మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లె మండలం చెన్నపురావు గ్రామంలో వెంకటస్వామి (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దకొత్తపల్లె: మహబూబ్ నగర్ జిల్లా పెద్దకొత్తపల్లె మండలం చెన్నపురావు గ్రామంలో వెంకటస్వామి (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే వెంకటస్వామి ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.