Rahul Gandhi asked to vacate MP bunglow after disqualification - Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..

Published Mon, Mar 27 2023 6:25 PM

Lok Sabha Housing Panel Notice To Rahul Gandhi To Vacate Bungalow - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది.  ఆయన నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని పేర్కొంది.

కాగా.. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ అన్నారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం కేసు పెట్టారు. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసి ఎంపీగా తొలగించింది.
చదవండి: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement