భూసేకరణ బాగా చేశావ్‌ | Land acquisition is done well says KCR | Sakshi
Sakshi News home page

భూసేకరణ బాగా చేశావ్‌

Published Sat, Jul 22 2017 2:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

భూసేకరణ బాగా చేశావ్‌ - Sakshi

భూసేకరణ బాగా చేశావ్‌

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు సీఎం కేసీఆర్‌ ప్రశంస
 
జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): ‘కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ కోసం భూ సేకరణ బాగా చేశావ్‌.. శభాష్‌ వెంకట్రామ్‌రెడ్డి’అని సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని అభినందించారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 2 రోజులుగా సీఎం వ్యవసాయ పనుల్లో తల మునకలై ఉన్నారు. మర్కూక్‌ మండలం పాములపర్తి శివారులో ఉన్న చెరువు వద్ద కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మించనున్నారు. దీనికి అవసరమైన భూమి కోసం సీఎం 15 రోజుల క్రితం ముంపు గ్రామాల ప్రజలతో తన ఫామ్‌హౌస్‌లో సమా వేశమయ్యారు.

ఆయనిచ్చిన హామీతో మామిడ్యాల, తానేదార్‌పల్లి, బహిలం పూర్, తండా గ్రామాల రైతులు పది రోజులుగా 80 శాతం భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ పనుల్ని కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఆయన సీఎం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లినప్పుడు.. కొండపోచమ్మసాగర్‌ భూ సేకరణ చాలా వేగంగా చేశారంటూ సీఎం కలెక్టర్‌ను ప్రశంసించారు. మిగతా 20 శాతం వెంటనే పూర్తి చేయాలని సూచించారు. హరితహారంలో గజ్వేల్‌ రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉండేలా మొక్కలు నాటాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిసింది. కాగా కేసీఆర్‌ ప్రస్తుతం వ్యవసాయక్షేత్రంలో వరినాట్ల పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement