
తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో హరీశ్ ఉత్తమన్ ఒకడు.

కేరళకు చెందిన ఇతడు.. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూన్నాడు.

తాజాగా ఇతడి భార్య చిన్ను కురువిల్లాకు సీమంతం జరిగింది. ఈమె ఇతడికి రెండో భార్య..

గతంలో అమృత అనే మేకప్ ఆర్టిస్టుని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు.

శ్రీమంతుడు, కృష్ణగాడి వీరప్రేమగాధ, దువ్వాడ జగన్నాథం, జై లవకుశ తదితర సినిమాల్లో హరీశ్ ఉత్తమన్ ప్రతినాయకుడిగా నటించాడు.









