కామన్వెల్త్ చెస్ నుంచి వైదొలిగిన హంపి | Hampi departure from the Commonwealth Chess | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ చెస్ నుంచి వైదొలిగిన హంపి

Published Sat, Jun 27 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

Hampi departure from the Commonwealth Chess

న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి అర్ధంతరంగా వైదొలిగింది. నాలుగో రౌండ్‌లో హిమాన్షు శర్మ చేతిలో ‘టైమ్ కంట్రోల్’ నిబంధన కారణంగా హంపి ఓడిపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై హంపి అప్పీల్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని వివరిస్తూ హంపి అప్పీల్‌ను కమిటీ తోసిపుచ్చింది. దాంతో హంపి ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఐదో రౌండ్‌లో ఆర్గాదీప్‌దాస్‌తో జరిగిన గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ‘డ్రా’ చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement