తోడై మరింత కుంగిపోతున్న అన్నదాత ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది బలవన్మరణం.. కర్నూలు జిల్లాలో 33 మంది ప్రాణాలు వదులుతున్న రైతుల్లో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలు, సన్న, చిన్నకారు రైతులే సాక్షి, హైదరాబాద్: బంగరు భూమిలో విషాదం చిమ్ముతోంది. పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వం హామీలు అమలు కాక, కాలం కలిసి రాక రైతన్న కుదేలవుతున్నాడు. రుణాలు మాఫీ చేస్తుందని సర్కారుపై పెట్టుకున్న ఆశలు అడియాశలై, కుప్పలా పేరుకున్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నాడు. ఇల్లాలి పుస్తెలమ్మి పంట కోసం తెచ్చుకున్న పురుగుమందు తాగో, సద్దిమూట తగిలించాల్సిన చెట్టు కొమ్మకు ఉరేసుకొనో బలవన్మరణం పొందుతున్నాడు. మరికొందరు గుండె పగిలి మరణిస్తున్నారు. అన్నదాతకు అండగా నిలిచి, సిరులు పండించేలా చేయూతనివ్వాల్సిన సర్కారు.. రైతన్న బలవన్మరణం పొందుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యవసాయం దండగ, టూరిజమే పండగన్న సిద్ధాంతంతో దేశదేశాలు తిరిగొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక్కడి రైతుల గోడు మాత్రం వినిపించడంలేదు. అధికారం కోసం పాదయాత్రలు చేసి, అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఈ ఆర్నెల్లలో రైతన్న కష్టాలను మరింతగా పెంచారు. ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అందుకే అధికారంలోకి రాగా నే రైతుల రుణాలన్నీ సంపూర్ణంగా మాఫీ చేస్తానన్న బాబు.. అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. తొలి సంతకం అంటూ హడావుడి చేసి రుణమాఫీని మసిపూసి మారేడు కాయ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 87,612 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయకపోగా, వారి ఖాతాలను తగ్గించడంలోనే ఆరు నెలలు సాగదీశారు. దాని పర్యవసానాలను రైతులు ఎదుర్కొంటున్నారు. అప్పులు తీరుతాయని, కొంతలో కొంతైనా భారం తగ్గుతుందని భావించిన రైతాంగానికి, రుణ భారంతో పాటు దానికిప్పుడు అపరాధ వడ్డీ భారం కూడా తోడైంది. మరో వైపు సీజన్ సరిగా లేక , భారంగా మారిన అప్పులు, వడ్డీల సంగతేంటో రైతులు మరింతగా కుంగిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 86 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని రాజకీయపార్టీలు చెబుతున్నాయి. అసలే కరువు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమ జిల్లాల్లో ఈసారి వ్యవసాయదారులకు మరిన్ని ఇబ్బం దులు తలెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య 60కంటే ఎక్కువేనని జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు అంటున్నాయి. కర్నూలు జిల్లాలోనూ 33 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడటం రైతుల దయనీయస్థితిని తెలియజేస్తోందని ప్రజా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాయలసీమలోనే కాదు.. ఇంతో అంతో సేద్యం చేయడానికి వీలున్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఇద్దరు రైతులు మరణించారు. పంట నష్టపోయి, అప్పు ఎలా తీర్చాలో తెలియక గుండెచెదిరి కన్నుమూశారు. దక్షిణాది ధాన్యాగారంగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. నేల రాలుతున్న వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారు, సన్న, చిన్నకారు రైతులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా ప్రకటించుకున్న చం ద్రబాబు ఇంతవరకు రైతన్నల ఆత్మహత్యలను మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. ఏ ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదు. చిల్లి ఏగాణి సాయం ప్రకటించలేదు సరికదా.. ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల ధరలపై నోరెత్తరేం? ముఖేష్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా గ్యాస్ ధరను సవరించేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు, ఆయన మిత్రబృందం.. కరెంటు చార్జీలు రెట్టింపు అయినా, ఎరువుల ధర పెరిగినా కిమ్మనరు. పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టు సొంత పొలంలోనే రైతులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు వలసపోతున్నా పట్టించుకోరు. రైతన్నను సంపన్నుణ్ణి చేస్తామం టూ మాటలతో సరిపెడతారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్నే కిందిస్థాయిలో ఉన్న రైతుకు అం దించలేని పాలకులు.. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం చేస్తామని నమ్మబలుకుతూ రైతుల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. సబ్సిడీలకు ఎగనామం పెట్టేందుకే.. గ్రామీణ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ కొద్దికాలం చెప్పిన మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి సరిపోతాయని చెప్పొచ్చు. ‘కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చే ఎంబీఏ గ్రాడ్యుయేట్ రైతు గ్రూపులను ఏర్పాటు చేస్తాడు. వరి, రాగి, మిర్చి, పత్తి ఎలా పండించాలో వ్యవసాయంలో అప్పటికే ఆరితేరిన వారికి సలహాలు ఇస్తాడు. పాఠాలు చెప్తాడు. రైతులకిచ్చే కోట్లాది రూపాయల సబ్సిడీలను బొక్కేందుకు కార్పొరేట్ కంపెనీలు పన్నిన పన్నాగం ఇది’ అంటారు సాయినాధ్. చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కార్పొరేట్లకు వంత పాడి, కర్షకుల కడుపు కొడుతున్నారు. అందుకే రైతు ఆత్మహత్యల్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా... ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పెరిగిన సాగుబడి వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న రైతుకు పెట్టుబడి రాయితీ కల్పించాలి. రైతులకు అండగా నిలిచేలా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. సబ్సిడీలను పెంచాలి. సాగు మెళకువల్ని పెంచేలా పరిశోధనలు జరగాలి. రుణ ప్రణాళికను ప్రకటించి, వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంపొందించాలి. అప్పుడే రైతుకు భరోసా కలిగి, ఆత్మహత్యల్ని నివారించగలుగుతాము. గతంలో బాబు హయాంలో 11,952 మంది ఆత్మహత్యలు.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. సాక్షాత్తు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 11,952 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశంలో రోజుకు 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తుంటే, రాష్ట్రంలో ఆ సంఖ్య 375 మందికి చేరింది. ‘సాక్షి నెట్వర్క్’ పరిశీలన ప్రకారం చంద్రబాబు అధికారం చేపట్టిన ఈ ఆరు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 86కు చేరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది జగద్విదితం. రుణ మాఫీపై గంపెడాశలు పెట్టుకున్న రైతాంగం, ఆ హామీ వమ్మయినట్లేనని నిర్ధారణకు వచ్చి, నిస్పృహకు లోనై ఆత్మహత్యల వైపు అడుగు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హక్కుల వేదిక డిమాండ్ ఇది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ చేసిన మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) సమగ్ర రుణ ప్రణాళికను ప్రకటించాలని ఉభయ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఏపీలోని అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై హెచ్ఆర్ఎఫ్ సోమవారమిక్కడ ఓ ప్రకటన చేసింది. ‘చనిపోతున్న వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు, కౌలు రైతులు. ఉభయ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 910 మంది చనిపోయారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోడం వల్ల అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అమలు చేయాల్సిన జీవో 421 ని కూడా అమలు చేయడంలేదు. ప్రతి కుటుంబానికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలి. ప్రస్తుతం ఇస్తున్న లక్షన్నరను రూ.5 లక్షలకు పెంచాలి’ అని వేదిక ప్రతినిధులు వీఎస్ కృష్ణ, ఎ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. -
ఏదీ బీమా..?
పంట రుణాల మాఫీపై ప్రభుత్వ వైఖరితో బీమా కోల్పోయిన రైతులు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రీమియం చెల్లించలేని దుస్థితి కరవుతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు ఆందోళనలో అన్నదాతలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది రైతుల పరిస్థితి..! పంట రుణాల మాఫీపై ప్రభుత్వం రోజుకో విధానం పూటకో మాట చెబుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో వాతావరణ, పంటల బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి రైతులది. తీవ్ర దుర్భిక్షం వల్ల ఖరీఫ్ పంటను నష్టపోయిన రైతులకు బీమా ధీమా లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. తిరుపతి: జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాధారంగా 1.85 లక్షల హెక్టార్లలో వేరుశెనగ, మరో 1.5 లక్షల హెక్టార్లలో వరి, చెరకు, కంది తదితర పం టలు సాగుచేశారు. వేరుశెనగకు వాతావరణ బీమా.. వరి, కంది, చెరకు పంటలకు సవరించిన పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు సెప్టెంబర్ 15, సవరించిన పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 30గా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2,793 కోట్ల ను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయిం చారు. పంట రుణాలను పంపిణీ చేసేటపుడే బీమా ప్రీమియంను బ్యాంకర్లు మినహాయించుకుని జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు చెల్లిస్తారు. అయితే, జిల్లాలో రూ.11,180.25 కోట్లను బ్యాంకులకు పంట రుణాల రూపంలో 8.15 లక్షల మంది రైతులు బకాయిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు చెల్లించలేదు. అధికారంలోకి వచ్చాక పంట రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో ఏ ఒక్క రైతుకు కొత్తగా రుణాలను బ్యాంకర్లు పంపిణీ చేయలేదు. వేరుశెనగ పంటకు హెక్టారుకు రూ.1375ను ప్రీమియంగా జాతీయ వ్యవసాయ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ప్రీమియంలో రూ.687.50 రైతు చెల్లిస్తే.. తక్కిన రూ.687.50 ప్రభుత్వం చెల్లిస్తుంది. వరి పంటకు సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంగా పంట రుణం మొత్తంలో 3.3 శాతం చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం 1.30 శాతం.. రైతు రెండు శాతం చెల్లించాలి. కందికి రైతు 5.6 శాతం.. ప్రభుత్వం 8.40 శాతం, చెరకుకు ప్రభుత్వం 1.6 శాతం.. రైతు రూ.2.4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా పంటల రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ఫలితంగా బ్యాంకర్లు రుణం ఇవ్వకపోవడంతో రైతులు వాతావరణ బీమా, సవరించిన పంటల బీమా పథకం ప్రీమియంలను చెల్లించలేకపోయారు. కేవలం 2,318 మంది రైతులు మాత్రమే సొంతంగా బ్యాంకర్ల ద్వారా జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించారు. తీవ్రమైన దుర్భిక్షం వల్ల ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశెనగ పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. కంది పంటదీ అదే దుస్థితి. చెరకు, వరి దిగుబడులపై దుర్భిక్షం తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస కరవులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఖరీఫ్ పంటలు ముంచాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు కనీసం బీమా ధీమా కూడా దక్కకుండా పోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. -
‘చీర-ధోవతి’తో చేనేతకు పూర్వ వైభవం
‘జన్మభూమి- మా ఊరు’లో సీఎం చంద్రబాబు రైతు, చేనేత, డ్వాక్రా రుణమాఫీ హామీలను నిలబెట్టుకుంటాం కాకినాడ, సాక్షి ప్రతినిధి: చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దివంగత ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ‘చీర-ధోవతి’ పథకాన్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేనేత రంగం అధోగతిపాలై, కార్మికులు కడుపునిండా తిండి తినే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. చేనేత రుణాలు మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. పదేళ్ల క్రితం నిర్వహించిన ‘జన్మభూమి’ కార్యక్రమానికి ‘మా ఊరు’ను జోడించి, ప్రజలను గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అంగర, అనపర్తి గ్రామాల్లో శనివారం నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అంగరలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. జన్మభూమి సభలో వితంతు, వికలాంగ, వృద్ధాప్య, చేనేత పింఛన్లు పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు పింఛన్లు, 300 చేనేత కిట్లు అందజేశారు. సర్పంచ్ బట్టా షణ్ముఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే... గోదావరి నది పవిత్రత, తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే తూర్పుగోదావరి జిల్లాలో జన్మభూమిలో పాల్గొనడం ఆనందంగా ఉంది. త్వరలో ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛన్లను బ్యాంకుల ద్వారా అందించాలనుకుంటున్నాం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు వారు ఉత్పత్తిచేసే వస్త్రాలపై 30 శాతం రాయితీ ఇస్తాం. పేదలకు చేనేత చీరలు, ధోవతులను 50 శాతం సబ్సిడీపై అందజేయడం ద్వారా నేత కార్మికుల జీవనోపాధికి బాట వేస్తాం. రాష్ట్రం సమస్యల సుడిగుండంలో ఉంది. ఆదాయం ఎంత వస్తుందో తెలీదు. రైతుల రుణమాఫీకి ఆర్బీఐ అడ్డుపడగా, ఈ రాష్ట్రంలో చేస్తే అన్ని చోట్లా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అయినప్పటికీ రుణమాఫీ చేస్తాం. రైతులకు దీపావళి కానుకగా 20 శాతం నిధులను బ్యాంకులకు జమ చేస్తాం. మిగిలిన 80 శాతం నాలుగు ఏళ్లలో జమ చేస్తాం. అంతవరకు ఆగే రైతులకు పది శాతం వడ్డీ కలిపి చెల్లిస్తాం. డ్వాక్రా మహిళలకు రుణభారం తగ్గింపు వంటి హామీలన్నింటినీ పూర్తి చేస్తాం. మహిళలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని సైతం తిరిగి వారికి ప్రభుత్వమే చెల్లిస్తుంది. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఎంకు మహిళల నిరసన సెగ అంగర, అనపర్తి జన్మభూమి సభల్లో అంగన్వాడీల నుంచి చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. అంగన్వాడీ కార్యకర్తలను తొలగించడంపై సీఐటీయూ ఆధ్వర్యంలో అంగరలో సభా వేదిక వద్ద నిరసనవ్యక్తం చేశారు. సీఎంకు వినతిపత్రం అందజేయాలన్న వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనపర్తిలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలపై చంద్రబాబు రుసరుసలాడారు. రాజకీయం చెయ్యొద్దంటూ మండిపడ్డారు. ఉద్యోగాలు తీసేసి తమను వీధిన పడేశారని ఆక్రోశించగా.. మీతో తర్వాత మాట్లాడతానంటూ సీఎం ప్రసంగాన్ని కొనసాగించారు. బ్యాంకు రుణాల చెల్లింపులపై కొందరు నిలదీయగా ఆ అంశాలపై తర్వాత మాట్లాడగలనని చెప్పారు. -
రుణమాఫీ... తూచ్..!
పంట రుణాల మాఫీ అమలులోనూ మాట మార్చిన ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి పత్రాలను జారీచేసి ఆర్థిక సహాయంఅందించాలని నిర్ణయం ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీని నీరుగార్చి మహిళలను మోసం చేసిన సీఎం చంద్రబాబు ఇదో నయా వంచన..! ఇదో పచ్చి మోసం..! ఇదో పక్కా దగా..! ఎన్నికల ప్రచారంలో రైతులను మాటలతో నమ్మించి.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిండాముంచారు. పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చారు. అర్హులైన రైతులకు రుణ విముక్తి పత్రాలు అందించి.. నాలుగేళ్లలోగా ఆర్థిక సహాయం అందిస్తామని బుధవారం సెలవిచ్చారు. పంట రుణాల మాఫీలో సీఎం చంద్రబాబు వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో 8.15 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్లను బకాయిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ పంట రుణాలను మాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ఆ హామీని నీరుగార్చేందుకు చంద్రబాబు పూనుకున్నారు. ఒక్క సంతకంతో రైతులను రుణవిముక్తులను చేస్తానని ప్రకటించిన చంద్రబాబు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రుణాల మాఫీకి విధి విధానాలు రూపొందించే కమిటీ నియామకానికి సంతకం చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక్కో రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వంతున పంట రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. పంట రుణాల మాఫీ లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి 30 అంశాల ఆధారంగా ప్రొపార్మాను రూ పొందించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పంట రుణాల మాఫీకి అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించే పనిలో బ్యాంకర్లు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమైంది. పంట రుణాల మాఫీ కాదు.. రైతులకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా రైతులకు రుణ విముక్తి పత్రాలను అందించి.. నాలుగేళ్లలోగా అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. తొలుత సన్న, చిన్న కారు రైతులకు రూ.50 వేల వంతున ఆర్థిక సహాయం చేసేలా రుణ విముక్తి పత్రాలను జారీచేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. నట్టేట ముంచేశారు... పంట రుణాలను మాఫీ చేస్తారనే నమ్మకంతో రైతులు అప్పులు చెల్లించలేదు. అధికశాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ కూడా చేసుకోలేదు. గడువులోగా రుణాలను చెల్లించకపోయినా.. రెన్యువల్ చేసుకోకపోయినా 13.75 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తారు. రుణాల చెల్లింపునకూ.. రెన్యువల్‌కు ఆగస్టు 30తో గడువు పూర్తయింది. దాంతో.. రైతులు తీసుకున్న పంట రుణాలపై 13.75 శాతం వడ్డీని వసూలు చేయనున్నారు. పంట రుణాలను మాఫీ కాదు.. ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులపై రూ.950 కోట్లకుపైగా వడ్డీ భారం పడుతుందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాల మాఫీపై ప్రభుత్వం మాట మార్చడంతో రైతులు మండిపడుతున్నారు. డ్వాక్రా రుణాల తరహాలోనే.. డ్వాక్రా రుణాల మాఫీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు ఆదిలోనే మాట మార్చారు. రుణాల మాఫీ కాదు.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం(మూల ధనం) అందిస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఆగస్టు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 164)ను జారీచేశారు. జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో(ఎస్‌హెచ్‌జీ) 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ఆ రుణాలన్నీ మాఫీ చేయాలి. కానీ.. చంద్రబాబు మాట మార్చడం వల్ల ఆ రుణాలు మాఫీ కాలేదు. రుణ మాఫీ వర్తిస్తుందని మహిళలు అప్పులు చెల్లించకపోవడం.. గడువు మీరిపోవడంతో డ్వాక్రా రుణాలపై కూడా 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. అధిక వడ్డీ వల్ల మహిళలపై రూ.350 కోట్లకుపైగా భారం పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో సంఘానికి రూ.లక్షను మూలధనంగా అందించడంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఆ మూలధనాన్ని ఎప్పటిలోగా అందిస్తారన్నది చెప్పడం లేదు. ఒక రుణం తీసుకోని సంఘాలకు మూలధనం ఇచ్చేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. -
‘బ్యాంకు’ తీరును నిరసిస్తూ ఆందోళన
ఆసిఫాబాద్‌లో రైతుల రాస్తారోకో ఆసిఫాబాద్: బ్యాంకు అధికారు ల వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఒక్కో రైతుకు రూ.లక్ష పంట రుణాల మాఫీ చేసింది. కొత్త రుణాల కోసం అవసము న్న డాక్యుమెంట్లను జత చేసి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటిం చింది. దీంతో రెండు రోజులుగా రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా పహణీలు తీసుకొని స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా రు. ఈ బ్యాంకులో 3,200 మంది రైతుల డాక్యుమెంట్లను కంప్యూటర్లో పొం దుపరచాల్సి ఉంది. మంగళవారం గడువు ముగుస్తుండడంతో వందలాది మం ది రైతులు బ్యాంకుకు వచ్చారు. అయితే స్థలాభావంతో సిబ్బంది ప్రధాన గేటు ను మూసివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు రహదారిపై బైఠాయించారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. తమ దరఖాస్తులు తీసుకొని వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వ్యవసాయ మార్కె ట్ కార్యాలయాల వద్ద గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరకాస్తులు స్వీకరిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై రాంబాబులు చెప్పడంతో రైతులు శాంతించారు. -
అబద్ధాలతో గద్దెనెక్కిన బాబు
ఆత్మకూరు: చంద్రబాబు నాయుడు అబద్ధాలతో గద్దెనెక్కాడని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తానని రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన చంద్రబాబుకు వారే తగిన బుద్ధి చెబుతారన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై షరతులు విధిస్తూ రైతులను, డ్వాక్రా మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. గెలుపు కోసం తప్పుడు హామీలిచ్చారని దుయ్యబట్టారు. అక్టోబర్2న ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడతాయోనని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్‌ను పాటించడంలేదని, వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తులను పక్కనే కూర్చోబెట్టుకోవడం తగదన్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం అధికార పార్టీ నేతల చెప్పుచేతుల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. కలెక్టర్, మంత్రులు సైతం నియోజకవర్గాల్లో పర్యటించే సమయాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటి కైనా అధికారులు రాజకీయ నాయకులకు భజన చేయడం మాని నిజాయతీగా విధులు నిర్వర్తించాలన్నారు. -
ఉచితం.. అనుచితం
ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు(రాజ్‌విహార్): వర్షాలు సమృద్ధిగా కురిశాయి.. బోర్లు, బావులు నిండాయి.. పంటలు సాగు చేసుకుందామంటే విద్యుత్ కనెక్షన్ దొరకదు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే దిక్కులేదు.. కొత్తవి ఇవ్వలేం బాబోయ్ అంటున్నారు విద్యుత్ అధికారులు. ‘ రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.. అధికారంలోకి వస్తే వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. వ్యవసాయానికి ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తాం.. ప్రత్యేక బడ్జెట్ పెట్టి అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తాం’ అని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటుతున్నా రైతు సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అర్హులైన రైతులకు కొత్త కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడిచినా కనెక్షన్లు అందక జిల్లాలో 12,122 మంది రైతులు నిరీక్షిస్తున్నారు. గతంలో రైతు సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి 7 గంటల పాటు ఉచిత విద్యుత్ (త్రీఫేజ్) అందించారు. జిల్లాకు 2004లో రూ.39.74 కోట్లతో 5,085 కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రతి ఏటా కోటా పెంచుతూ రెండున్నర ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 1.02 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. సాధారణంగా ప్రతి ఏటా జనవరి- ఫిబ్రవరి నెలల్లో పెండింగ్ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు. ఈ ఏడాది అలాగే చేశారు. ఏప్రిల్ నెలలో కోటా విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు దీని గురించి పట్టించుకోవడం లేదు. కోటా విడుదల ఆగిపోయి ఇప్పటికి ఆరు నెలలు గడిపోయినా ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
శనగ రైతుపై వేలం వేటు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో శనగ రైతులు భగ్గుమంటున్నారు. రుణాల మాఫీ అమలులో సర్కారు దోబూచులాటపై విరుచుకుపడుతున్నారు. ఆర్భాటపు ప్రకటనలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోన్న అధికారపార్టీ నేతల మెడపై కత్తి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, జిల్లాకు చెందిన శనగ పంట రైతులు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం చర్చనీయాంశమైంది. కొన్ని మాసాలుగా శనగ రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈవిషయంపై అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. అయితే, వారికి ఎక్కడా స్పష్టత లభించలేదు. పైగా, వారు కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకున్న శనగల నిల్వలను బహిరంగ వేలం వేసి రుణాల రికవరీ చేస్తామని బ్యాంకర్లు నోటీసులిచ్చారు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు జిల్లాలో రుణాలు తీసుకుని బకాయి పడిన రైతులకు చెందిన 17 లక్షల క్వింటాళ్ల శనగలను బహిరంగ వేలం వేస్తామని బ్యాంకర్లు ప్రకటించడంతో వ్యవహారం రాజుకుంది. ఇదేవిషయంపై కిందటి నెల 27న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రవాణామంత్రి శిద్ధా రాఘవరావుతో పాటు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో రైతులు ముఖ్యమంత్రిని కలిశారు. వారంలో సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీనిచ్చినా ఫలితం దక్కలేదు. నోరువిప్పని అధికార పార్టీ నేతలు.. శనగ రైతులంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని.. గిట్టుబాటు ధరపై న్యాయం చేస్తామని అన్ని జిల్లాల్లో ఆపార్టీ నేతలు ఎన్నికల సమయాన విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికొచ్చినప్పుడు శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీనిచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టాక కూడా వారిని ఆదుకునే ప్రయత్నాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో శనగ పంటను రైతులు సాగుచేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మొత్తం 30 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వలున్నాయి. అందులో ప్రకాశం జిల్లాలోనే 20 లక్షల క్వింటాళ్లు నిల్వలుండటం గమనార్హం. ఏటా సీజన్ ప్రారంభంలో క్వింటాలు రూ.5 వేలకు పైగానే ధరపలికే శనగలు... సరుకు చేతికొచ్చే నాటికి క్వింటాలు రూ.2600 దిగజారింది. గిట్టుబాటు కాని ధరకు అమ్ముకోలేక, నిల్వలను కోల్డ్స్టోరే జ్ల్లోనే ఉంచుకున్నారు. స్టోరేజీల్లో ఉన్న సరుకు నిల్వలకు బ్యాంకర్లు అప్పటి ధరపై 75 శాతం రుణాలిచ్చారు. ప్రస్తుతం తీసుకున్న రుణాలకన్నా ..నిల్వచేసుకున్న సరుకుకు విలువ తక్కువగా ఉండటంతో.. మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు రైతులను ఒత్తిడి చేస్తున్నారు. రెండేళ్లుగా శనగల నిల్వలు పేరుకుపోవడంతో రుణాల రికవరీ చేయని రైతులపై బ్యాంకర్లు వేలం నోటీసులిచ్చారు. ఇప్పటికే జిల్లాలో 2 వేల మంది రైతుల శనగలను రుణాల రికవరీ పేరిట వేలం వేశారు. తాజాగా, ఈనెల 25 నుంచి అత్యధిక మంది రైతుల శనగలను వేలం వేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధం కావడంతో.. భగ్గుమన్న రైతాంగం వ్యవసాయ మంత్రి ఇంటిని చుట్టుముట్టాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా శనగ రైతుసంఘం అధ్యక్షుడు నాగ బోయిన రంగారావు తెలిపారు. వేలం నిలిపివేతపై కలెక్టర్‌కు ఆదేశాలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన క్రమంలో బాధిత రైతులు బ్యాంకర్ల వేలం నోటీసులను చూపించారు. వ్యవసాయ రుణాల మాఫీ అమలుపై జాప్యంతో పాటు తాము పండించిన శనగలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. శనగల గిట్టుబాటు ధరపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఈవిషయంలో కేంద్రసహకారం కోరతామని చెప్పగా.. ఆయన సమాధానంపై రైతులు శాంతించలేదు. అనంతరం వారంతా కలిసి చిలకలూరిపేట - ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బ్యాంకర్లను పిలిపించి వేలం ప్రక్రియను నిలువరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
మహిళల వడ్డీ మేమే కడతాం
ఏపీ సీఎం చంద్రబాబు రుణాల మాఫీపై సీఎం బాబును నిలదీసిన మహిళలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మహిళల రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం ఆయన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పతివాడపాలెం పంచాయతీ పిసిని గ్రామంలో మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు ఆయన్ని నిలదీశారు. రుణ మాఫీ నిబంధనల వల్ల తాము పొదుపు చేసుకున్న డబ్బును బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారని మహిళలు చెప్పారు. ఇప్పటికీ రుణాలు మాఫీ కాకపోవడంవల్ల తమపై వడ్డీ భారం పడుతోందని తెలిపారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ఇకపై మహిళలపై పడే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన నెలివాడలో మహిళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన స్వయం సహాయక సంఘాల జిల్లా స్థాయి అవగాహన సదస్సులో కూడా మహిళలకు ఇదే హామీ ఇచ్చారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా మారాలని, వారికి ఆదాయం పెంచే మార్గాల్ని తానే చెబుతానని అన్నారు. ఆర్థిక అంశాల విషయంలో వరల్డ్ బ్యాంకు కన్సల్టెన్సీలకన్నా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల సభ్యులే మిన్న అని కొనియాడారు. అప్పు చేయకుండా, వడ్డీ లేకుండా రుణం పుట్టేలా, మహిళలే బ్యాంకులు నిర్వహించుకునేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం వల్ల 26 శాతమే ఆదాయం వస్తోందని, సేవా రంగంలో అంతకంటే ఎక్కువ వస్తుందని తెలిపారు. బెల్ట్ షాపులపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లలో తాను అనుకున్నది జరగలేదని, ఇప్పుడు చేసి చూపిస్తానని చెప్పారు. మంచి నీటి కోసం ప్రత్యేక గ్రిడ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయసమ్మతంగా అర్హులకు పింఛన్లు అందేందుకు కమిటీలు వేస్తున్నట్టు తెలిపారు. పదేళ్లలో అన్ని గ్రామాల్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా రూ.2.5 లక్షల మేర 100 రకాల సేవలందిస్తామని చెప్పారు. లాభార్జనే కాదు.. సామాజిక సేవ చేయండి పారిశ్రామికవేత్తలు లాభార్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక సేవపై దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. రణస్థలం సమీపంలోని దేరసాంలో వీకేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. -
రుణాల మాఫీతో అభివృద్ధీ మాఫీయే
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నేతలు పెద్ద హామీలిస్తే చాలా ఇబ్బందులొస్తాయి చంద్రబాబు సంస్కరణలతో ఓసారి దెబ్బతిన్నారు.. సంస్కరణలు మానవీయ కోణంలో ఉండాలి విజయవాడ బ్యూరో: ప్రభుత్వాలు రుణా లు మాఫీ చేస్తే అభివృద్ధి కూడా మాఫీ అయిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజలకు పెద్ద హామీలు ఇస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం విజయవాడలో ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలపై పారిశ్రామికవేత్తలు, మేధావులతో జరిగిన ముఖాముఖిలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంస్కరణలను అమలు చేసి ఒకసారి దెబ్బతిన్నారని చెప్పారు. సంస్కరణలు మానవీయ కోణంలో ఉండాలని సూచించారు. తాను రాజకీయ జీవితం చివరి దశలో ఉన్నానని, అన్నీ నిజాలే మాట్లాడతానని అన్నారు. స్మార్ట్ సిటీలుగా ఏ నగరాలను అభివృద్ధి చేయాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. కానీ, విజయవాడ రాజ ధానిగా ఏర్పడే ప్రాంతం కాబట్టి దీనిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సింగపూర్ కాదు.. మనకో మోడల్ ఉండాలి రాష్ట్రాన్ని సింగపూర్ చేయాల్సిన అవసరం లేదని, మన మోడల్ మనకి ఉండాలని హితవు చెప్పారు. రాజధాని అయిన విజయవాడలో భూముల ధరలు న్యూయార్క్ నగర స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వ్యాపారులు ప్రజలను అమాయకులను చేసి రేట్లు పెంచేస్తున్నారని, ఈ రేట్లు ఎంతో కాలం నిలబడవని అన్నారు. రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి, నూజివీడు మీదుగా రింగ్ రోడ్డు నిర్మించాలని సూచించారు. హైదరాబాద్ చంద్రబాబు హయాంలో అభివృద్ధి చెందిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ కొంత అభివృద్ధి జరిగిందని చెప్పారు. బీజేపీని బలమైన శక్తిగా తయారు చేయండి గుంటూరు: రాష్ట్రంలో బీజేపీని బలమైన శక్తిగా తయారు చేసేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. -
రుణమాఫీ కోసం ఆందోళనలు
జగన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం ► రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ధ్వజం ► రుణాల మాఫీ కోరుతూ ముందుగా మండల కార్యాలయాల వద్ద ఆందోళన.. తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద... ► {పభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష కార్యాచరణలోకి జగన్.. ► త్వరలోనే ఆందోళన తేదీల ఖరారు ► పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా ప్రచారం చేసుకున్న టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని ఆ పార్టీ ధ్వజమెత్తింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా షరతులేమీ లేకుండా మొత్తం రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో భారీ ఎత్తున ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు వచ్చే నెలలో మొదట మండల కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతి దశలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగుతారు. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే పార్టీ అధ్యక్షుడు జగనే స్వయంగా ఏదో ఒక జిల్లాలో ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారు. ఈమేరకు త్వరలోనే ఆందోళన తేదీలను ఖరారు చేస్తారు. మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజకీయ కార్యదర్శులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా పలువురు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు వచ్చేసరికి మాట తప్పడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రుణాల మాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని పార్టీ విమర్శించింది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని నిర్ణయించింది. జిల్లా స్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను జగన్ ఈ సమావేశంలో వివరించారు. సమావేశం ముగిసిన అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాకు వె ల్లడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల తరఫున తమ పార్టీ ప్రజాపక్షంగా నిలబడి పోరాడుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. రుణాల మఫీ హామీని అమలు చేయాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినా ప్రయోజనం కనిపించలేదన్నారు. దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బడ్జెట్లో కేవలం 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం రుణాల మాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించినా సమాధానం రాలేదని అన్నారు. మండల, జిల్లాస్థాయిలో తాము చేపట్టే ఆందోళన లను చూసైనా టీడీపీ ప్రభుత్వం దిగి వచ్చి రుణాలన్నింటినీ మాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలో చలనం లేకపోతే జగన్ ఆందోళనకు స్వీకారం చుడతారని తెలిపారు. ఇక జిల్లా, మండల సమావేశాలు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడిన క మిటీల్లో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలను అధ్యక్షుడు జగన్ నియమించారని, పోలింగ్ బూత్, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను వారికి అప్పగించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రస్థాయి సమావేశం పూర్తయింది కనుక ఇక జిల్లా స్థాయి విసృ్తత సమావేశాలు, ఆ తరువాత మండలస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును 3, 4 రోజుల్లో పార్టీ విడుదల చేస్తుందన్నారు. జిల్లా స్థాయి విసృ్తత సమావేశాలకు ఒక ప్రధాన కార్యదర్శి, ఆ జిల్లా పరిధిలోని లోక్‌సభ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు. జిల్లా కమిటీలో ఎన్ని పదవులుండాలనేది ఇప్పటికే తెలియజేశామని, ఆ ప్రకారం సమావేశాల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మండలస్థాయి సమావేశాల్లో కూడా మండల కమిటీల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆయా మండలాలకు పక్కనే ఉన్న మండలానికి చెందిన ముగ్గురు నేతలను ఎన్నికల కమిటీ మాదిరిగా పంపి వారి సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మండల సమావేశాలకు అక్కడి ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన నాయకులు, లోక్‌సభ సభ్యుడు లేదా లోక్‌సభకు పోటీ చేసిన వారు పాల్గొంటారన్నారు. ఆ తరువాత గ్రామాల్లో కూడా గ్రామ కమిటీల ఎన్నిక జరుగుతుందన్నారు. ఇక్కడ కూడా పొరుగు గ్రామాల నుంచి ముగ్గురేసి సభ్యులను ఎన్నికల నిర్వహణకు పంపుతామన్నారు. వీటితోపాటు పార్టీ అనుబంధ సంఘాల జిల్లా, మండల, గ్రామ, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలూ జరుగుతాయని తెలిపారు. పట్టణ, నగర కమిటీల ఎన్నికలు కూడా ఇదే పద్ధతిలో జరుగుతాయని వివరించారు. ఇవి కాక వలంటీర్ల కమిటీలు కూడా ఉంటాయన్నారు. -
పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ
దేవరకద్ర : జిల్లాలో ఉన్న 77 సహకార బ్యాంకుల్లో 320 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని డీసీసీ బ్యాంకు డీఎం వెంకటస్వామి తెలిపారు. దీనివల్ల 1.72లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గురువారం ఆయన దేవరకద్రలోని సహకారబ్యాంకును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 మార్చి 31 వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలకు సంబంధించిన జాబితాలను రూపాందించి గ్రామాల వారిగా అందజేశామన్నారు. ఎక్కడైనా పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కుటుంబాల వారీగా రుణమాఫీకి అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్రాంచిలను ఆన్లైన్ చేశామని, లావాదేవీలు దేశ వ్యాప్తంగా జరుపుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. త్వరలో ఏటీంలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఆయన బ్యాంకు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. -
‘మాఫీ‘కి మరో కొర్రీ
భారాన్ని తప్పించుకునేందుకు ఉత్తర్వుల పరంపర తాజా జీవోతో రైతులపై 9 నెలల వడ్డీ భారం స్పష్టత కొరవడిన ప్రభుత్వ వైఖరిపై రైతాంగం ఆందోళన విశాఖ రూరల్ : రుణమాఫీ ఎప్పటికి జరుగుతుందో తెలియక సతమతమవుతుండగా.. తాజాగా వడ్డీ భారం రైతాంగం వెన్ను విరవనుంది. ఎన్నికలకు ముందు అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. రుణమాఫీ భారాన్ని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వుల మీద ఉత్తర్వులు జారీ చేస్తూ మాఫీ ప్రక్రియకు కొర్రీలు వేస్తోంది. తాజా ఉత్తర్వుల కారణంగా జిల్లా రైతులపై తొమ్మిది నెలల వడ్డీ భారం రూ.122 కోట్ల వరకూ పడనుంది. దీంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. రుణమాఫీపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విభిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. గత నెలలో రుణమాఫీపై 174 జీవో జారీ చేస్తూ మార్చి 31, 2014కి ముందు రుణం తీసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జీవోను అమలు చేయకుండా తాజాగా ప్రభుత్వం సోమవారం 181 జీవో జారీచేసింది. దీని ప్రకారం డిసెంబర్ 31, 2013 నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.1.50 లక్షలు మాత్రమే ఒక్కో కుటుంబానికి మాఫీ జరగనుంది. డిసెంబర్ 31 తరువాత ఆ రుణంపై వడ్డీని రైతులే భరించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. వడ్డీ బాదుడు.. బ్యాంకర్లు ఏడు శాతం వడ్డీపై రైతులకు పంట రుణాలిస్తున్నారు. రూ.లక్షలోపు రుణాలు వడ్డీ లేకుండా.. రూ.3 లక్షల వరకు రుణాలపై పావలా వడ్డీని ప్రభుత్వం వర్తింపచేస్తోంది. వాయిదాలోపు రుణాలు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. చంద్రబాబు రుణమాఫీ హామీతో రైతులు నిర్ణీత గడువులోగా రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్లు 11.75 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల వల్ల తొమ్మిది నెలల వడ్డీ రైతుల భరించాల్సి వస్తోంది. జిల్లాలో రైతులు రూ.1,040 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం తాజా మెలిక వల్ల రైతులపై రూ.122 కోట్ల వరకు వడ్డీ భారం పడనుంది. కొరవడిన స్పష్టత పంట రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం తేల్చడం లేదు. ఎప్పటిలోగా మాఫీ చేస్తామన్నది చెప్పడం లేదు. ఫలితంగా బ్యాంకర్లు కొత్తగా పంట, డ్వాక్రా రుణాలు మంజూరు చేయడం లేదు. రుణమాఫీ కోసం మార్గదర్శకాలను జారీచేసిన ప్రభుత్వం.. వాటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించింది. 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాను తయారు చేసి రైతుల వివరాలను అందజేయాలని పేర్కొంది. వాస్తవానికి గత నెల 25లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్బీఐ నుంచి గాని, బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి గానీ ఆదేశాలు రాకపోవడంతో రైతుల వివరాలను స్వీకరించలేమని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సిద్ధం కాలేదు. తాజాగా బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతుల నుంచి వివరాలను సేకరించాలని సూచించారు. ఎప్పటిలోగా రుణమాఫీని వర్తింపచేస్తామన్న అంశంపై ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో వడ్డీ భారం ఎక్కువవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పామోనిల్
- ఆరు నెలలుగా అందని పామోలిన్ - ఇక సరఫరా కష్టమేఅంటున్న అధికారులు - పౌర సరఫరాలలో ప్రతిసారీ ఇదే తంతు సాక్షి, కడప: బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. రుణాల మాఫీ నుంచి నిత్యావసర సరుకుల వరకు సక్రమంగా అందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండటాన్ని చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సబ్సిడీ రేట్ల దృష్ట్యా పంపిణీ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితిని పరిశీలిస్తే పామోలిన్ సరుకుల జాబితా నుంచి తొలగిస్తారని సంబంధిత శాఖ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆరు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ : అంతకుముందు రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కలుపుకొని దాదాపు ఆరు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా పామోలిన్ ఆయిల్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం ఆరు నెలలుగా మండలాల్లోని రేషన్ డీలర్లకు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పండుగలు వచ్చినా సరుకు పంపిణీకి మాత్రం నోచుకోలేదు. ప్రతి వంటలోనూ నూనె వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్ సరఫరా చేయకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చౌక వస్తువుల్లోనూ కోత: జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా 7,48,575 మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులు ప్రస్తుతం కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర మాత్రమే అన్ని గోడౌన్లకు పంపి రేషన్షాపులన్నింటికీ అందించారు. అయితే గోధుమపిండి మాత్రం కడప, చెన్నూరు, ఎర్రగుంట్ల, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్ధవటం, పోరుమామిళ్ళ, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వేంపల్లికి మాత్రమే అందించగా మిగతా ప్రాంతాలకు గోధుమపిండి కొరత ఏర్పడింది. కందిబేడలకు సంబంధించి కూడా జిల్లాలోని చెన్నూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, చిన్నమండెం, ముద్దనూరు, పులివెందుల సెంటర్లకు మాత్రమే పంపించారు. సరుకు ఉన్న మేరకు మాత్రమే పంపండంతో చాలా మండలాలకు కందిపప్పు ప్రస్తుతానికి అందేటట్లు కనిపించడం లేదు. గోధుమలు కూడా కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో మాత్రమే సరఫరా చేశారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 వస్తువులను సరఫరా చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారికి మాత్రం ఒక్క బియ్యం, చక్కెర పూర్తిగా అన్ని రేషన్‌షాపులకు అందిస్తుండగా మిగతా వస్తువులను మాత్రం పూర్తిస్థాయిలో కోత విధించారు. పౌర సరఫరాల శాఖ డీఎం ఏమంటున్నారంటే ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయంలో కోత పెడుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకుపోగా.. ప్రస్తుతానికి పామోలిన్ రాలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రావడం కూడా కష్టమేనని.. పామోలిన్‌ను రేషన్ సరుకుల జాబితా నుంచి తొలగించే అవకాశముందన్నారు. ఈసారి బియ్యం, చక్కెరతోపాటు కొంతమేర స్టాక్ ఉన్న కందిబేడలు, గోధుమపిండి, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. -
రూ. 377 కోట్ల రుణమాఫీకి ప్రతిపాదనలు
డీజీఎం సుఖదేవ్‌భవ రాయదుర్గం : జిల్లా వ్యాప్తంగా సహకార సొసైటీ బ్యాంకు సంఘాల పరిధిలో రూ. 377 కోట్ల రుణాల మాఫీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ట్లు డీజీఎం, నోడల్ ఆఫీసర్ సుఖదేవ్‌భవ తెలిపారు. ఆ దిశగా రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని ఆయన అన్నారు. రాయదుర్గం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో గురువారం బ్రాంచి మేనేజర్ వన్నూర్‌స్వామి అధ్యక్షతన రుణమాఫీపై సమావేశం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.39 లక్షల వంది వ్యవసాయ రుణాలు, 17 వేల మంది బంగారు రుణాల మాఫీకి అర్హత కలిగి ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 80 శాతం వరకు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ నంబర్లు, రేషన్‌కార్డుల వివరాలను సేకరించామన్నారు. రాయదుర్గం సహకార బ్యాంకు పరిధిలో ఉన్న 7 ప్రాథమిక సొసైటీ సంఘాల్లో 4 వేల అకౌంట్లు ఉండగా, ఇప్పటికే 3వేల అకౌంట్లకు సంబంధించి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించామన్నారు. రైతులు సకాలంలో ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులను అందజేసి సహకరించాలని కోరారు. సమావేశంలో సొసైటీల సీఈఓలు టీ శ్రీనివాసులు, కుమార్‌మంగళం, జీ రమణారెడ్డి, కేపీ ఆంజనేయులు పాల్గొన్నారు. -
పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు
పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సవా‘లక్షన్నర’ తిరకాసులు పెట్టింది. నిబంధనల పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి.. మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. సహకార బ్యాంకుల్లో మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేయరాదని పెట్టిన నిబంధనతో జిల్లాలో 65 వేల మంది రైతులకు రూ.200 కోట్ల మేర మాఫీ చేయకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు వేస్తోంది. మార్చిలోపు రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయబోమని స్పష్టీకరించింది. ఓటు దాటాక రుణమాఫీకి షరతులు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై రైతులు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో చంద్రబాబు హామీలవర్షం కురిపించారు. ఒక్క పంట రుణాల మాఫీ హామీనే టీడీపీని అధికారంలో కూర్చోబెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు జిల్లాలో 8.7లక్షల మంది రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి. కానీ.. ఆ హామీ అమలు భారాన్ని కనిష్ట స్థాయికి చేర్చేందుకు చంద్రబాబు తనదైన శైలిలో మెలికలు పెడుతున్నారు. మార్చి 31, 2014లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తింపజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో అదే ప్రకటనను పునరుద్ఘాటించారు. కానీ.. ఈనెల 14న పంట రుణాల మాఫీకి జారీచేసిన మార్గదర్శకాల్లో మాత్రం సవాలక్షన్నర మెలికలు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నరకు మించకుండా రుణామఫీ చేస్తామని షరతు పెట్టారు. పోనీ.. ఆ ఒక్క షరతుకైనా పరిమితమయ్యారా అంటే అదీ లేదు. ఆ రూ.లక్షన్నర మాఫీకి కూడా మెలికలు పెట్టారు. సహకార రుణాల మాఫీ లేనట్లే.. జిల్లాలో సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల్లో 65 వేల మంది రైతులు రూ.200 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. గడువులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందన్న నెపంతో సహకార అధికారులు రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే రెన్యువల్ చేశారు. మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టీకరించడంతో 65 వేల మంది రైతులు నష్టపోనున్నారు. ఈ నిబంధనపై రైతులు, సహకారశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆ నిబంధనను సడలించాలని ఇటీవల డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇక మార్చి లోపు రుణాలు చెల్లించిన రైతులకు కూడా మాఫీ చేసేది లేదని ప్రభుత్వం మెలిక పెట్టింది. సకాలంలో చెల్లించిన రైతులకూ రుణ మాఫీ వర్తింపజేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. రుణ మాఫీ కటాఫ్ డేట్‌ను మార్చి 31, 2014 నుంచి డిసెంబర్ 31, 2013కు తగ్గించడంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నను అష్టకష్టాలు పెడుతోన్న వైనం.. రుణ మాఫీకి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాలోని నిబంధనలకు రైతులు ఆధారాలు చూపించాల్సి ఉంది. ఇందులో ప్రధానమైనది మీ సేవా కేంద్రాల నుంచి అడంగల్ తీసుకోవడం. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించడంలో తప్పులు దొర్లాయి. పట్టాదారు పాసు పుస్తకంలో ఒక సర్వే నెంబర్ ఉంటే.. మీ సేవా రికార్డుల్లో మరొక నెంబరు ఉంది. దీనివల్ల అడంగల్ తీసుకోవడం రైతులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, సెల్ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సు కాపీలను అటు బ్యాంకు.. ఇటు రెవెన్యూ అధికారులకు అందించాల్సి వస్తోంది. అందులో ఏ ఒక్క కార్డు లేకపోయినా రుణ మాఫీ వర్తించదంటూ హెచ్చరిస్తున్నారు. ఒక రైతు కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అందరి ఆధార్‌కార్డులనూ అందించాల్సి వస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి ఆధార్‌కార్డు సమర్పించకపోయినా మాఫీకి లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టడం రైతులను ఇరకాటంలోకి నెట్టింది. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పరిశీలిస్తోన్న బ్యాంకర్లు.. ‘జిల్లాలో రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్లలో రూ.1100 కోట్ల మేర కూడా మాఫీ అయ్యే అవకాశం లేదు’ అని అంచనా వేస్తోండటం గమనార్హం. రైతుల నోట్లో మట్టి కొట్టిన వైనం.. గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుశెనగ రైతులకు వాతావరణ బీమా పరిహారం కింద రూ.102 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. పంట రుణాల మాఫీ మార్గదర్శకాల్లో మాత్రం రుణాల మాఫీ నేపథ్యంలో బీమా పరిహారం రైతులకు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం వల్ల రైతులు రూ.102 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈనెల 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్పుట్ సబ్సిడీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. అంటే.. ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం మంజూరు చేయదన్న మాట. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.108 కోట్ల మేర రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క రుణ మాఫీ పేరుతో రూ.210 కోట్ల బీమా పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీని రైతులకు ఎగ్గొట్టినట్లు స్పష్టమవుతోంది. రుణమాఫీ పేరుతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వంచిస్తుండడంతో దీనికి నిరసనగా రైతులు కదంతొక్కేందుకు సిద్ధమవుతున్నారు. సొసైటీ బ్యాంకులో బంగారు రుణాలు మాఫీ లేదంట నా భార్య ముంతాజ్ పేరిట పీటీఎంలోని సొసైటీ బ్యాంకులో రెండేళ్ల క్రితం బంగారాన్ని కుదువ పెట్టి రూ.20 వేలు రుణం తీసుకున్నాము. ఎన్నికల టైంలో నాయకులు వచ్చి ఏ బ్యాంకులోనైనా బంగారు లోన్లు వున్నా అన్నీ మాఫీ చేస్తామని మభ్యబెట్టినారు. కష్టకాలంలో మాకు ఎవరు ఆదుకుంటే ఏం అని వాళ్లను నమ్మి ఓట్లు వేసాం. ఇప్పుడేమో సొసైటీ బ్యాంకులో ఉన్న బంగారు రుణాలు మాఫీ కావని చెబుతావుండారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతారని ఎవరికి తెలుసు ? -మహబూబ్‌బాషా, పీటీఎం మండలం చెప్పేదొకటి చేసేదొకటి నాకు ఐదెకరాల పొలం వుంది. నా పట్టాదార్ పాసుబుక్కును కందుకూరు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కుదువ బెట్టి గతంలో రూ.30 వేల పంట రుణం తీసుకున్నాను. గత ఏడాది వడ్డీతో కలిపి రూ.37 వేలు చెల్లించేసా. ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తే బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను గత ఏడాదిలో చెల్లించినా కూడా ఆ సొమ్ము రైతుల ఖాతాలోకి జమ చేస్తామని హామీ ఇస్తే పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. ఇప్పుడే మో పూటకోమాట మాట్లాడుతున్నారు. మాటమీద నిలబడని నాయకులు చెప్పేదొకటి, చేసేదొకటా ? -కనకంటి వెంకట్రమణ, పట్టెంవాండ్లపల్లి, పీటీఎం హామీ ఇచ్చి మాఫీ మరిచారు అధికారం కోసం చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ అధికారం వచ్చాక మరిచారు. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.1.50లక్షల మాఫీ అంటున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం చేస్తూ మాలాంటి రైతులను మోసం చేయడం తగదు. -వెంకటరమణ, రైతు, మేడుపల్లె, మదనపల్లె రూరల్ నిధి పేరుతో ఏమార్చారు పొదుపు, గ్రూపు సంఘాల మహిళలకు అన్ని విధాలా తోడుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గ్రూపునకు రూ.లక్ష చొప్పున నిధి పేరుతో ఏమార్చుతున్నారు. అప్పు రూపాయి కూడా పోయేలాలేదు. మహిళలకు ఇచ్చిన హామీనెరవేర్చలేని సీఎం ఇక ప్రజల కష్టాలు గురించి ఏం పట్టించుకుంటారు. -సుభద్రమ్మ, మొరాలు, మదనపల్లె రూరల్ నిర్ధిష్ట ప్రకటన చేయాలి రుణమాఫీపై ప్రభుత్వం రోజుకు విధంగా ప్రకటన చేస్తూ రైతులను తికమకపెట్టి మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి 2014 మార్చి నెల 31వ తేది లోపు తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటన చేశారు. ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడు 2013 డిసెంబర్ 31 లోపు రుణాలకే మాఫీ వర్తిస్తుందనడం సరికాదు. నేను కౌలు రైతును. బ్యాంకులో రూ.18వేలు పంట రుణం తీసుకున్నాను. వడ్డీతో కలిపి రూ.24వేలకు పైగా చెల్లించాలని లాయర్ ద్వారా నాకు, జామీన్‌దారునికి నోటీసులు పంపారు. అవమానభారంతో రెన్యూవల్ చేశాం. ఇప్పుడు ఆ లోను వర్తిస్తుందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. -రవీంద్ర, కౌలు రైతు, మూలపల్లె, తంబళ్లపల్లె మండలం రుణాలు మొత్తం మాఫీ చేయాలి రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలి. చంద్రబాబు ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇం కోమాట చెప్పడం మంచిది కా దు. వ్యవసాయ రుణాలు పూర్తి గా మాఫీ చేస్తారని రైతులు ఆశతో ఓటు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రకాల రుణాలు మాఫీ చేయా లి లేకుంటే రైతులు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. -ఈ.వెంకటాచలం నాయుడు, జిల్లా రైతు ఉద్యమ నేత, పెనుమూరు మండలం. చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే చంద్రబాబు నాయుడు రైతులను మోసంచేసి అధికారంలో వచ్చారు. రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పించుకోడానికి రోజు కో మెలిక పెడుతూ రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాదిలో తీసుకొన్న రుణా లు మాఫీలేదని చెప్పడం దారుణం. రైతులకు ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదు. రైతులు ఇక చంద్రబాబుని నమ్మరు. ప్రజలు తిరగబడే సమయం వస్తుంది. -పార్థసారథిరెడ్డి, తిప్పనపల్లె, పూతలపట్టు మండలం -
రుణమాఫీ..ఆర్భాటమే..!
సాక్షి, ఒంగోలు : ఒక పక్క రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించకపోతే వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని బ్యాంకులు రుణమాఫీ ప్రక్రియకు కావాల్సిన తతంగం నడుపుతుండగా, సహకార బ్యాంకులతోపాటు ప్రధాన బ్యాంకులు కూడా బంగారం వేలం కోసం నోటీసులు జారీ చేస్తున్నాయి. అయితే ఇందులో వ్యవసాయేతర రుణాల కోసం పెట్టిన బంగారం అంటూ పత్రికల్లో వేలం నోటీసులు కూడా ప్రచురిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది రైతులకు ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. జిల్లాలో గత ఏడాది ఇచ్చిన పంటరుణాలు రూ.2600 కోట్లు. ఇందులో రైతులు తమ భార్యాబిడ్డల బంగారాన్ని తాకట్టుగా పెట్టి పంట పెట్టుబడులుగా తెచ్చినవి రూ.1200 కోట్ల వరకు ఉన్నాయి. భూముల్ని తాకట్టుపెట్టి తెచ్చినవి రూ.1400 కోట్లు. ఇవికాకుండా రైతులు నాలుగైదేళ్లుగా చెల్లించకుండా మిగిలిన పాతబకాయిలు రూ.1100 కోట్ల మేర పేరుకుపోయాయి. వీటన్నింటినీ వెంటనే చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు జారీచేస్తున్నాయి. వడ్డీపై వడ్డీ వేస్తూ తడిసిమోపెడయ్యేలా చేస్తున్నాయి. రుణమాఫీ ప్రకటనల నాటి నుంచి బ్యాంకర్ల ఒత్తిడి మరింత పెరిగిందని బంగారం వేలం వేసేందుకు సైతం వెనుకంజ వేయడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం నోటీసుల వెల్లువ.. యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకటరెడ్డి జిల్లా సహకార బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి గత ఏడాది జనవరి 31వ తేదీన 40 వేల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో కలిపి 41,200 చెల్లించాలని, లేనిపక్షంలో నగలు వేలం వేసి అప్పు జమ వేసుకుంటామని నోటీసు ఇచ్చారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 1159 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. కందుకూరు, కనిగిరి, టంగుటూరు, వీఆర్‌కోట, పామూరు, పీసీపల్లి, తెట్టు, కామేపల్లి, ఉలవపాడు, సింగరాయకొండ గ్రామాల్లోని రైతులకు వేలం నోటీసులు జారీ చేసింది. శనివారంనాడు వేలంపాట నిర్వహించేందుకు బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో రైతుల బకాయిలన్నీ కలుపుకొని దాదాపు రూ. 160 కోట్లు ఉంటాయని అంచనా. పంట రుణాలు, డ్వాక్రామహిళల రుణాలు, బంగారం రుణాలన్నీ కలుపుకొని నాలుగు మండలాల్లో సుమారు 18 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఇప్పటికే చీమకుర్తి ఆంధ్రాబ్యాంక్ గత నెల 16వ తేదీన 119 మంది రైతులకు రూ.80 లక్షల విలువ చేసే రుణాలను చెల్లించాలని నోటీసులిచ్చారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోనే ఐఓబీ బ్యాంకు 300 మంది రైతులకు, పినాకినీ బ్యాంకు 500 మందికి నోటీసులు జారీ చేసింది. ఇదేవిధంగా దర్శి, పర్చూరు, చీరాల, కందుకూరు, కొండపి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలతోపాటు ఒంగోలు రూరల్ ప్రాంత రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. బాధితులంతా ఈ నోటీసులకు సమాధానం చెప్పలేక, తమ తరఫున భరోసానిచ్చే నాథుడు లేక.. గోదాముల్లో పంటనిల్వలు, బంగారం ఆభరణాలు వేలంలో పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని బెంబేలెత్తుతున్నారు. -
