banglaw
-
రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయన నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని పేర్కొంది. కాగా.. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ అన్నారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం కేసు పెట్టారు. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం లోక్‌సభ సెక్రెటేరియట్ రాహుల్‌పై అనర్హత వేటు వేసి ఎంపీగా తొలగించింది. చదవండి: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్ -
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందుకు ఆరు వారాలు గడువిస్తూ నోటీసులు పంపింది. సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం 2016 జనవరిలో ఢిల్లీలో అధికారిక నివాసం కేటాయించింది. రాజ్యసభ ఎంపీ అయిన ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. దీంతో బంగ్లాను ఇతర ఎంపీలకు కేటాయించాల్సి ఉన్నందున ఆయన ఖాళీ చేయాలని కోర్టు సూచించింది. సుబ్రహ్మణ్యం రియాక్షన్.. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. 2016లో తాను ఎంపీ కాకముందే భద్రతా కారణాల దృష్ట్యా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనకు జడ్ ప్లస్ కేటగిరీతో ఢిల్లీలో బంగ్లా కేటాయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను ఎంపీ అయ్యాక అదే బంగ్లాలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. తనకు బంగ్లా కావాలని ఎప్పుడూ ఎవర్నీ అడగలేదని స్పష్టం చేశారు. అయితే పాత ఒప్పందం మళ్లీ కొనసాగుతుందా అని భద్రతా అధికారులకు లేఖ రాశానని వివరించారు. ఈ విషయంపైనే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కానీ కేంద్రం తనకు బంగ్లా కేటాయించలేమని చెప్పిందని పేర్కొన్నారు. అందులో ఇబ్బందేమీ లేదని, తాను బంగ్లా ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి: డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్య -
వివాదంలో బిగ్‌బీ బంగ్లా, కూల్చివేయాలని బీఎంసీ ఆదేశం
ముంబైలోని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ దంపతుల బంగ్లా ప్రతీక్ష చూడటానికి ఇంద్రభవంలా ఉంటుంది. అటూగా వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రతీక్ష నుంచి చూపు తిప్పుకోలేరు. చెప్పాలంటే వారి బంగ్లా టూరిస్టు ప్లేస్‌ను తలిపించేలా ఉంటుంది. ప్రతి రోజు వందల మంది అభిమానులు ప్రతీక్ష దగ్గర క్యూ కడుతుంటారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్‌బీ బంగ్లా ప్రతీక్ష వివాదంలో చిక్కుకుంది. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా డిమాండ్ చేశారు. అంతేగాక 2017లో రోడ్డు విస్తిర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసిందని, ఇప్పుడు ఆ నోటీసులపై వెంటనే చర్యలు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత మిరండా బీఎంసీని కోరారు. కాగా ముంబై అమితాబ్ మొదటగా నిర్మించుకున్న బంగ్లా పేరు ప్రతీక్ష. దీని తర్వాత ఆయన జాల్సా అనే మరోక బంగ్లాను కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రతీక్ష రోడ్డు విస్తిరణలో భాగమై ఉందని వెంటనే దానిని బీఎంసీ స్వాధీనం చేసుకుని కుల్చివేయాలంటూ మిరండా వ్యాఖ్యానించారు. తులిప్ బ్రియాన్ మిరండా శనివారం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన.. ‘అమితాబ్ బచ్చన్‌కు 2017లోనే ప్రతీక్ష అక్రమ నిర్మాణంలో ఉందంటూ బీఎంసీ నోటీసులు ఇచ్చింది. వీటిని రోడ్డు విస్తిర్ణంలో భాగంగా జారీ చేసింది. అయితే బీఎంసీ ఇప్పటి వరకు ఉదాసీనంగానే వ్యవహరించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. అదే ఓ సామాన్యుడికి చెందిన భూమి అయి ఉంటే బీఎంసీ ఇప్పటికే దానిని స్వాధీనం చేసుకుని ఉండేది. మున్సిపల్ చట్టం ప్రకారం భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు’ అని ఆయన ప్రశ్నించారు. అయితే అమితాబ్ మరికొందరూ తమ బంగ్లాలకు సంబంధించిన మెయిన్ మ్యాప్‌లలో మార్పులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కాగా కాంగ్రెస్ నేత మిరండా ఆరోపణల మేరకు బీఎంసీ కౌన్సిలర్ స్పందిస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, ఆయన బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
స.హ. చట్టానికి సర్కార్ తూట్లు
నందిగామ రూరల్ : సమాచార హక్కు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని చట్టం రాష్ట్ర కమిషనర్ లాం తాంతియాకుమారి పేర్కొన్నారు. స్థానిక రహదారి బంగ్లాలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చట్టం ఇప్పటికీ ప్రజలకు చేరువ కాలేదన్నారు. కలెక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పారు. అర్జీదారు కోరిన సమాచారం ఇవ్వని పక్షంలో సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు అధికారులు తమ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. సమాచారం పొందగోరే వారు రిజిస్టర్ పోస్టు ద్వారా అర్జీలు పంపాలని, తద్వారా నిర్ణీత గడువులోగా సమాచారం అందని పక్షంలో ఎకనాలెడ్జ్మెంటు కార్డు సాక్ష్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయ¶æూలల్లో 41బీ, సిటిజన్ చార్ట్ విధిగా ఏర్పాటు చేయాలని, అందుకు ఏ శాఖ మినహాయింపు కాదని స్పష్టం చేశారు. తక్షణమే ఇవి అన్ని కార్యాలయాల వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రీరామకృష్ణను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కురగంటి హనుమంతరావు పాల్గొన్నారు. -
వీసీ బంగ్లాలో చోరీకి విఫలయత్నం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధికార నివాసంలో శనివారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. వీసీ బంగ్లా వెనుక వైపు నుంచి దొంగలు చొరబడగానే సెక్యూరిటీగార్డులు విజిల్ వేయడంతో వారు అమ్మాయిల హాస్టల్స్‌లోకి పారిపోయి .. ప్రహారీ దూకివెళ్లిపోయారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ ఆదివారం ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్సిటీలో పోలీసు భద్రత పెంచాలని కోరారు.