అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు.
హైదరాబాద్ : అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి భౌతికకాయాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి నివాళుర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం రాజయ్య, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి చిరంజీవి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కేశవరావు, బాల్క సుమన్, మాజీ మంత్రి దానం నాగేందర్, టీటీడీపీ నేత రమణ తదితరులు కాకా భౌతికకాయన్ని సందర్శించి నివాళుర్పించారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలిస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళుర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ఊరేగింపుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం 2గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.