ఎత్తుల జిత్తులు | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

ఎత్తుల జిత్తులు

Published Mon, Aug 18 2014 12:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఎత్తుల జిత్తులు - Sakshi

ఎత్తుల జిత్తులు

 సాక్షి, ఏలూరు:అన్నదాతను ఇబ్బందులకు గురిచేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని తొలుత చెప్పిన సర్కారు ఆనక పరిమితులు విధించి మోసం చేసింది. అది చాలదన్నట్టు సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలు మాఫీ కావాలంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో కొత్త ఖాతా లు తెరవాలంటూ సహకార శాఖ కొత్త మెలిక పెట్టింది. ఉద్యోగులు, రైతుల వ్యతిరేకత నడుమ నిలిచిపోయిన ప్రకాష్‌బక్షి కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఇదో ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ దిశగా తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఖాతాలు తెరిపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
 
 సొసైటీలో ఖాతా ఉన్నా..
 జిల్లాలో 257 సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో ఖాతాలున్న 1.99 లక్షల మంది రైతులు రూ.1,130 కోట్లను వ్యవసాయ రుణాలుగా తీసుకున్నారు. వారిలో ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షల చొప్పున సుమారు రూ.850 కోట్ల మేర రుణమాఫీ చేయూల్సి ఉంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆ రైతులంతా ఆధార్ కార్డు నంబర్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంది. అదేవిధంగా 30 అంశాలతో కూడిన ఫారం  పూరిం చాలి. పట్టాదారుపాస్ పుస్తకం, రేషన్ కార్డు నంబర్లను కూడా అందజేయాలి.
 
 ఇప్పటికే కొందరు రైతులు ఆధార్ నంబ ర్లను సహకార సంఘాల్లో అందజేశారు. ఇప్పుడు అలాకాదని డీసీసీబీ బ్రాంచ్‌లో కొత్తగా ఖాతాలు తెరవాలని సహకార శాఖ అధికారులు నిబంధన పెట్టారు. ఈ ఖాతాలను ఏలూరులోని డీసీసీబీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని మెలిక పెట్టారు. అలా చేయకపోతే రుణమాఫీ కుదరంటున్నారు. రుణాలు తీసుకున్న రైతులకు సహకార సంఘాల్లో ఖాతాలు ఉన్నప్పటికీ.. వాటిలో ఆన్‌లైన్ విధానం అందుబాటులో లేనికారణంగా డీసీసీబీలో ఖాతా తెరవమంటున్నామని అధికారులు చెబుతున్నారు.
 
 అప్పటికప్పుడు ఎలా
 రైతులు ఇప్పటికిప్పుడు రూ.200 చెల్లించి ఖాతా తెరవడమంటే జరిగేపనికాదు. అదీకాక ఈనెల 20వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తికావాలని డీసీసీబీ సీఈవో వీవీఎస్ ఫణికుమార్ డీసీసీబీ బ్రాంచి మేనేజర్లు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. అంతేకాదు ఖాతాతోపాటు కస్టమర్ ఐడీ, పట్టాదార్ పాస్ పుస్తక ం నంబర్, సర్వే నంబర్, ఆధార్, రేషన్ కార్డు నంబర్లు, రైతుల మొబైల్ ఫోన్ నంబర్ కూడా విధిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అయితే ఇదంతా చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. రైతులకు అవగాహన కల్పించడానికి, సమాచారం చేయవేయడానికే మూడు రోజుల సమయం సరిపోదు. మరోవైపు పలు సహకార సంఘాల్లో సిబ్బంది నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలతో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాంటిచోట రైతులకు దిశా నిర్దేశం చేసేవారే ఉండరు. అలాం టప్పుడు మొత్తం ప్రక్రియ ఇంత తక్కువ సమయంలో పూర్తవ్వాలంటే జరిగేపని కాదని తెలిసినా ఉన్నతాధికారులు ఈ విధమైన ఆదేశాలివ్వడం వెనుక ఆంతర్యమేమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
 
 బక్షి సిఫార్సుల అమలుకేనా...
 డీసీసీబీ బ్రాంచ్‌లలో సహకార సంఘాలను విలీనం చేసేవిధంగా ప్రకాష్‌బక్షి కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికే కొత్తగా బ్యాంకు ఖాతా అంశాన్ని తెరపైకి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎక్కువగా సహకార సంఘాల నుంచే రుణాలు తీసుకుంటుంటారు. ఈవిధంగా ఏటా సుమారు రూ.1,500 కోట్ల రుణాలను సహకార సంఘాలు ఇస్తున్నాయి. సుమారు రూ.1,200 కోట్ల డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ప్రకాష్‌బక్షి కమిటీ సిఫార్సులను అమలుచేస్తే సహకార సంఘాలు ఇప్పటివరకు రైతులకు ఇచ్చిన రుణాలు, సేకరించిన డిపాజిట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) బ్రాంచిలకు బదిలీ అవుతాయి. రైతుల నుంచి వసూలు చేసిన షేరు ధనాన్ని కూడా బదిలీ చేయడంతోపాటు ఇకనుంచి డిపాజిట్ల సేకరణ, రుణాలు అందించే అవకాశాన్ని సొసైటీలు వదులుకోవాల్సి వస్తుంది.
 
 బిజినెస్ కరస్పాండెంట్లుగా
 విలీనం అనంతరం సంఘాలు డీసీసీబీకి బిజినెస్ కరెస్పాండెట్స్‌గా కమీషన్ ప్రాతి పదికన వ్యవహరిస్తాయి. డీసీసీబీ తరపున రుణాలు ఇవ్వడం, వసూళ్లు చేయ డం, డిపాజిట్లు సేకరించడం చేస్తే వాటిపై సంఘాలకు కమీషన్ అంది స్తారు. సంఘాలు ఎరువులు, వ్యవసా య ఉపకరణాలను అద్దెకివ్వడం, ధాన్యం గోడౌన్స్ అద్దెకు ఇచ్చుకోవడం తదితర వ్యాపారాలకు మాత్రమే పరిమితమవుతాయి. రైతులు నేరుగా డీసీసీబీ నుంచే రుణాలు తీసుకోవాలి. ఈ విధానం వల్ల రైతులకు రుణాలు సత్వరమే అందించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఒక్కో మండలంలోనూ కనీసం 5 సహకార సంఘాలు ఉండటంతో రుణాలు పొందడం తేలికవుతోంది. ఆ స్థాయిలో డీసీసీబీ బ్రాంచిలు లేవు.
 
 ఖాతా ఉంటేనే రుణమాఫీ
 సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ పొందాలంటే సొసైటీ పరిధిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బ్రాంచిలో విధిగా అకౌంట్ తెరవాలి. ఆ ఖాతాకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేరుుంచుకోవాలి. డీసీసీబీలో ఖాతా తెరవని వారికి రుణమాఫీ వర్తించదు.
 - సందీప్‌కుమార్ సుల్తానియూ,
 రాష్ట్ర కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement