Harish Uthaman
-
‘కొరమీను’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కొరమీను.. ‘స్టోరీ ఆఫ్ ఈగోస్’ నటీనటులు: ఆనంద్ రవి, , హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోరీ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్ తదితరులు నిర్మాత: పెళ్లకూరు సమన్య రెడ్డి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: ఆనంద్ రవి దర్శకత్వం: శ్రీపతి కర్రి పాటలు: అనంత నారాయణన్ ఏజీ నేపథ్య సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర ఎడిటర్: విజయ్ వర్ధన్ కె విడుదల తేది: డిసెంబర్ 31, 2022 కథేంటంటే.. మీసాల రాజు (శత్రు) ఓ పవర్ఫుల్ పోలీసు అధికారి. ఆయనకు మీసాలు అంటే చాలా ఇష్టం. బదిలీపై విజయవాడ నుంచి వైజాగ్‌కు వచ్చిన తొలి రోజే కొంతమంది అపరిచితులు మీసాల రాజు మీసాలను బలవంతంగా తీసేస్తారు. పరువుగా భావించే తన మీసాలను తీసేయ్యాల్సిన అవసరం ఎవరికుందని విచారించడం మొదలుపెడతాడు మీసాల రాజు. ఈ క్రమంలో జాలరి పేట కరుణ గురించి తెలుస్తుంది. వైజాగ్‌లోని జాలరిపేటను తన గుప్పిట్లో పెటుకుంటాడు కరుణ( హరీశ్ ఉత్తమన్ ). అక్కడ డ్రగ్స్, ఇతర చట్ట విరుద్ద వ్యాపారాలు చేస్తూ.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు కోటి(ఆనంద్ రవి). అతనికి అదే గ్రామానికి చెందిన మీనాక్షి( కిశోరీ ధాత్రక్) అంటే పిచ్చి ప్రేమ. కానీ మీనాక్షి మాత్రం కరుణను ప్రేమిస్తుంది. కరుణ మాత్రం ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేస్తాడు. ఆ తర్వాత మీనాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆమెను కోటీ చేరదీశాడా లేదా? మీసాల రాజు మీసాలను ఎవరు తీశారు? ఎందుకు తీశారు? అసలు మీసాల రాజు విజయవాడ నుంచి వైజాగ్‌కు ఎందుకు బదిలీ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాను. ‘కోరమీను’ కూడా అలాంటిందే. ఇగో క్లాషెస్ నేపథ్యంలో కథనం సాగుతుంది. కొన్ని సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కోరమీను కథ పుట్టిందే అక్కడ నుంచి. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను ఈ సినిమాలో చూపించారు. ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంది. కరుణ అరచాకాలు.. కోటీ, మీనాక్షి మధ్య జరిగే డ్రామా సన్నివేశాలతో ఫస్టాఫ్ సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. క్లైమాక్స్‌కు 30 నిమిషాల ముందు కథలో వచ్చే ట్విస్టులు సినిమా స్థాయిని పెంచేశాయి. ఎవరు ఎవరి ట్రాప్‌లో పడ్డారనే విషయాన్ని ఊహించని విధంగా, ఆసక్తికరంగా చూపించారు. ఓ సింపుల్ స్టోరీని నెటివిటీ టచింగ్ ఇచ్చి, ఆసక్తిరకంగా చూపించడంతో దర్శకుడు శ్రీపతి కర్రి సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడు కోటి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కావాలని హీరోయిజం చూపించకుండా..కథకు అనుగుణంగా కొన్ని సందర్భాలతో మాత్రమే ఆయన హీరోలా కనిపిస్తాడు. మిగతా అన్ని సన్నివేశాల్లో సాదారణ యువకుడిలా సింపుల్‌గా కనిపిస్తాడు. మీనాక్షీ పాత్రలో కిశోరీ ధాత్రక్ పరకాల ప్రవేశం చేసింది. రొటీన్ హీరోయిన్ల పాత్రకు భిన్నంగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ఇక విలన్ కరుణ పాత్రకు హరీశ్ ఉత్తమన్ న్యాయం చేశాడు. మీసాల రాజుగా శత్రు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దేవుడుగా రాజా రవీంద్ర, సీఐ కృష్ణగా గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశారు. ఆనంద్ రవి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. ‘డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ, అసలైన పవర్ భయానిదేరా’, ‘మొగుడు లేకపోతే ఆడదానికి సుఖం ఉండదు..కానీ ప్రపంచం అంతా ఆడదానికే సుఖం ఇవ్వాలనుకుంటుంది’ లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, విజయ్ వర్ధన్ కె ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Korameenu: అసలైన పవర్ భయానిదేరా!
ఆనంద్ రవి హీరోగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. హరీష్ ఉత్తమన్, శత్రు, కిశోర్ దత్రక్, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. పెళ్లకూరు సమస్య రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని విడుదల చేశారు.'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట... వాళ్ళ క్యారెక్టరైజేషన్లు చెప్పేలా ఉన్నాయి. ఆనంద్ రవి నటనలో ఈజ్ ఉంది. జాలరిపేట యువకుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. టీజర్ చివర్లో గిరిధర్, ఇమ్మాన్యుయేల్ సీన్‌తో సినిమాలో కామెడీ కూడా ఉందని హింట్ ఇచ్చారు. ‘డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ, అసలైన పవర్ భయానిదేరా’ అంటూ హరీశ్ ఉత్తమన్ చెప్పే డైలాగ్ టీజర్లో ఉంది. ‘జాలరిపేట అనే మత్యకారుల కాలనీకి వస్తాడు పోలీసు మీసాల రాజు. ఆయన మీసాలు ఎవరు తీశారనేది ఆసక్తిగా ఉంటుంది’అన్నారు శ్రీపతి కర్రి. ఈ చిత్రంలో కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
రెండో పెళ్లి చేసుకున్న 'నాంది' నటుడు
తమిళ నటుడు హరీశ్ ఉత్తమన్ ఓ ఇంటివాడయ్యాడు. మలయాళ నటి చిన్ను కురువిల్లను పెళ్లాడాడు. గురువారం(జనవరి 20న) కేరళ మవెలిక్కరలోని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉంటే చిన్ను పలు మలయాళ చిత్రాల్లో నటించింది. 'నార్త్ 24 కతమ్', 'కసాబా', 'లుక్కా చుప్పి' వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక హరీశ్ విషయానికి వస్తే అతడు 'తని ఒరువన్', 'తొడారి', 'భైరవ', 'పాండ్య నాయుడు', 'పాయుం పులి', 'నట్పే తునై' తదితర చిత్రాల్లో నటించాడు. శ్రీమంతుడు, అశ్వత్థామ, వి, నాంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యాడు. కాగా ఇతడు 2018లో మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్పుర్ను వివాహమాడాడు. కానీ వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో ఏడాదికే విడిపోయారు. -
డిజిటల్‌తో నిర్మాతలకు లాభాలు
సాక్షి, చెన్నై : డిజిటల్‌తో నిర్మాతలు లాభాలు పొందండని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం నెంజిల్ తుణివిరుందాల్. సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి మెహరీన్ నాయకిగా ముఖ్య పాత్రల్లో విక్రాంత్, హరీశ్ఉత్తమన్ నటించారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథి గా పాల్గొన్న విశాల్ టీజర్‌ను ఆవిష్కరించారు. విశాల్ మాట్లాడుతూ నిర్మాతల మండలి అధక్షుడు కచ్చితంగా సినీ కార్యక్రమాల్లో పాల్గొనాలనేమీ లేదన్నారు. తనకు ఇలాంటి ఆడియో, టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం ఉండదని అన్నా రు. అయితే ఈ వేదికపై నాకు చాలా సన్నిహితులు ఉన్నారని, అందుకనే బయట ఎన్ని చర్చనీయాంశ సంఘటనలు జరుగుతున్నా ఈ నెంజిల్ తుణివిరుందాల్ చిత్ర టీజర్ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. చిత్రాలను డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విక్రయించి నిర్మాతలు అధిక లాభాలు పొందాలని అన్నారు. శాటిలైట్ హక్కులతో ఇంకా అధిక ఆదాయాన్ని పొందలేకపోతున్నామని, డిజిటల్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు చిత్రాలను విక్రయించి లాభాలను పొందండని చెప్పారు. ఆ విధంగా తుప్పరివాలన్, మగళీర్‌మట్టుం చిత్రాలు లాభపడ్డాయని తెలిపారు.డిజిటల్ ప్లాట్‌ఫామ్ సంస్థల గురించి నిర్మాతల మండలిలో వివరాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. -
'మహేశ్ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయా'
చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు తమిళంలో మాట్లాడుతుంటే విస్మయంతో చూస్తుండిపోయానని నటుడు హరీశ్ ఉత్తమన్ వెల్లడించారు. 'శ్రీమంతుడు' సినిమాలో హరీశ్ విలన్ గా నటించాడు. 'మొదటిరోజు మా మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. షాట్ ముగిసిన తర్వాత మానిటర్ దగ్గర కూర్చున్న మహేశ్ పక్కన కూర్చున్నా. సడన్ గా ఆయన తమిళంలో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను' అని హరీశ్ పేర్కొన్నాడు. 'మీకు తమిళం ఎలా తెలుసు అని మహేశ్ ను అడగ్గా... తాను చెన్నైలోచదువుకున్నానని ఆయన సమాధానమిచ్చారని చెప్పాడు. మహేశ్ స్నేహశీలిని ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో భాషాపరమైన సమస్యలు అధిగమించడానికి ఆయనెంతో సహకరించారని వెల్లడించాడు. తన కోసం 50 టేకులు చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదని తెలిపాడు. ఇంటర్వెల్ లో తనకు, మహేశ్ మధ్య వచ్చే ఫైట్ హైలెట్ గా నిలుస్తుందన్నాడు. 'శ్రీమంతుడు' సినిమాతో తెలుగులో తనకు అవకాశాలు పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు'లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సంపత్ రాజ్, సుకన్య, ముఖేష్ రిషి ముఖ్యపాత్రల్లో నటించారు. -
రవితేజ సినిమాలో 'పాండియనాడు' విలన్
చెన్నై: తమిళ చిత్రం 'పాండియనాడు'లో ప్రతినాయకుడిగా నటించిన హరీష్ ఉత్తమన్ టాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు. తెలుగులో రెండు అవకాశాలు చేజిక్కించుకున్నాడు. రవితేజ్ హీరోగా నటిస్తున్న 'పవర్' సినిమాలో అతడు విలన్ గా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నాడు. 'పాండియనాడు'లో తన నటన చూసి 'పవర్' దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) తనను సంప్రదించారని హరీష్ తెలిపాడు. గోపీచంద్ సినిమాలోనూ అవకాశం వచ్చిందని తెలిపాడు. ఈ రెండు సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నానని చెప్పాడు. అరడజను సినిమాలు తన చేతిలోనే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. గతేడాది విడుదలైన 'పాండియనాడు' తమిళనాట ఘన విజయం సాధించింది. విశాల్, లక్ష్మీమీనన్ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు.