Himanshu Sharma
-
హిమాన్షును పెళ్లి చేసుకున్న కనికా ధిల్లాన్
గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్లు కనికా ధిల్లాన్, హిమాన్షు శర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు అతి కొద్ది మందే హాజరైనట్లు తెలుస్తోంది. డిసెంబర్లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట తాజాగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన విషయాన్ని సోమవారం నాడు సోషల్ మీడియా సాక్షిగా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా కనికా భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. 2021లో కొత్త ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ నవ దంపతులకు నటి తాప్సీ, మంచు లక్క్క్ష్మీ సహా పలువురు ప్రముఖులు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: రాఖీ సావంత్ విపరీత చేష్టలు) 'జడ్జిమెంటల్ హై క్యా', 'మన్మర్జియాన్' సినిమాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కనికాకు గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడితో వివాహం జరిగింది. అయితే వారి జీవితంలో మనస్పర్థలు తొంగి చూడటంతో కొంతకాలానికి కనికా, ప్రకాష్ విడిపోయారు. రియల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం కలిసి పని చేసేవారు. అలా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథను అందించారు. దీనికంటే ముందు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్ చేతులు కాల్చుకున్నారు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇక హిమాన్షు విషయానికి వస్తే.. తను 'వెడ్స్ మను', 'రాణీజానా', 'జీరో' చిత్రాలకు కథ అందించిన ఆయన నటి స్వరభాస్కర్‌తో కొంత కాలం ప్రేమాయణం నడిపారు. అయితే ఇద్దరు దారులు వేరని తెలుసుకుని ఆ బంధానికి ముగింపు పలికారు. (చదవండి: హిమాంశు, నేనూ విడిపోయాం: స్వరభాస్కర్) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) -
రెండో పెళ్లికి రెడీ అవుతున్న ప్రముఖ స్క్రీన్ రైటర్
బాలీవుడ్ ప్రముఖ స్క్రీన్ రైటర్లు కనికా ధిల్లాన్, హిమాన్షు శర్మ గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను రెట్టింపు చేసుకునేందుకు ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను కనికా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'జడ్జిమెంటల్ హై క్యా', 'మన్మర్జియాన్' సినిమాలకు రచయితగా పని చేసిన కనికాకు గతంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడితో వివాహం జరిగింది. (చదవండి: హిమాంశు, నేనూ విడిపోయాం: స్వరభాస్కర్) ప్రకాష్ దర్శకుడిగా ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ మూవీ తీసి ఘోరంగా విఫలం అయ్యాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. అయితే కొంతకాలానికి కనికా, ప్రకాష్ విడిపోయారు. రియల్ లైఫ్‌లో విడిపోయినా రీల్ లైఫ్‌లో మాత్రం కలిసి పని చేసేవారు. అలా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథను అందించారు. ఇక హిమాన్షు విషయానికి వస్తే.. తను 'వెడ్స్ మను', 'రాణీజానా', 'జీరో' చిత్రాలకు కథ అందించిన ఆయన నటి స్వరభాస్కర్‌తో కొంత కాలం ప్రేమాయణం నడిపారు. అయితే ఇద్దరు దారులు వేరని తెలుసుకుని ఆ బంధానికి ముగింపు పలికారు. (చదవండి: మూడు పువ్వులు... ఆరు కాయలు) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) -
అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్
ముంబై: ఇష్టపడిన వ్యక్తి నుంచి విడిపోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుందని.. అయితే దురదృష్టవశాత్తూ జరిగే సంఘటనలను ఎవరూ మార్చలేరని బాలీవుడ్ విలక్షణ నటి స్వరభాస్కర్ అన్నారు. ప్రేమలో ఉన్నపుడు ఒకరి కోసం ఒకరు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. సామరస్యపూర్వకంగా విడిపోవడంలో తప్పులేదన్నారు. రాంజానా, తను వెడ్స్ మను, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో స్వరా నటిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2011లో ఓ సినిమా షూటింగ్ సమయంలో స్క్రీన్ రైటర్ హిమాంశు శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధం ఆ తర్వాత బీటలు వారింది. అప్పటి నుంచి ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘పింక్విల్లా’తో మాట్లాడిన స్వరభాస్కర్ ప్రేమ- బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. ‘విడిపోవడం అనేది దురదృష్టకరం. అయితే మా విషయంలో పరస్పర నిందారోపణలు లేవు. మా ఇద్దరిలో ఓ ఒక్కరు ఎలాంటి తప్పు చేయలేదు. చెడుగా ప్రవర్తించలేదు. ఎవరినీ ఎవరు మోసం చేయలేదు. మనం ఒక దారిలో ప్రయాణిస్తున్నపుడు అందులో ఎన్నో మలుపులు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నపుడు ఒకరు కుడివైపు.. మరొకరు ఎడమ వైపు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు ఎవరో ఒకరు రాజీ పడాలి. నీతో కలిసి నడుస్తా అని చెప్పాలి. లేదంటే గుడ్ బై చెప్పి వెళ్లాలి. మా విషయంలో ఇదే జరిగింది. ఇతరుల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. నా జీవితంలో ఇలాంటివి ఎదురైనపుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది. కాబట్టి చాలా తొందరగా బాధ నుంచి బయటపడ్డాను’అని పేర్కొన్నారు. -
ప్రేమ వ్యవహారం బయటపెట్టిన నటి
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన ప్రేమ వ్యవహారాన్ని ఎట్టకేలకు వెల్లడించింది. అయితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ రైటర్ హిమాన్షు శర్మతో అమ్మడు డేటింగ్ చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రూమర్లు వచ్చాయి. అయితే పెళ్లి వార్తలను స్వర భాస్కర్ తోసిపుచ్చింది. 'త్వరలోనే మేం పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇప్పుడప్పుడే పెళ్లి పీటలు ఎక్కే ఉద్దేశం లేదు. మీమిద్దరం కెరీర్ లో బిజీగా ఉన్నాం. ప్రస్తుతానికి కెరీర్ కే మా ప్రాధాన్యం' అని ఆమె తెలిపింది. తామిద్దం డేటింగ్ లో ఉన్నామని, తమ కమిట్ మెంట్ పై హ్యాపీగా ఉన్నామని వెల్లడించింది. హిమాన్షు తన అభిమాన స్క్రిప్ట్ రైటర్ అని వెల్లడించింది. గుజారిష్, తనూ వెడ్స్ మనూ, ఔరంగజేబు, రాంజనా, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో తదితర సినిమాల్లో స్వర భాస్కర్ నటించింది. అబ్బాస్ టైర్ వాలా లేటెస్ట్ మూవీ 'మ్యాంగో'లో ఆమె నటిస్తోంది. -
కామన్వెల్త్ చెస్ నుంచి వైదొలిగిన హంపి
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి అర్ధంతరంగా వైదొలిగింది. నాలుగో రౌండ్లో హిమాన్షు శర్మ చేతిలో ‘టైమ్ కంట్రోల్’ నిబంధన కారణంగా హంపి ఓడిపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై హంపి అప్పీల్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని వివరిస్తూ హంపి అప్పీల్‌ను కమిటీ తోసిపుచ్చింది. దాంతో హంపి ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఐదో రౌండ్లో ఆర్గాదీప్దాస్తో జరిగిన గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ‘డ్రా’ చేసుకున్నాడు.