‘బ్యాంకు’ తీరును నిరసిస్తూ ఆందోళన | 'Bank' concern how to protest | Sakshi
Sakshi News home page

‘బ్యాంకు’ తీరును నిరసిస్తూ ఆందోళన

Published Tue, Sep 30 2014 12:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'Bank' concern how to protest

ఆసిఫాబాద్‌లో రైతుల రాస్తారోకో     
 
ఆసిఫాబాద్: బ్యాంకు అధికారు ల వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఒక్కో రైతుకు రూ.లక్ష పంట రుణాల మాఫీ చేసింది. కొత్త రుణాల కోసం అవసము న్న డాక్యుమెంట్లను జత చేసి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటిం చింది. దీంతో రెండు రోజులుగా రైతులు మీ సేవా కేంద్రాల ద్వారా పహణీలు తీసుకొని స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా రు. ఈ బ్యాంకులో 3,200 మంది రైతుల డాక్యుమెంట్లను కంప్యూటర్‌లో పొం దుపరచాల్సి ఉంది. మంగళవారం గడువు ముగుస్తుండడంతో వందలాది మం ది రైతులు బ్యాంకుకు వచ్చారు.

అయితే స్థలాభావంతో సిబ్బంది ప్రధాన గేటు ను మూసివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు రహదారిపై బైఠాయించారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. తమ దరఖాస్తులు తీసుకొని వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వ్యవసాయ మార్కె ట్ కార్యాలయాల వద్ద గ్రామ పంచాయతీల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరకాస్తులు స్వీకరిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై రాంబాబులు చెప్పడంతో రైతులు శాంతించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement