అభిజిత్, తానియాలకు టైటిల్స్ | Abhijit Gupta Retains Commonwealth Chess Championship | Sakshi
Sakshi News home page

అభిజిత్, తానియాలకు టైటిల్స్

Published Mon, Aug 8 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

Abhijit Gupta Retains Commonwealth Chess Championship

కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్

 న్యూఢిల్లీ : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు క్లీన్‌స్వీప్ చేశారు. ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. కొలంబోలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఓపెన్ కేటగిరీలో అభిజిత్ గుప్తా 8 పాయింట్లతో విజేతగా నిలువగా... ఎస్.ఎల్.నారాయణన్ 7.5 పాయింట్లతో రజతం, దీపన్ చక్రవర్తి 7 పాయింట్లతో కాంస్యం సాధించారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో తానియా సచ్‌దేవ్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తొలిసారి స్వర్ణం సాధించింది. భారత్‌కే చెందిన మేరీ ఆన్ గోమ్స్, కిరణ్ మనీషా మొహంతి రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement