నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ: భారీ జరిమానా | RBI Imposes Huge Penalty on 4 Cooperative Banks | Sakshi
Sakshi News home page

నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ: భారీ జరిమానా

Published Wed, Sep 20 2023 9:26 PM | Last Updated on Wed, Sep 20 2023 9:33 PM

RBI Imposes Huge Penalty on 4 Cooperative Banks - Sakshi

కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు , మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్‌బీఐ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలు రుజువు కావడంతో ద్రవ్య పెనాల్టీ విధించబడుతుందని నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంటూ నాలుగు సహకార బ్యాంకులపై ద్రవ్య పెనాల్టీలను విధించింది. వీటిలో మూడు బ్యాంకులు గుజరాత్‌కు చెందినవి కాగా, మరొకటి మహారాష్ట్రకు చెందింది.  గుజరాత్‌కు చెందిన లాల్‌బాగ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై  అత్యధికంగా రూ.5 లక్షల జరిమానా విధించింది.

ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్‌మెంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను  ఉల్లంఘించినట్టు గుర్తించి  గుజరాత్, వడోదరలోని లాల్‌బాగ్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 5 లక్షల  జరిమానా విధించింది.  అలాగే పలు రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్ల రీపేమెంట్‌పై కస్టమర్లకు వడ్డీ సైతం చెల్లించలేదని ఆర్‌బీఐ తెలిపింది.  అలాగే గుజరాత్‌, మెహసానలోని ద కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ మెహసాన లిమిటెడ్ పై రూ. 3.50 లక్షల పెనాట్లీ వేసింది ఆర్‌బీఐ. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు ఇచ్చే లోన్లపై ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ను ఈ బ్యాంక్ అతిక్రమించినట్లు గుర్తించింది.  అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్‌పోజర్ లిమిట్ సైతం అతిక్రమించినట్లు తెలిపింది. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్‌?)

దీంతోపాటు  గుజరాత్‌ ద హర్జి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 3 లక్షల మానిటరీ పెనాల్టీ విధించింది. ఆర్‌బీఐ సమాచారం ప్రకారం CRR నిర్వహణ, ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్‌మెంట్ విషయంలో నిబంధనలను పాటించలేదు. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్‌పోజర్ లిమిట్ సైతం ఉల్లంఘించింది. (వాట్సాప్‌ చానెల్‌: ప్రధాని మోదీ రికార్డ్‌..షాకింగ్‌ ఫాలోవర్లు)

డిపాజిట్ అకౌంట్ల నిర్వహణలో లోపాలు, నిలిచిపోయిన ఖాతాల వార్షిక సమీక్ష వైఫల్యం  లాంటి  కారణాలతో మహారాష్ట్ర, ముంబైకి చెందిన ద నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై రూ. 1 లక్ష మానిటరీ పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్. డి విఫలమవడం వంటి కారణాలతో ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement