నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్‌ | Actor Hari Teja Baby Shower Ceremony | Sakshi
Sakshi News home page

నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్‌

Published Fri, Jan 8 2021 6:10 PM | Last Updated on Fri, Jan 8 2021 11:42 PM

Actor Hari Teja Baby Shower Ceremony - Sakshi

హైదరాబాద్‌: నటి, యాంకర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హరితేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు హరితేజ. కొద్ది రోజుల క్రితం తాను ప్రెగ్నెంట్‌ అని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక నేడు నటి సీమంతం వేడుక జరిగింది. బంధువులు, స్నేహితులు, కొందరు ఇండస్ట్రీ స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా వేడకల్లో హరితేజ తన స్నేహితురాలు హిమజతో కలిసి సందడి చేశారు. అంతేకాక బేబీ బంప్‌తో డ్యాన్స్‌ చేసి అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ హిమజ తన ఫేస్ బుక్‌లో హరితేజ సీమంతం వేడుకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. (చదవండి: మా ఇంటికి సంతోషం వచ్చింది)

2016లో దీపక్ రావుని వివాహమాడిన హరితేజ.. కెరియర్ పరంగా బిజీ అయ్యింది. తొలుత సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువై.. 2017లో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్‌గా అలరించి టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంది. రాజా ది గ్రేట్‌, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement