Compliance
-
నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ: భారీ జరిమానా
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు , మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలు రుజువు కావడంతో ద్రవ్య పెనాల్టీ విధించబడుతుందని నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంటూ నాలుగు సహకార బ్యాంకులపై ద్రవ్య పెనాల్టీలను విధించింది. వీటిలో మూడు బ్యాంకులు గుజరాత్‌కు చెందినవి కాగా, మరొకటి మహారాష్ట్రకు చెందింది. గుజరాత్‌కు చెందిన లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై అత్యధికంగా రూ.5 లక్షల జరిమానా విధించింది. ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గుర్తించి గుజరాత్, వడోదరలోని లాల్బాగ్ కోఆపరేటివ్ బ్యాంకుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అలాగే పలు రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్ల రీపేమెంట్‌పై కస్టమర్లకు వడ్డీ సైతం చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే గుజరాత్, మెహసానలోని ద కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ మెహసాన లిమిటెడ్ పై రూ. 3.50 లక్షల పెనాట్లీ వేసింది ఆర్బీఐ. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు ఇచ్చే లోన్లపై ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ను ఈ బ్యాంక్ అతిక్రమించినట్లు గుర్తించింది. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం అతిక్రమించినట్లు తెలిపింది. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) దీంతోపాటు గుజరాత్ ద హర్జి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 3 లక్షల మానిటరీ పెనాల్టీ విధించింది. ఆర్బీఐ సమాచారం ప్రకారం CRR నిర్వహణ, ఇతర బ్యాంకుల డిపాజిట్ల ప్లేస్మెంట్ విషయంలో నిబంధనలను పాటించలేదు. అలాగే ఇంటర్ బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ లిమిట్ సైతం ఉల్లంఘించింది. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) డిపాజిట్ అకౌంట్ల నిర్వహణలో లోపాలు, నిలిచిపోయిన ఖాతాల వార్షిక సమీక్ష వైఫల్యం లాంటి కారణాలతో మహారాష్ట్ర, ముంబైకి చెందిన ద నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై రూ. 1 లక్ష మానిటరీ పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్. డి విఫలమవడం వంటి కారణాలతో ఈ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. -
హెచ్‌డీఎఫ్‌సీకి, ఐజీహెచ్ హోల్డింగ్స్‌కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ) కి భారీ షాకిచ్చింది. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినందుకు శుక్రవారం 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీకి ఈ జరిమానా విధించింది. దీంతోపాటు IGH హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏకంగా రూ. 11.25 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది. 2019-20లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేక పోయిందని తమ పరిశీలనలో వెల్లడైందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆర్బీఐ కంపెనీ వివరణ తర్వాత, నిబంధనలకు అనుగుణంగా లేదని నిర్ధారించి జరిమానా విధించింది. వారి డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నామినేట్ చేసిన బ్యాంకు ఖాతాలకు కంపెనీ బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైనట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. అలాగే నిబంధనలు పాటించని కారణంగా ముంబైలోని ఐజీహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.11.25 లక్షల పెనాల్టీ విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లాభ, నష్టాల ఖాతాలో వెల్లడించిన నికర లాభంలో 20 శాతాన్ని రిజర్వ్ ఫండ్‌కు బదిలీ చేయాలనే చట్టబద్ధమైన నిబంధనను పాటించడంలో కంపెనీ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. -
గులాబీలో సమ్మతిరాగం..
