శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధికార నివాసంలో శనివారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు.
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధికార నివాసంలో శనివారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. వీసీ బంగ్లా వెనుక వైపు నుంచి దొంగలు చొరబడగానే సెక్యూరిటీగార్డులు విజిల్ వేయడంతో వారు అమ్మాయిల హాస్టల్స్‌లోకి పారిపోయి .. ప్రహారీ దూకివెళ్లిపోయారు.
ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ ఆదివారం ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వర్సిటీలో పోలీసు భద్రత పెంచాలని కోరారు.