స.హ. చట్టానికి సర్కార్ తూట్లు
నందిగామ రూరల్ : సమాచార హక్కు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని చట్టం రాష్ట్ర కమిషనర్ లాం తాంతియాకుమారి పేర్కొన్నారు. స్థానిక రహదారి బంగ్లాలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చట్టం ఇప్పటికీ ప్రజలకు చేరువ కాలేదన్నారు. కలెక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పారు. అర్జీదారు కోరిన సమాచారం ఇవ్వని పక్షంలో సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు అధికారులు తమ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. సమాచారం పొందగోరే వారు రిజిస్టర్ పోస్టు ద్వారా అర్జీలు పంపాలని, తద్వారా నిర్ణీత గడువులోగా సమాచారం అందని పక్షంలో ఎకనాలెడ్జ్‌మెంటు కార్డు సాక్ష్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయ¶æూలల్లో 41బీ, సిటిజన్ చార్ట్ విధిగా ఏర్పాటు చేయాలని, అందుకు ఏ శాఖ మినహాయింపు కాదని స్పష్టం చేశారు. తక్షణమే ఇవి అన్ని కార్యాలయాల వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రీరామకృష్ణను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కురగంటి హనుమంతరావు పాల్గొన్నారు.