బాలీవుడ్ నటి స్వర భాస్కర్- సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్.. పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించిన స్వర భాస్కర్ ఇటీవలే సీమంతం వేడుక ఘనంగా జరుపుకుంది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 23న కూతురు పుట్టిందని పేర్కొన్నారు. అప్పుడే ఆమెకు పేరు కూడా ఖరారు చేశారు. తమ చిన్నారికి రుబియా అనే పేరు పెడుతున్నట్లు తెలిపారు.
స్వర భాస్కర్- ఫహద్ అహ్మద్ 201లో ఓ నిరసన కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అలా తొలుత రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఈ జంట మార్చిలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. జూన్‌లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లు పేర్కొంది స్వర భాస్కర్. తాజాగా పాపాయికి జన్మనిచ్చిన స్వర దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చదవండి: లీక్‌ల బెడద.. ఏదైనా అధికారికంగా ప్రకటిస్తాం: మంచు విష్ణు
Comments
Please login to add a commentAdd a comment