ప్రేమ వ్యవహారం బయటపెట్టిన నటి | Swara Bhaskar confirms her relationship with Himanshu Sharma | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం బయటపెట్టిన నటి

Published Fri, May 13 2016 8:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ప్రేమ వ్యవహారం బయటపెట్టిన నటి - Sakshi

ప్రేమ వ్యవహారం బయటపెట్టిన నటి

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన ప్రేమ వ్యవహారాన్ని ఎట్టకేలకు వెల్లడించింది. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ రైటర్ హిమాన్షు శర్మతో అమ్మడు డేటింగ్ చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రూమర్లు వచ్చాయి. అయితే పెళ్లి వార్తలను స్వర భాస్కర్ తోసిపుచ్చింది.

'త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇప్పుడప్పుడే పెళ్లి పీటలు ఎక్కే ఉద్దేశం లేదు. మీమిద్దరం కెరీర్ లో బిజీగా ఉన్నాం. ప్రస్తుతానికి కెరీర్ కే మా ప్రాధాన్యం' అని ఆమె తెలిపింది. తామిద్దం డేటింగ్ లో ఉన్నామని, తమ కమిట్ మెంట్ పై హ్యాపీగా ఉన్నామని వెల్లడించింది. హిమాన్షు తన అభిమాన స్క్రిప్ట్ రైటర్ అని వెల్లడించింది.

గుజారిష్, తనూ వెడ్స్ మనూ, ఔరంగజేబు, రాంజనా, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో తదితర సినిమాల్లో స్వర భాస్కర్ నటించింది. అబ్బాస్ టైర్ వాలా లేటెస్ట్ మూవీ 'మ్యాంగో'లో ఆమె నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement