Commonwealth Chess Championship
-
అభిజిత్, తానియాలకు టైటిల్స్
కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు క్లీన్‌స్వీప్ చేశారు. ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. కొలంబోలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఓపెన్ కేటగిరీలో అభిజిత్ గుప్తా 8 పాయింట్లతో విజేతగా నిలువగా... ఎస్.ఎల్.నారాయణన్ 7.5 పాయింట్లతో రజతం, దీపన్ చక్రవర్తి 7 పాయింట్లతో కాంస్యం సాధించారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో తానియా సచ్దేవ్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తొలిసారి స్వర్ణం సాధించింది. భారత్‌కే చెందిన మేరీ ఆన్ గోమ్స్, కిరణ్ మనీషా మొహంతి రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. -
కామన్వెల్త్ చెస్ నుంచి వైదొలిగిన హంపి
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి అర్ధంతరంగా వైదొలిగింది. నాలుగో రౌండ్లో హిమాన్షు శర్మ చేతిలో ‘టైమ్ కంట్రోల్’ నిబంధన కారణంగా హంపి ఓడిపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నిర్ణయంపై హంపి అప్పీల్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని వివరిస్తూ హంపి అప్పీల్‌ను కమిటీ తోసిపుచ్చింది. దాంతో హంపి ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఐదో రౌండ్లో ఆర్గాదీప్దాస్తో జరిగిన గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ‘డ్రా’ చేసుకున్నాడు. -
హంపి, లలిత్ గెలుపు
న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, లలిత్ బాబు వరుసగా మూడో విజయాన్ని సాధించారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నాసిర్ అహ్మద్ (బంగ్లాదేశ్)పై హంపి, రఘునందన్ (భారత్)పై లలిత్ బాబు గెలిచారు. మూడో రౌండ్ తర్వాత వీరిద్దరూ మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.