న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సాధ్వి ప్రాచి వీరి వివాహంపై తీవ్రంగా స్పందించారు. శ్రద్ధ వాకర్‌కు పట్టిన గతే స్వర భాస్కర్‌కు పడుతుందని హెచ్చరించారు. బాహుశా పెళ్లికి ముందు స్వర భాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'శ్రద్ధవాకర్‌ను ఆమె ప్రియుడే 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన వార్తను స్వర భాస్కర్ ఎక్కువగా పట్టించుకోనట్లు ఉంది. పెళ్లి చేసుకోవాలనే పెద్ధ నిర్ణయం తీసుకునే ముందు స్వరభాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సింది. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేనేమీ ఎక్కువగా చెప్పలేను. కానీ శ్రద్ధ వాకర్‌కు ఏం జరిగిందో స్వర భాస్కర్‌కు కూడా అదే జరుగుతుంది.' అని సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు.
ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు.
ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి అడవిలో పడేశాడు.
చదవండి: పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే..
Comments
Please login to add a commentAdd a comment