Ankit Lal
-
షారూక్ ఖాన్ ఉత్తమ మనిషి.. ఇద్దరిలో రెండోస్థానం
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! వద్దంటే వద్దు టీకాలను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికాలో పిల్లలకు టీకా తప్పనిసరి చేయడం పట్ల కాలిఫోర్నియా తల్లిదండ్రులు ప్రదర్శనకు దిగారు. ‘జీఈ’ సంస్థ ఉద్యోగులు వ్యతిరేక ప్రదర్శన జరిపారు. ఇటలీలో టీకా వ్యతిరేక నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించారు. – ఆరన్ జిన్, జర్నలిస్ట్ ఉత్తమ మనిషి సభ్యత, హుందాౖయెన ప్రవర్తనకు షారూక్ ఖాన్ ఉదాహరణ. ఇండియా అనే ఒక భావనలోని అన్ని ఉత్తమ లక్షణాలకు ఆయన ప్రతినిధి. ఆయనకూ, గౌరీకీ నా ప్రేమ. – స్వర భాస్కర్, నటి ఇద్దరిలో రెండోస్థానం ప్రపంచంలో వంద కోట్ల జనాభా ఉన్నవి రెండే దేశాలు. చైనా: ఒక్క డోస్– 223 కోట్లు; రెండు డోసులు– 105 కోట్లు. భారత్: ఒక్క డోస్–100.7 కోట్లు; రెండు డోసులు– 29.3 కోట్లు. దీనర్థం వంద కోట్ల టీకాలు వేసిన దేశాల్లో మనది రెండో స్థానం అని. – అంకిత్ లాల్, రచయిత మరిచిపోలేని రోజు 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ సైన్యం అండ ఉన్న లష్కర్లు గొడ్డళ్లు, కత్తులు, తుపాకులతో జమ్మూకశ్మీర్ మీద దాడి చేశారు. పురు షులు, స్త్రీలు, పిల్లల మీద అనూహ్యమైన అకృత్యాలకు తెగబడ్డారు. బారాముల్లా కాన్వెంట్‌లోని నన్స్ను కూడా వదల్లేదు. దీన్ని ఎన్నటికీ మరిచిపోవద్దు; ఎన్నటికీ క్షమించొద్దు. – నందిని బాహ్రీ, వ్యాఖ్యాత వాళ్లకు వదిలేయాలి నేను బొట్టు పెట్టుకుంటాను– నీ ఇష్టం. నేను బొట్టు పెట్టుకోను– అదీ నీ ఇష్టమే. నీకు నచ్చినా నచ్చకపోయినా బొట్టు పెట్టుకోవాల్సిందే– ఇది స్త్రీ మీద పెత్తనం. ఇప్పుడు దీన్నే ‘బొట్టు’ స్థానంలో ‘బుర్ఖా’ను మార్చి చదవండి. ఏం ధరించాలో, ఏం తినాలో మహిళలకు చెప్పడం పితృస్వామ్య అణిచివేత. – అద్వైత్, హిస్టారియన్ నలుగురితో నారాయణ! ‘పేరెంట్స్’తో ఒక కార్యక్రమంలో ఉన్నాను. ఇద్దరు దంపతులు అక్కడికి రాగానే వేసుకోవడానికి మాస్కులు బయటికి తీసి, చుట్టూ ఉన్నవాళ్లకు లేకపోవడంతో వాళ్లు కూడా వేసు కోలేదు. దాంతో మాస్కు వేసుకున్నదాన్ని నేనొక్క దాన్నే అయ్యాను. ప్రజలు ఏం చేయాలో సామాజిక ధోరణి శాసిస్తుంది. సామాజిక ధోరణిని నియమ నిబంధనలు శాసిస్తాయి. – నిస్రీన్ అల్వాన్, అసోసియేట్ ప్రొఫెసర్ వీరుడికి వందనం గ్రేట్ అష్ఫాకుల్లా ఖాన్‌ను ఆయన జయంతి రోజున(అక్టోబర్ 22) స్మరించుకుంటున్నాను. ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకుడు; ప్రసిద్ధ ఖాకోరీ ఘటనలో ప్రముఖ పాత్ర పోషించినవాడు. నవ్వు ముఖంతో ఉరికంబం ఎక్కిన విప్లవకారుల్లో అష్ఫాకుల్లా ఖాన్ ఒకరు. అప్పుడాయనకు కేవలం 27 ఏళ్లు. – రిజ్వాన్ అర్షద్, కర్ణాటక ఎమ్మెల్యే -
కేజ్రీవాల్ మరో ఘనత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ఘనత సాధించారు. మనదేశంలో ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. బుధవారం రాత్రికి ట్విటర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరింది. ట్విటర్ లో 60 లక్షల మార్క్ ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ తెలిపారు. ట్విటర్ లో కేజ్రీవాల్ కంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. 1.6 కోట్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాను విరివిరివిగా వాడే రాజకీయ నాయకుల్లో వీరిద్దరూ అగ్రస్థానంలో ఉన్నారు. ట్విటర్ లో ఎక్కువ మంది పాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేత శశి థరూర్ ఒకరు. ఆయనకు 35 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీల ట్విటర్ జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ 1.7కోట్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. -
సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార పర్వం
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారం కోసం అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను సైతం వాడుకుంటున్నాయి. వాటిద్వారా యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు తమకు పడేలా చేసుకునేందుకు తమ తమ పార్టీలకు చెందిన సామాజిక మాధ్యమ విభాగాలకు ఈ బాధ్యతను అప్పగించాయి. ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోషల్ మీడియా కన్వీనర్ అంకిత్‌లాల్ మాట్లాడుతూ ‘నగరంలో మాకు 16 మంది కీలక సభ్యులున్న బృందం ఉంది. వీరంతా సోషల్ మీడియాను పర్యవేక్షిస్తుంటారు. దేశంతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 55 మంది ఈ బాధ్యతల్లో పాలుపంచుకుంటారు. మాకు 200 మంది క్రియాశీలురైన వాలంటీర్లు కూడా ఉన్నారు.’ అని అన్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో నగరానికి చెందిన ప్రధాన పార్టీల మధ్య ప్రచార యుద్ధం జరుగుతోంది. ‘ప్రతిరోజూ ఈ రెండు సామాజిక మాధ్యమాల్లో సందేశాలను అన్ని పార్టీలు పోస్టు చేస్తున్నాయి. ఇంకా వీడియోలు ట్వీట్లతో ముందుకు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు విభిన్నంగా ముందుకు సాగుతున్నాయి. అనేక రకాల విన్యాసాలు చేస్తున్నాయి. బీజేపీకి వె య్యిమంది వాలంటీర్లు సామాజిక మాధ్యమాల్లో బీజేపీ తరఫున వెయ్యిమంది పనిచేస్తున్నారు. వీరంతా ఐటీ, బీపీఓ సంస్థల్లో ఉద్యోగులు. బీజేపీ చేపట్టిన ఆన్లైన్ ప్రచారానికి అంకితభావంతో పనిచేస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలద్వారా తమ పార్టీ అభ్యర్థులు, నాయకుల సందేశాలను వాటిలో ఉంచుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సమాచార విభాగం కన్వీనర్ ఖేమ్‌చంద్ శర్మ వెల్లడించారు. కిరణ్‌బేడీ, నరేంద్రమోదీ, అమిత్‌షాల సందేశాలను పార్టీ అధికారిక వెబ్సైట్లోనూ వీరు పోస్టు చేస్తుంటారు. వ్యూహాత్మంగా ఆప్ ముందుకు ఇక ఆన్లైన్ ప్రచారానికి సంబంధించి ఆప్‌వద్ద సూక్ష్మబుద్ధితో కూడిన వ్యవస్థ ఉంది. ఈ కారణంగా ఫేస్బుక్లో 23 లక్షలు, ట్వీటర్లో 11 లక్షల లైక్‌లు నమోదవుతున్నాయి. ఆ పార్టీ ఆన్లైన్ ప్రచారం విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయపతాకం ఎగురవేస్తుందని గుజరాత్‌కు చెందిన మరో నాయకుడు ధీమా వ్యక్తం చేశారు. తగినంత మెజారిటీ రావడం తథ్యమన్నారు. త్వరలో గుజరాత్లో జరగనున్న ఎన్నికలకు ఇది మార్గదర్శి అవుతుందన్నారు.