చెల్లిస్తే.. మాఫీకి చెల్లుచీటే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు హామీ.. అనేక మలుపులు, మెలికలతో చివరికి ఎక్కువమంది రైతులకు.. అదీ సకాలంలో రుణాలు చెల్లించిన వారికి నిరాశానిస్పృహలనే మిగిల్చేలా ఉంది. రుణాల మాఫీ అమలుకు సర్కార్ విధించిన సవాలక్ష షరతులు చాలవన్నట్టు ఈ నెల 14న విడుదల చేసిన జీఓ :174 జిల్లాలో సన్న, చిన్నకారు రైతులకు శాపంగా పరిణమించింది. గత డిసెంబరు 31కి ముందు తీసుకుని గత మార్చి 31 నాటికి రుణగ్రస్తులైన రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని ఆ జీఓ స్పష్టం చేస్తోంది. డిసెంబరు 31లోపు రుణం తీసుకున్న రైతులకే మాఫీ వర్తిస్తుందనేనిబంధన సహకార సంఘాల్లో రుణాలు పొందిన మెజారిటీ రైతులను నట్టేట ముంచేస్తోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఆప్కాబ్ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ హేమసుందర్ కటాఫ్ డేట్ కారణంగా రైతులు నష్టపోతున్న విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఈ విషయంపై ఈ నెల 20న హైదరాబాద్‌లో జరిగే స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.ఈ జీఓ కారణంగా పంటరుణాలను సకాలంలో చెల్లించిన రైతులు రుణ మాఫీ లబ్ధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ రకంగా లక్షన్నర మంది రైతులుసుమారు రూ.500 కోట్ల మేర లబ్ధికి దూరమవుతారని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీపై మొదటి నుంచీ చంద్రబాబు సర్కారు భారం తగ్గించుకునే ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యూహంలో భాగమే ఈ జీఓ అని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. 2014 మార్చి 31 నాటికి ఔట్ స్టాండింగ్ (రుణం ఉండాలి)గా ఉన్న రుణాలు 2013 డిసెంబరు 31 లోపు తీసుకుని ఉండాలని ఈ జీఓ సారాంశంగా ఉంది. సన్న, చిన్నకారు రైతులకు మొండిచెయ్యి.. సహకార సంఘాల్లోని రైతులు డీసీసీబీ నిబంధనలను అనుసరించి ఏటా రెండు పర్యాయాలు.. అంటే 0 శాతం వడ్డీ రాయితీ, పావలా వడ్డీ పథకాలు ఉపయోగించుకునేందుకు మార్చి 31 లోపు ఒక పర్యాయం, ఖరీఫ్‌లో పంటల బీమా పథకం పొందేందుకు జూన్ 30 లోపు మరో పర్యాయం రుణాలు చెల్లిస్తుంటారు. అదీ కూడా చాలా వరకు బుక్ అడ్జస్ట్మెంట్ (పుస్తకంలో రుణం చెల్లించినట్టు, తిరిగి తీసుకున్నట్టు) చేసి మళ్లీ తీసుకోవడం పరిపాటి. ఈ జీఓ ప్రకారం జిల్లాలో సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రుణమాఫీ ప్రయోజనం చేకూరనట్టే. 2013 డిసెంబరు 31నాటికి చాలా మంది రైతులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేశారు. ఈ రకంగా జిల్లాలో సహకార సంఘాల ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు చెల్లించారని అంచనా. వీరంతా సన్న, చిన్నకారు రైతులే కావడంతో జీఓతో నష్టపోయేది కూడా వారే. వీరంతా రుణాలు సకాలంలో చెల్లించకపోతేమాఫీకి అర్హులై ఉండేవారు. నిజాయితీగా రుణాలు చెల్లించడమే తాము చేసిన తప్పా అని సన్న, చిన్నకారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమకు చెందిన సహకార సంఘాల అధ్యక్షులు సోమవారం అమలాపురంలో సమావేశమై జీఓ : 174ను సవరించాలని డిమాండ్ చేశారు. కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల డిమాండ్ అమలాపురం టౌన్ : రుణమాఫీకి సంబంధించి ఈనెల 14న జారీ చేసిన జీఓ :174లోని రెండో నిబంధనను సవరిస్తేనే సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ వర్తిస్తుందని కోనసీమ డివిజన్ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య సమావేశం ప్రభుత్వానికి సూచించింది. సహకార సంఘాల అధ్యక్షులు అమలాపురంలో సోమవారం సమావేశమై జీఓ :174పై సుదీర్ఘంగా చర్చించారు. ఆ జీఓను సవరిస్తే జిల్లాలో సకాలంలో రుణాలు చెల్లించిన వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. సమాఖ్య ప్రతినిధులు జున్నూరి బాబి, గోకరకొండ విజయరామారావు, ఆర్.వి.రామారావు, మెట్ల రమణబాబు, యాళ్ల బ్రహ్మానందం తదితరులు మాట్లాడుతూ జీఓ:174లోని రెండో నిబంధన ప్రకారం సహకార సంఘాల్లో అప్పులు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు రుణమాఫీ వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పలువురు రైతులు రూ.500 కోట్ల పైచిలుకు రుణాలను సకాలంలో చెల్లించారని తెలిపారు. జీఓను తప్పనిసరిగా సవరించి, వారికి కూడా మేలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జీఓ సవరించకుంటే రైతులకు తీరని అన్యాయమే.. ఏ ప్రభుత్వమైనా సకాలంలో చెల్లించిన రైతులకు బాసటగా నిలవాలి. జీఓ:174 వల్ల నిజాయితీగా రుణాలు చెల్లించిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించి, జీఓ :174ను సవరించి జిల్లాలో ఇప్పటికే చెల్లించిన రూ.500 కోట్ల రుణాలకు మాఫీ వర్తించేలా చేయాలి. - జున్నూరి బాబి, డీసీసీబీ మాజీ డెరైక్టర్ -
ఎత్తుల జిత్తులు
సాక్షి, ఏలూరు:అన్నదాతను ఇబ్బందులకు గురిచేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని తొలుత చెప్పిన సర్కారు ఆనక పరిమితులు విధించి మోసం చేసింది. అది చాలదన్నట్టు సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలు మాఫీ కావాలంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కొత్త ఖాతా లు తెరవాలంటూ సహకార శాఖ కొత్త మెలిక పెట్టింది. ఉద్యోగులు, రైతుల వ్యతిరేకత నడుమ నిలిచిపోయిన ప్రకాష్‌బక్షి కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఇదో ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ దిశగా తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఖాతాలు తెరిపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. సొసైటీలో ఖాతా ఉన్నా.. జిల్లాలో 257 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో ఖాతాలున్న 1.99 లక్షల మంది రైతులు రూ.1,130 కోట్లను వ్యవసాయ రుణాలుగా తీసుకున్నారు. వారిలో ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షల చొప్పున సుమారు రూ.850 కోట్ల మేర రుణమాఫీ చేయూల్సి ఉంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ రైతులంతా ఆధార్ కార్డు నంబర్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంది. అదేవిధంగా 30 అంశాలతో కూడిన ఫారం పూరిం చాలి. పట్టాదారుపాస్ పుస్తకం, రేషన్ కార్డు నంబర్లను కూడా అందజేయాలి. ఇప్పటికే కొందరు రైతులు ఆధార్ నంబ ర్లను సహకార సంఘాల్లో అందజేశారు. ఇప్పుడు అలాకాదని డీసీసీబీ బ్రాంచ్‌లో కొత్తగా ఖాతాలు తెరవాలని సహకార శాఖ అధికారులు నిబంధన పెట్టారు. ఈ ఖాతాలను ఏలూరులోని డీసీసీబీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని మెలిక పెట్టారు. అలా చేయకపోతే రుణమాఫీ కుదరంటున్నారు. రుణాలు తీసుకున్న రైతులకు సహకార సంఘాల్లో ఖాతాలు ఉన్నప్పటికీ.. వాటిలో ఆన్లైన్ విధానం అందుబాటులో లేనికారణంగా డీసీసీబీలో ఖాతా తెరవమంటున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పటికప్పుడు ఎలా రైతులు ఇప్పటికిప్పుడు రూ.200 చెల్లించి ఖాతా తెరవడమంటే జరిగేపనికాదు. అదీకాక ఈనెల 20వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తికావాలని డీసీసీబీ సీఈవో వీవీఎస్ ఫణికుమార్ డీసీసీబీ బ్రాంచి మేనేజర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు. అంతేకాదు ఖాతాతోపాటు కస్టమర్ ఐడీ, పట్టాదార్ పాస్ పుస్తక ం నంబర్, సర్వే నంబర్, ఆధార్, రేషన్ కార్డు నంబర్లు, రైతుల మొబైల్ ఫోన్ నంబర్ కూడా విధిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అయితే ఇదంతా చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. రైతులకు అవగాహన కల్పించడానికి, సమాచారం చేయవేయడానికే మూడు రోజుల సమయం సరిపోదు. మరోవైపు పలు సహకార సంఘాల్లో సిబ్బంది నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలతో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాంటిచోట రైతులకు దిశా నిర్దేశం చేసేవారే ఉండరు. అలాం టప్పుడు మొత్తం ప్రక్రియ ఇంత తక్కువ సమయంలో పూర్తవ్వాలంటే జరిగేపని కాదని తెలిసినా ఉన్నతాధికారులు ఈ విధమైన ఆదేశాలివ్వడం వెనుక ఆంతర్యమేమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. బక్షి సిఫార్సుల అమలుకేనా... డీసీసీబీ బ్రాంచ్‌లలో సహకార సంఘాలను విలీనం చేసేవిధంగా ప్రకాష్‌బక్షి కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికే కొత్తగా బ్యాంకు ఖాతా అంశాన్ని తెరపైకి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు ఎక్కువగా సహకార సంఘాల నుంచే రుణాలు తీసుకుంటుంటారు. ఈవిధంగా ఏటా సుమారు రూ.1,500 కోట్ల రుణాలను సహకార సంఘాలు ఇస్తున్నాయి. సుమారు రూ.1,200 కోట్ల డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ప్రకాష్‌బక్షి కమిటీ సిఫార్సులను అమలుచేస్తే సహకార సంఘాలు ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన రుణాలు, సేకరించిన డిపాజిట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) బ్రాంచిలకు బదిలీ అవుతాయి. రైతుల నుంచి వసూలు చేసిన షేరు ధనాన్ని కూడా బదిలీ చేయడంతోపాటు ఇకనుంచి డిపాజిట్ల సేకరణ, రుణాలు అందించే అవకాశాన్ని సొసైటీలు వదులుకోవాల్సి వస్తుంది. బిజినెస్ కరస్పాండెంట్లుగా విలీనం అనంతరం సంఘాలు డీసీసీబీకి బిజినెస్ కరెస్పాండెట్స్గా కమీషన్ ప్రాతి పదికన వ్యవహరిస్తాయి. డీసీసీబీ తరపున రుణాలు ఇవ్వడం, వసూళ్లు చేయ డం, డిపాజిట్లు సేకరించడం చేస్తే వాటిపై సంఘాలకు కమీషన్ అంది స్తారు. సంఘాలు ఎరువులు, వ్యవసా య ఉపకరణాలను అద్దెకివ్వడం, ధాన్యం గోడౌన్స్ అద్దెకు ఇచ్చుకోవడం తదితర వ్యాపారాలకు మాత్రమే పరిమితమవుతాయి. రైతులు నేరుగా డీసీసీబీ నుంచే రుణాలు తీసుకోవాలి. ఈ విధానం వల్ల రైతులకు రుణాలు సత్వరమే అందించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఒక్కో మండలంలోనూ కనీసం 5 సహకార సంఘాలు ఉండటంతో రుణాలు పొందడం తేలికవుతోంది. ఆ స్థాయిలో డీసీసీబీ బ్రాంచిలు లేవు. ఖాతా ఉంటేనే రుణమాఫీ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ పొందాలంటే సొసైటీ పరిధిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బ్రాంచిలో విధిగా అకౌంట్ తెరవాలి. ఆ ఖాతాకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేరుుంచుకోవాలి. డీసీసీబీలో ఖాతా తెరవని వారికి రుణమాఫీ వర్తించదు. - సందీప్‌కుమార్ సుల్తానియూ, రాష్ట్ర కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ -
అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలి
వైఎస్సార్ సీపీ నేత కె.పార్థసారథి సాక్షి, విజయవాడ : రైతులు ఉద్యానవన పంటలు, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ తదితర అనుబంధ రంగాల కోసం తీసుకున్న రుణాలనూ ప్రభుత్వం మాఫీ చేయాలని వైస్సార్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి కె.పార్థసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీతారాంపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 68వ స్వాతంత్య్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సారథి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు రుణాలను మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి రైతులు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకోవాలని, అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు పండకపోయినా రైతుల్ని అనుబంధ రంగాలు ఆదుకుంటాయని చెప్పి, ఆ రంగాలకు కావాల్సిన రుణాలను ఇప్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ చెల్లిస్తారనే ఆశతో అనేక మంది రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేదన్నారు. దీనివల్ల వారు వడ్డీ రాయితీ, సబ్బిడీ కోల్పోయారని వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నా, లేకపోయినా రైతులు తీసుకున్న రుణాలు ఆధారంగా రైతు రుణమాఫీ చేయాలన్నారు. ప్రభల శ్రీనివాస్, ఎంఎస్‌బేగ్, నారుమంచినారాయణ, ఎం.ఎస్.నారాయణ, జ్యోతిరెడ్డి, బొట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు కడితే సరి.. లేదంటే చర్యలే మరి
ప్రభుత్వం రేపోమాపో రుణాలు మాఫీ చేస్తుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులు, డ్వాక్రా మహిళలకు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా, పంట రుణాలు రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. వీలైనంత త్వరగా వసూలు చేసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు రావడంతో బ్యాంకర్లు వసూళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. నిన్నయిన్నటి వరకూ రైతులు, డ్వాక్రా మహిళలకు నోటీసులు ఇస్తూ.. వారి సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతూ వచ్చిన బ్యాంక్ అధికారులు తాజాగా తక్షణమే రుణాలు చెల్లించాలంటూ ఎక్కడికక్కడ బోర్డులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఊరూరా ఆటోల్లో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో వ్యవసాయ అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను, బంగారు ఆభరణాలపై తీసుకున్న, మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలను గడువులోగా చెల్లించి ఆర్బీఐ సూచనల ప్రకారం ప్రకారం వడ్డీ, రాయితీలు వినియోగించుకోవాలని చెబుతున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆందోళన మొదలైంది. ఏంచేయాలో పాలుపోవడం లేదని వారంతా వాపోతున్నారు. తాళ్లపూడి -
తప్పు రైతులదా..చంద్రబాబుదా..?
బ్యాంకు అధికారులను నిలదీసిన అన్నదాతలు రుణాలు చెల్లించి అధిక వడ్డీల నుంచి బయట పడాలన్న బ్యాంకు అధికారులు ససేమిరా అంటూ తెగేసి చెప్పిన రైతులు చీడికాడ: ‘సక్రమంగా రుణాలు చెల్లించుకుంటున్న మమ్మల్ని కట్టొద్దని, అధికారంలోకి వస్తే మాఫీ చెస్తామన్న చంద్రబాబుది తప్పా.. ఆ మాటలు నమ్మి మోసపోయిన మాది తప్పా... ’అంటూ ఆంధ్రా బ్యాంకు అధికారులును రైతులు నిలదీసిన సంఘటన మండలంలోని అర్జునగిరిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బకాయిలు వసూళ్లకు ఉదయాన్నే చోడవరం ఆంధ్రా బ్యాంకు అధికారులు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమయ్యారు. మేనేజర్ శంకరరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీలోగా రుణాలు చెల్లించి చక్రవడ్డీల భారం నుంచి బయట పడాలన్నారు. అప్పుడే పంటల బీమా వర్తిస్తుందని, లేకుంటే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని పేర్కొన్నారు. రుణాల చెల్లింపులో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన ఇక్కడి రైతులు మొండి బకాయిదారులుగా ఎందుకు మారారని మేనేజర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రైతులు పరువాడ నాయుడు,చొక్కాకుల సూరిబాబు, నర్సింహామూర్తిలు మాట్లాడుతూ పంటలు పండక పోయినా అప్పులు చేసైనా ఏటా రుణాలు చెల్లించి, మళ్లీ తీసుకునేవారమన్నారు. మూడేళ్లుగా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరిగి రుణాలు కట్టొద్దని, తాము అధికారంలోకి వస్తే రుణాలు మొత్తం మాఫీ చెస్తామనిచెప్పి నేడు మాటతప్పింది ఎవరంటూ రైతులు ఎదురు తిరిగారు. దీనికి మేనేజర్ మాట్లాడుతూ తాము రాజకీయనాయకులం కాదని.. ముందు మీరు రుణాలు చెల్లించండి తరువాత రుణమాఫీ సొమ్మును మీకిచ్చేస్తామన్నారు. అయితే ఆ సొమ్మునే మీరు జమచేసుకొండంటూ రైతులు బదులిచ్చారు. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లించే స్థితిలేదన్నారు. మీకు నచ్చిన పని చేసుకోండంటూ రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు చెసేదేమి లేక అక్కడ నుంచి నిష్ర్కమించారు. -
రుణాలు మాఫీ చేసే వరకు నిలదీస్తాం
ఒంగోలు క్రైం: ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అన్న సామెతను అక్షరాలా నిజం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమయంలో తనకు అపార అనుభవం ఉందని, ఎన్నికల హామీలను ఏ విధంగా నెరవేర్చాలో తనకు తెలుసని ఎన్నికల సంఘానికి చెప్పిన చంద్రబాబు, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాలు మాఫీ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అధికార టీడీపీని నిలదీస్తూనే ఉంటుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు లెక్కలేనివిగా ఉన్నాయన్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేసి..కొత్త రుణాలిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చిన సంగతి టీడీపీ నేతలు మరిచినట్లున్నారన్నారు. రైతులు సాగుకు ఉద్యుక్తులైన సమయంలో రుణాలు మాఫీ చేయకుండా..కొత్త రుణాలు ఇవ్వకుండా ఉంటే ఎలా? ఈ పరిస్థితి ఎన్నికల సమయంలో గుర్తు రాలేదా అని టీడీపీ నేతలను రఘువీరారెడ్డి ప్రశ్నించారు. కొత్త రుణాల సంగతి దేవుడెరుగు..పాత రుణాలు కట్టాలని బ్యాంకర్లు బెదిరింపులకు దిగుతున్నారని..కనీసం వాటినైనా టీడీపీ నేతలు ఆపలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్థికంగా చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలకు పునరుజ్జీవం కల్పిస్తామని చెప్పినా ఇప్పుడేమో సంఘానికి లక్ష వరకు మాత్రమే రుణమాఫీ అనడం సిగ్గుచేటన్నారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెట్టడం టీడీపీ ప్రభుత్వ దివాళా కోరుతనమేనని ఎండగట్టారు. చేనేత కార్మికుల రుణాలతోపాటు పవర్‌లూంలకు చెందిన రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని..ఇప్పటి వరకు అసలు వీటి ఊసే లేద న్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకు ఉమ్మడిగా ప్రయోజనం చేకూరేలా రాజ్యాంగంలో పొందు పరిచి ఉందని, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇష్టానుసారం మాట్లాడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అన్యాయం చేయాలని చూడడం దారుణమన్నారు. తొలుత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా.ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టినా అది ప్రకాశం జిల్లా నుంచే మొదలు పెట్టాలని రఘువీరారెడ్డిని కోరారు. అదే విధంగా పీసీసీ కార్యాలయం కూడా ఒంగోలులోనే నిర్మించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రఘువీరారెడ్డితో కలిసి కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కారుమంచి రమాదేవి, పీసీసీ కార్యదర్శి ఈదా సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు వై.శశికాంత్ భూషణ్, వేమా శ్రీనివాసరావు, డా.జి.రాజ్‌విమల్, కె.కనకారావు మాదిగ, మెండు నిషాంత్, ఆర్.వెంకటరావు, కె.జ్వాలారావు, ఎం.కృష్ణారావు, వై.రాజశేఖర్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ఒంగోలు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు డా.ఉగ్రనరసింహారెడ్డితో కలిసి డీసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని తిరిగి రైతు, డ్వాక్రా, చేనేతల రుణమాఫీలు చేయనందుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాబు మోసాలపై నిలదీయాలి
పుంగనూరు: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీయాలని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలిసారిగా పుంగనూరు మండలంలోని గ్రామాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. మండలంలోని జౌకొత్తూరులో పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా అలజనేరు గ్రామంలో జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి ప్రసంగించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రకాల రైతుల రుణాలను, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామనీ, వెయ్యిరూపాయల పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసి రెండు నెలలు కావస్తున్నా, బాబు మాయమాటలతో, కమిటీల పేరుతో రోజుకొక ప్రకటన ఇస్తూ ప్రజల ను మోసగిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఉచిత కరెంటు ఇచ్చారని, రైతుల రుణాలు తీర్చారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుపరిచేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల తరువాత ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత ప్రకటనలను ప్రజలు నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రజలు చైతన్యవంతులుకావాలని కోరారు. నియోజకవర్గంలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు అధికారం తమదేనని, ఇందులో విమర్శలకు తావులేదన్నారు. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్‌ఎంపీపీ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌లు రెడ్డెప్ప, నాగిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రామసముద్రం సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనకు అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. కానీ పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరూ హాజరుకాలేదు. చిన్నారులకు అభివాదం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల పర్యటనలో భాగంగా కురప్పల్లెకు వెళ్లారు. అక్కడ చిన్నారులు ‘‘ఎమ్మెల్యేసార్ ..’’ అంటూ నమస్కారం చేయగా.. ఎమ్మెల్యే ‘‘వెరీగుడ్’’ అంటూ చిరునవ్వుతో ప్రతినమస్కారం చేయడం పలువురిని ఆకట్టుకుంది. -
రుణమాఫీ కోసం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఇంటి వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన కాకినాడ: రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై డ్వాక్రా మహిళలు తిరగబడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... కాకినాడలో బుధవారం దాదాపు 200 మంది డ్వాక్రా సంఘాల మహిళలు స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఇంటింటికీ వచ్చి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పడంతో ఓట్లు వేసి గెలిపించామని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితేగానీ డొక్కాడని తాము రుణాలు రద్దయితే ఆర్థికంగా చేయూత లభిస్తుందనే నమ్మకంతో అధికారం కట్టబెట్టామని, సీఎం చంద్రబాబుఆ మాటే మరిచారని చెప్పారు. ఇప్పుడు రుణాలు ఎవరు చెల్లిస్తారని గట్టిగా ప్రశ్నించారు. ‘‘మీరు రుణ మాఫీ చేయకపోవటం వల్ల తీసుకున్న రుణానికి 13 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది. లక్ష రూపాయల అప్పున్న గ్రూపు అదనంగా 13 వేలు కట్టాల్సి వస్తోంది. ఈ వడ్డీ ఇంకా పెరుగుతుంది. దీన్నెవరు కడతారు?’’ అని వారు ప్రశ్నించారు. కొందరి సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును రుణాల కింద జమ చేసుకుంటున్నారన్నారు. టీడీపీ మోసంతో తమ కష్టార్జితాన్ని కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేఇంట్లో లేకపోవడంతో ఆయన సోదరుడు సత్యనారాయణ వారిని సముదాయించి పంపారు. -
పంటల బీమాకు స్పందన కరువు!
