ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖను పంపారు. బెదిరింపు లేఖపై నటి స్వర భాస్కర్ వెర్సోవా పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వర భాస్కర్. 2017లో ఆమె వీరసావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్ చేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
Comments
Please login to add a commentAdd a comment