సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరసగా సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని సూచించింది.
చదవండి: క్లైమాక్స్ లేకుండా రిలీజైన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం..
డబుల్ మాస్క్ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. తనకు కరోనా అంటూ చేసిన పోస్ట్‌పై తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ‘గుడ్‌న్యూస్ చెప్పావు. ‘2022లో బెస్ట్ న్యూస్ ఇదే, కరోనా వచ్చిందా? అయిదే చచ్చిపో.. నీ మరణవార్త కోసం ఎదురు చూస్తుంటాం’ అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు స్పందించిన పోస్ట్స్ నెట్టంట చర్చనీయాంశమైంది.
చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’
Comments
Please login to add a commentAdd a comment