{పధాన పంటలకు రేపటితో ముగియనున్న గడువు ఇప్పటివరకు ప్రీమియం చెల్లించని రైతులు హైదరాబాద్: మరో రెండురోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ రైతుల నుంచి పంటల బీమా పథకాలకు కనీస స్పందన కరువైంది. జాతీయ పంటల బీమా పథకం(ఎన్సీఐపీ), సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్) కింద ప్రధాన పంటల బీమాకు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. వరి, పత్తి, టమాటా, ఎర్ర మిర్చి, కంది పంటలకు 31తో, బత్తాయి, ఆయిల్‌పామ్ పంటలకు ఆగస్టు 10తో, వేరుశనగకు ఆగస్టు 15తో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. ఎన్సీఐపీ, ఎంఎన్ఏఐఎస్ల కింద జిల్లాల వారీగా వరి, కంది సహా వివిధ పంటలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి, గుంటూరులో మిర్చి, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ, చిత్తూరులో టమాటా, పశ్చిమ గోదావరిలో ఆయిల్‌పామ్, వైఎస్సార్ జిల్లాలో బత్తాయి పంటలను గుర్తించినట్టు పేర్కొంది. గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా సౌకర్యం కల్పించింది. వర్షాలు కురవక పంట నష్టపోయిన రైతులకు బీమా మొత్తాన్ని చెల్లించాలన్నది ఈ పథకాల ఉద్దేశం. అరుుతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదు. పంట, సాగు విస్తీర్ణం, ఎంత మొత్తానికి బీమా అనే అంశాలపై ఈ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు మాఫీ కాలేదు. రీ షెడ్యూల్ సైతం జరగలేదు. రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో రైతులు ఎప్పటినుంచో పాత బకారుులు చెల్లించడం మానుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడా పంటల బీమాకు స్పందన లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా గడువును పొడిగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
డ్వాక్రా మహిళలకు బ్యాంకు నోటీసులు
లక్కవరపుకోట : అంతా అనుకున్నట్టే జరిగింది. ఎన్నికలకు ముందు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో ప్రజలు టీడీపీని గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతు, డ్వాక్రా రుణ మాఫీలపై రోజుకు మాట చెప్పిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు ఈ నెల 21న క్యాబినెట్ సమావేశంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు, డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే బ్యాంకర్లు మాత్రం రుణాలు కట్టని డ్వాక్రా సభ్యులకు నోటీసులు పంపిస్తున్నారు. లక్కవరపుకోటలోని ఏపీజీవీబీ సిబ్బంది 24వ తేదీ నుంచి డ్వాక్రా సంఘ సభ్యులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏడు రోజుల్లో కట్టని ఎడల క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఏపీజీవీబీలో పట్టణానికి చెందిన గణేష్ మహిళా సంఘ సభ్యులు 2012 సెప్టెంబర్‌లో 4,20,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తర్వాత ఎన్నికల నేపథ్యంలో వచ్చిన హామీలతో కొన్ని నెలలు వాయిదాలు కట్టలేదు. దీంతో 1,67,920 రూపాయలు వెంటనే కట్టాలని సంఘ సభ్యులకు గురువారం నోటీస్ అందింది. అలాగే దివ్య మహిళా సంఘ సభ్యులకు కూడా 1,85,076 రూపాయలు చెల్లించాలని నోటీసులు అందాయి. దీంతో మహిళా సంఘ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నోటీసులు ఎందుకు పంపిస్తున్నారో అర్థం కావడం లేదని లబోదిబోమంటున్నారు. మండల కేంద్రంలోని ఒక్క ఏపీజీవీబీ నుంచే 131 సంఘాలకు సంబందించి కోటీ 78 లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపినట్లు బీఎం జె. సూర్యకిరణ్ తెలిపారు. మోసపోయాం ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు రుణాలు చెల్లించలేదు. తీరా ఇప్పుడు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదు. బాబు మాటలు నమ్మి మోసపోయాం. - గణేష్ మహిళా సంఘ సభ్యులు ఆదేశాలు రాలేదు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. రుణాలు చెల్లించని వారికి నోటీసులు పంపిస్తున్నాం. ఏడు రోజుల్లో చెల్లించని వారిపై చర్యలు తప్పవు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే రద్దుకు చర్యలు తీసుకుంటాం. - జె.సూర్యకిరణ్, ఏపీజీవీబీ బీఎం, లక్కవరపుకోట -
నారాపై రైతుల కన్నెర
సాక్షి ప్రతినిధి, విజయనగరం :గద్దెనెక్కించిన మాఫీ నాటకం ‘రుణ’రంగంగా మారుతోంది. మీ రుణాలను తీర్చేస్తానని, మిమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కించేస్తాననీ చెప్పి ఓట్లేయించుకున్న చంద్రబాబు తీరా గద్దెనెక్కిన తరువాత వాటిని విస్మరించి కల్లబొల్లి మాటలు, కమిటీల కబుర్లు చెప్పడంతో జనం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కారు. చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, రైతులు గురువారం ఆందోళనలు చేశారు. పలుచోట్ల ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో హొరెత్తించారు. రుణాల మాఫీని వెంటనే అమ లు చేయాలని నినదించారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును నిరసి స్తూ జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, చీపురుపల్లి, కురుపాం, జియ్యమ్మవలస, బొబ్బిలి ప్రాంతాల్లో భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వాహనాలను నిలివేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులు, డ్వాక్రా మహిళలు ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే పి రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ అధికారం కట్టబెడితే రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తానన్నానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా రుణాలు మాఫీ చేయకుంటే రైతులపై పడే 12 శాతం వడ్డీ భారాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో కురుపాం మండలం కేంద్రంలో నిర్వహించిన నరకాసుర వధ-దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రుణమాఫీని రూ. లక్ష కోట్ల నుంచి రూ. 35 వేల కోట్లకు కుదించారన్నారు. డ్వాక్రా రుణాలపై కూడా స్పష్టమైన ప్రకట న చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబును నమ్మి ఓట్లేసిన ఇప్పుడు మహిళలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రుణాలు మొత్తం మాఫీ అని చెప్పి పరిమితులా? రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు పరిమితులు విధిస్తున్నారని, అసలు ఎప్పుడు మాఫీ చేస్తారో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారని కురుపాం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు విమర్శించారు. జియ్యమ్మవల మండలంలో ని పెదమేరంగి కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా శత్రుచర్ల మాట్లాడు తూ చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకూ పోరాటం ఆపే ది లేదన్నారు. మూడు రోజులపాటు ఆందోళనలు చేస్తామన్నారు. నయవంచకుడు చంద్రబాబు ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు నయవంచకుడని చీపురుపల్లి ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం కప్పదాటుడు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. మండలంలోని జి ములగాంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మోసాన్ని రైతులకు,డ్వాక్రా మహిళలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. పార్వతీపురం ఎమ్మార్ నగర్లో... చంద్రబాబు జిమ్మిక్కు లు నమ్మి ప్రజలు ఆయనకు పట్టం కట్టారని పార్వతీపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి జమ్మాన ప్రసన్నకుమార్ అన్నా రు. నరకాసుర వధ కా ర్యక్రమంలో భాగంగా మండలంలోని ఎమ్మార్ నగర్లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. -
హామీ మేరకే రుణాలు మాఫీ
మంత్రి కొల్లు రవీంద్ర కోనేరుసెంటర్ (సుల్తానగరం) : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారని రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మండల పరిధిలోని సుల్తానగరంలో రైతులు, డ్వాక్రా మహిళలతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబానికి రూ. 1లక్షా50వేలతో పాటు డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల రుణాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారని చెప్పారు. నూతన రాజధాని విషయంలో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. 216 జాతీయ రహదారి నాలుగు లైన్లు అభివృద్ధి, మచిలీపట్నం - రేపల్లె రైలు మార్గం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బందరు పోర్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పోర్టును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, గ్రంథాలయ మాజీచైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, గ్రామ సర్పంచి మట్టా వెంకటదాసు, ఎంపీటీసీ మురాల దేవి, మండల పార్టీ అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పాల్గొన్నారు. మోడల్‌గా గిలకలదిండి ఫిషింగ్ హార్బర్... గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్‌ను ఆయన సందర్శించారు. కోల్డు స్టోరేజి తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం మత్స్యశాఖ, పోర్టు అధికారులు, బోటు యజమానులు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం మత్స్యరంగంలోనే లభిస్తుందన్నారు. హార్బర్లో ఎంపెడా ఆధ్వర్యంలో రూ. 60 లక్షల నిధులతో ఐస్‌ప్లాంట్ ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపెడా అధికారి హనుమంతరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం,బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు తమ్ము ఏడుకొండలు, మత్స్యశాఖ ఏడి సురేష్, మునిసిపల్‌చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారు.... డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇవ్వటంతో తాము రుణాలు చెల్లించలేదని అయితే డ్వాక్రాగ్రూపునకు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో తమపై అదనపు భారం పడుతోందని పలువురు డ్వాక్రా మహిళలు మంత్రి కొల్లు రవీంద్ర వద్ద వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోకున్నా డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణం రద్దయ్యేలా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని మంత్రి వివరించారు. -
అమలు చేయలేని హామీలతో బాబు మోసం
వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం కంచికచర్ల రూరల్ : అమలు చేయలేని హామీలిచ్చి సీఎం చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. కంచికచర్లలో ఆయన ఆదివారం నందిగామ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి డాక్టర్ మెండితోక జగన్మోహన్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ హామీల కోసం చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. రాజధాని కోసం చందాలు, హుండీలు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. హైద్రాబాద్‌లో సీఎం క్యాంపు ఆఫీస్ కోసం రూ.10కోట్లు ఖర్చుపెట్టారని, అదే నగదు మన రాష్ట్రంలో ఖర్చుచేస్తే కొన్ని కార్యాలయాలైనా పూర్తయ్యేవని పేర్కొన్నారు. రుణాల మాఫీపై వెంటనే స్పష్టత ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదవి కోసం ఆరాటం పడ్డారే తప్ప, రైతుల సంక్షేమం కోసం ఏం పనిచేయ లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కోవెలమూడి వెంకటనారాయణ, మంగునూరి కోండారెడ్డి, చింతా రవీంద్రనాధ్, నంబూరి పెదబాబు, అబ్బూరి శివనాగమల్లేశ్వరరావు, మార్త శ్రీనివాసరావు, కాలవ వాసుదేవరావు పాల్గొన్నారు. తల్లిదండుల్ని క్షోభ కు గురి చేయకండి పెద్దాపురం(వీరులపాడు) : విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు జీవితాంతం క్షోభపడుతూ బతకాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారధి, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యిప్పల నాగిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జి మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.