- రైతు సంఘం నాయకుల డిమాండ్
- ఊకల్ హవేలిలో రైతుల గ్రామసభ
రైతుల సమ్మతి లేకుండా భూసేకరణ చేయొద్దు
Published Wed, Sep 14 2016 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
గీసుకొండ : పరిశ్రమల కోసం మండలంలోని ఊకల్, శాయంపేట హవేలి, సంగెం మండలం స్టేష¯ŒS చింతలపెల్లి, కృష్ణానగర్‌లలో ప్రభుత్వం రైతుల సమ్మతి లేకుండా భూ సర్వే, సేకరణలు చేపట్టవద్దని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బలవంతంగా భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఊకల్ హవేలిలో రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కూసం రాజమౌళి, మోర్తాల చందర్‌రావుతో పాటు భూ నిర్వాసితుల పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ చింతమల్ల రంగయ్య, కార్యదర్శి పెద్దారపు రమేశ్‌లు మాట్లాడారు. భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బేతినేని నర్సింగరావు అధ్యక్షతన జరిగిన రైతుల గ్రామ సభలో ప్రభుత్వానికి పరిశ్రమ స్థాపన కోసం రైతుల పంట భూములను ఇచ్చేది లేదని తీర్మానించారు. బలవంతంగా సేకరిస్తే ప్రతిఘటన ఉద్యమాలు చేస్తామన్నారు. రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య, రాజేశ్వర్‌రావు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement