
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్న జనాన్ని ఇప్పటికైనా ఆదుకోండని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ సందర్భంగా రాజస్థాన్ పేదలకు కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ కల్పిస్తున్న ఉపశమనాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ మంగళవారం హిందీలో ట్వీట్లు చేశారు.
‘ కేంద్ర ప్రభుత్వం వసూలుచేస్తున్న ధర కంటే సగం ధరకే రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది చూసైనా మీ బడా పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు లబ్ధి చేకూర్చడం ఆపి ప్రజలకు ఉపశమనం కల్పించే పనులు మొదలుపెట్టండి’ అని ట్వీట్‌చేశారు.
చదవండి: ఖర్గే వ్యాఖ్యలపై... దద్దరిల్లిన పార్లమెంటు