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఫలించింది. అభ్యర్థుల ప్రకటనపై భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్చలు ఫలప్రదం కావడంతో దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ సమ్మతి రాగం వినిపిస్తోంది. భవిష్య త్తులో వచ్చే అవకాశాలపై అధిష్టానం తరఫున హామీ ఇవ్వడంతో అసంతృప్త నేతలు సైతం పార్టీ అభ్యర్థులతో కలసి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇక అసమ్మతికి తెరపడినట్లేనని టీఆర్ఎస్ భావిస్తోంది. చెన్నూరుతో మొదలు... రాజకీయ ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ వారిని సైతం ఆశ్చర్యపరుస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో ఏదైనా కారణంతో అభ్యర్థులను మారు స్తారనే ఆశతో పలువురు ఆశావహులు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేయడం, మరికొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించింది. టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చర్చల వ్యూహం మొదలుపెట్టారు. చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో చర్చలు ఫలించాయి. అనంతరం అన్ని జిల్లాలకు ఇదే సూత్రం అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎక్కువ నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతలకు మధ్య తొలుత అంతరం నెలకొంది. ఉప్పల్‌లో అభ్యర్థిని మార్చాలని కార్పొరేటర్లు గట్టిగా డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ విషయాల్లోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమన్వయం చేసి ఈ సెగ్మెంట్ల అసమ్మతి నేతలను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అందరూ కలసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిన స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, మహబూబాబాద్, ఖమ్మం, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, అలంపూర్, నిర్మల్, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, ముథోల్, మంథని, మానకొండూరు, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, నర్సాపూర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, తుంగతుర్తి సెగ్మెంట్ల అసమ్మతి విషయంలోనూ కేటీఆర్ ఇదే సూత్రం అమలు చేశారు. మొత్తంగా ఎన్నికల నోటిఫిషన్‌కు పది రోజుల ముందే టీఆర్ఎస్లో అసమ్మతులకు దాదాపుగా ముగింపు పలికినట్లయింది. ఇక రామగుండం, భూపాలపల్లి విషయంలోనూ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసి దీన్ని పూర్తి చేయనున్నారు. కల్వకుర్తిలోనూ కథ సుఖాంతం... కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అసమ్మతి సెగ సమసిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్ పేరును ప్రకటించడంతో ఇక్కడ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో పార్టీలో చేరి పోటీ చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తుండటంతో ఆ దిశగానూ ఆలోచించారు. దీంతో నారాయణరెడ్డి, ఆయన అనుచరులు జైపాల్ యాదవ్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. నారాయణరెడ్డితో మంత్రి కేటీఆర్ గురువారం చర్చలు జరిపారు. అభ్యర్థుల మార్పు ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని నారాయణరెడ్డికి సూచించారు. భవిష్యత్తులో కచ్చితంగా మంచి అవకాశం కల్పిస్తామని నారాయణరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. దీంతో తాను పార్టీ మారాలనే ఆలోచన చేయలేదని, టీఆర్ఎస్ అభ్యర్థితో కలసి ప్రచారం చేస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్‌తో కలసి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కల్వకుర్తిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు వెళ్లారు. దీంతో కల్వకుర్తి టీఆర్ఎస్లో అసమ్మతి ముగిసిపోయింది. అధిష్టానం నిర్ణయం శిరోధార్యం: శంకరమ్మ టికెట్ కేటాయింపులో టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మాహుతికి పాల్పడిన శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారన్నారు. -
సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్‌మెంట్లవారీగా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు. కొందరు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్ కౌన్సెలింగ్‌లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్ కౌన్సె లింగ్ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్‌కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ౖపై కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పొరపాట్లు సరిదిద్దారు.. టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్ తేదీల గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్‌కౌన్సెలింగ్ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) వెబ్‌కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్‌కౌన్సెలింగ్ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్సైట్ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది. -
రైతుల సమ్మతి లేకుండా భూసేకరణ చేయొద్దు
రైతు సంఘం నాయకుల డిమాండ్ ఊకల్ హవేలిలో రైతుల గ్రామసభ గీసుకొండ : పరిశ్రమల కోసం మండలంలోని ఊకల్, శాయంపేట హవేలి, సంగెం మండలం స్టేష¯ŒS చింతలపెల్లి, కృష్ణానగర్‌లలో ప్రభుత్వం రైతుల సమ్మతి లేకుండా భూ సర్వే, సేకరణలు చేపట్టవద్దని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బలవంతంగా భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఊకల్ హవేలిలో రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కూసం రాజమౌళి, మోర్తాల చందర్రావుతో పాటు భూ నిర్వాసితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ చింతమల్ల రంగయ్య, కార్యదర్శి పెద్దారపు రమేశ్‌లు మాట్లాడారు. భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బేతినేని నర్సింగరావు అధ్యక్షతన జరిగిన రైతుల గ్రామ సభలో ప్రభుత్వానికి పరిశ్రమ స్థాపన కోసం రైతుల పంట భూములను ఇచ్చేది లేదని తీర్మానించారు. బలవంతంగా సేకరిస్తే ప్రతిఘటన ఉద్యమాలు చేస్తామన్నారు. రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య, రాజేశ్వర్‌రావు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.