షారూక్‌ ఖాన్‌ ఉత్తమ మనిషి.. ఇద్దరిలో రెండోస్థానం | Swara Bhaskar, Ankit Lal, Celebrities Social Media Comments | Sakshi
Sakshi News home page

షారూక్‌ ఖాన్‌ ఉత్తమ మనిషి.. ఇద్దరిలో రెండోస్థానం

Published Sat, Oct 23 2021 4:38 PM | Last Updated on Sat, Oct 23 2021 4:43 PM

Swara Bhaskar, Ankit Lal, Celebrities Social Media Comments - Sakshi

స్వర భాస్కర్, అంకిత్‌ లాల్

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 


వద్దంటే వద్దు

టీకాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికాలో పిల్లలకు టీకా తప్పనిసరి చేయడం పట్ల కాలిఫోర్నియా తల్లిదండ్రులు ప్రదర్శనకు దిగారు. ‘జీఈ’ సంస్థ ఉద్యోగులు వ్యతిరేక ప్రదర్శన జరిపారు. ఇటలీలో టీకా వ్యతిరేక నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించారు.
– ఆరన్‌ జిన్, జర్నలిస్ట్‌


ఉత్తమ మనిషి
సభ్యత, హుందాౖయెన ప్రవర్తనకు షారూక్‌ ఖాన్‌ ఉదాహరణ. ఇండియా అనే ఒక భావనలోని అన్ని ఉత్తమ లక్షణాలకు ఆయన ప్రతినిధి. ఆయనకూ, గౌరీకీ నా ప్రేమ.
– స్వర భాస్కర్, నటి


ఇద్దరిలో రెండోస్థానం

ప్రపంచంలో వంద కోట్ల జనాభా ఉన్నవి రెండే దేశాలు. చైనా: ఒక్క డోస్‌– 223 కోట్లు; రెండు డోసులు– 105 కోట్లు. భారత్‌: ఒక్క డోస్‌–100.7 కోట్లు; రెండు డోసులు– 29.3 కోట్లు. దీనర్థం వంద కోట్ల టీకాలు వేసిన దేశాల్లో మనది రెండో స్థానం అని.                      
– అంకిత్‌ లాల్, రచయిత


మరిచిపోలేని రోజు

1947 అక్టోబర్‌ 22న పాకిస్తాన్‌ సైన్యం అండ ఉన్న లష్కర్లు గొడ్డళ్లు, కత్తులు, తుపాకులతో జమ్మూకశ్మీర్‌ మీద దాడి చేశారు. పురు షులు, స్త్రీలు, పిల్లల మీద అనూహ్యమైన అకృత్యాలకు తెగబడ్డారు. బారాముల్లా కాన్వెంట్‌లోని నన్స్‌ను కూడా వదల్లేదు. దీన్ని ఎన్నటికీ మరిచిపోవద్దు; ఎన్నటికీ క్షమించొద్దు.
– నందిని బాహ్రీ, వ్యాఖ్యాత


వాళ్లకు వదిలేయాలి

నేను బొట్టు పెట్టుకుంటాను– నీ ఇష్టం. నేను బొట్టు పెట్టుకోను– అదీ నీ ఇష్టమే. నీకు నచ్చినా నచ్చకపోయినా బొట్టు పెట్టుకోవాల్సిందే– ఇది స్త్రీ మీద పెత్తనం. ఇప్పుడు దీన్నే ‘బొట్టు’ స్థానంలో ‘బుర్ఖా’ను మార్చి చదవండి. ఏం ధరించాలో, ఏం తినాలో మహిళలకు చెప్పడం పితృస్వామ్య అణిచివేత.                     
– అద్వైత్, హిస్టారియన్‌


నలుగురితో నారాయణ!

‘పేరెంట్స్‌’తో ఒక కార్యక్రమంలో ఉన్నాను. ఇద్దరు దంపతులు అక్కడికి రాగానే వేసుకోవడానికి మాస్కులు బయటికి తీసి, చుట్టూ ఉన్నవాళ్లకు లేకపోవడంతో వాళ్లు కూడా వేసు కోలేదు. దాంతో మాస్కు వేసుకున్నదాన్ని నేనొక్క దాన్నే అయ్యాను. ప్రజలు ఏం చేయాలో సామాజిక ధోరణి శాసిస్తుంది. సామాజిక ధోరణిని నియమ నిబంధనలు శాసిస్తాయి.
– నిస్రీన్‌ అల్వాన్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌

​​​​​​​
వీరుడికి వందనం

గ్రేట్‌ అష్ఫాకుల్లా ఖాన్‌ను ఆయన జయంతి రోజున(అక్టోబర్‌ 22) స్మరించుకుంటున్నాను. ఆయన హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ సహ వ్యవస్థాపకుడు; ప్రసిద్ధ ఖాకోరీ ఘటనలో ప్రముఖ పాత్ర పోషించినవాడు. నవ్వు ముఖంతో ఉరికంబం ఎక్కిన విప్లవకారుల్లో అష్ఫాకుల్లా ఖాన్‌ ఒకరు. అప్పుడాయనకు కేవలం 27 ఏళ్లు.
– రిజ్‌వాన్‌ అర్షద్, కర్ణాటక ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement